AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirupati: కలిసి బతకలేం అనుకున్నారు, జంటగా ప్రాణం వదిలారు.. తిరుపతిలో సంచలనం రేపిన ప్రేమ జంట..

ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ప్రేమ జంట చేసిన పనికి ఒక్కసారిగా నగరం ఉలిక్కి పడింది. హోటల్‌ రూమ్‌లో విగత జీవులుగా కనిపించడంతో అంతా ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. ఇంతకీ ఈ ప్రేమ జంట ఎక్కడిని వచ్చారు.? ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు.?

Tirupati: కలిసి బతకలేం అనుకున్నారు, జంటగా ప్రాణం వదిలారు.. తిరుపతిలో సంచలనం రేపిన ప్రేమ జంట..
Representative Image
Narender Vaitla
| Edited By: Rajeev Rayala|

Updated on: Nov 08, 2022 | 10:16 PM

Share

ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ప్రేమ జంట చేసిన పనికి ఒక్కసారిగా నగరం ఉలిక్కి పడింది. హోటల్‌ రూమ్‌లో విగత జీవులుగా కనిపించడంతో అంతా ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. ఇంతకీ ఈ ప్రేమ జంట ఎక్కడిని వచ్చారు.? ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు.? తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుకి చెందిన అనూష, కృష్ణారావు ఎంతో గాడంగా ప్రేమించుకున్నారు. మొదట్లో స్నేహంగా మొదలైన వీరి బంధం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకొని కలకాలం కలిసి జీవించాలనుకున్నారు. అందరు ప్రేమికుల్లాగే అందమైన భవిష్యత్తు కోసం కలలు కన్నారు.

అయితే ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పలేక పోయారు. ఇంతలోనే అనూషకు వేరే వ్యక్తితో పెళ్లి అయిపోయింది. తమ ప్రేమ విషయాన్ని ఎవరికీ చెప్పక మనసులోనే ప్రేమను సమాధి చేసుకున్నారు. రెండేళ్లు గడిచాయి. మనిషక్కడ..మనసిక్కడ… మనసులో మాట చెప్పలేక..సర్దుకుపోలేక సతమతతం… ఒకరికి ఒకరు ఓదార్పు… అడపాదడపా ఫోన్‌లో పలకరింపులు..అప్పడప్పు కలిసి మాట్లాడుకోవడం… ఇంతలోనే ఓ నిర్ణయానికి వచ్చారు. లోకం ఏమైనా అనుకున్నా ఫర్వాలేదు తమ ప్రేమైక లోకమే ముఖ్యమనుకున్నారు. ఎవరేమనుకుంటారు.. ఏం జరుగుతుంది.. తప్పా ఒప్పా అనే ఆలోచనలు గట్టున పెట్టారు.. బ్యాగ్‌ సర్దేసుకుని ఓ చోట కలిశారు.. మనసాక్షి ప్రకారమే నిర్ణయం..కానీ ఏదో తెలియని భయం.. ఏదైనా కానీ అనుకున్నారు.. చేతిలో చెయ్యేసి బయలుదేరారు… సోమవారం తిరుపతి చేరుకున్నారు.

తిరుపతిలోని త్రిలోక్‌ లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నారు. కలిసి బతకలేక పోయాం, కలిసి చనిపోదామనుకున్నారో ఏమో.. ఇద్దరు కలిసి హోటల్‌ గదిలోనే ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహ్యతకు పాల్పడ్డారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతుల మొబైల్‌ ఫోన్‌ ఆధారంగా కొవ్వూరుకి చెందిన వారిగా గుర్తించారు. అనూష కన్పించడం లేదని ఈ నెల 3వ తేదీన కొవ్వూరు పోలీస్‌ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. ప్రేమ వ్యవహారం నేపథ్యంలో ఈ జంట ఆత్మహత్యు పాల్పడిందా.? లేదా మరేమైనా కారణం ఉందా? అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..