AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గూగుల్‌తో జాగ్రత్త గురూ.. వాడే ప్రతి ఒక్కరూ ఇది తెలుసుకోవాల్సిందే.. లేదంటే తిప్పటు తప్పవు!

ఈ మధ్య కాలంలో ఆన్‌లైన్‌లో చూసి నేరాలకు పాల్పడుతున్న సంఘటనలు మనం చాలానే చూస్తున్నాం. అయితే నేరం చేయడానికి నిందితుడు ముందు దేనిలోనైతే వెతుకుతున్నాడో.. నేరం జరిగిన తర్వాత నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు కూడా మొదట దాని దగ్గరకే వెళ్తున్నారు. అదే గూగుల్.. ఈ ఒక్క గూగుల్‌ సెర్చే సమస్యలను సృష్టిస్తుంది.. పరిష్కారం చూపుతుంది. అందుకే ఒక సెర్చ్.. ఒక క్లూ.. ఒక నేరం.. చివరికి అదే సాక్ష్యం అంటారు.

గూగుల్‌తో జాగ్రత్త గురూ..  వాడే ప్రతి ఒక్కరూ ఇది తెలుసుకోవాల్సిందే.. లేదంటే తిప్పటు తప్పవు!
Google Search History Solves Crimes
Siva Nagaraju
| Edited By: |

Updated on: Aug 07, 2026 | 3:31 PM

Share

ఒకప్పుడు నేరస్థులు పుస్తకాలు చదివేవారు. అనుభవజ్ఞులను కలిసేవారు. గ్యాంగ్‌ల నుంచి నేర్చుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఒక స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు. విషం ఎంతసేపటికి పనిచేస్తుంది?, “సీసీటీవీని ఎలా తప్పించాలి?, శవాన్ని ఎలా మాయం చేయాలి?, ఫోన్ ట్రాక్ కాకుండా ఎలా ఉండాలి?. ఇలా గూగుల్‌లో టైప్ చేస్తున్న కేసులు దేశవ్యాప్తంగా దర్యాప్తు సంస్థల ముందు వరుసగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు Google Search సమాచారం కోసం మాత్రమే వాడేవారు. కానీ ఇప్పుడు కొన్ని కేసుల్లో అది Crime Preparation Toolగా మారుతోంది. అయితే అదే గూగుల్. అదే సెర్చ్ హిస్టరీ. అదే డిజిటల్ ఆనవాళ్లు చివరకు నిందితుడి మెడకు ఉరిగా మారుతున్నాయి.

నేరానికి ముందు.. గూగుల్ క్లాస్‌రూమ్?

CBI, రాష్ట్ర పోలీసుల సైబర్ విభాగాలు, కోర్టు తీర్పుల్లో తరచూ కనిపిస్తున్న అంశం ఒక్కటే. అదే గూగుల్‌ సెర్చ్. వీటిలో నిందితుల ఫోన్లలో ఎక్కవగా దొరికిన సెర్చ్‌లు చూస్తే.. చాలా వరకు Poison effect ఎంతసేపటికి?, Sleeping tablets overdose, Dead body disposal How to avoid CCTV, GPS tracking off ఎలా? , Call history delete , Incognito mode, Fake ID ఎలా? ఇవే ఉన్నాయి. ఇలాంటి సెర్చ్‌లు దర్యాప్తులో కీలక ఆధారాలుగా మారుతున్నాయి.

డేటా ఏం చెబుతోంది?

NCRB గణాంకాల ప్రకారం… 2023లో దేశవ్యాప్తంగా 65 వేలకుపైగా సైబర్ నేరాలు నమోదయ్యాయి.2022తో పోలిస్తే 20 శాతానికి పైగా పెరుగుదల నమోదైంది.మహిళలను లక్ష్యంగా చేసుకున్న సైబర్ నేరాలు 10 వేలకుపైగా నమోదయ్యాయి. సోషల్ మీడియా, సెర్చ్ ఇంజిన్లు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల వినియోగం పెరిగిన కొద్దీ డిజిటల్ ఆధారాలు కూడా పెరుగుతున్నాయని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.

I4C (Indian Cyber Crime Coordination Centre) ప్రకారం.. 1930 హెల్ప్‌లైన్ ప్రారంభమైన తర్వాత లక్షలాది ఫిర్యాదులు వచ్చాయి. వేల కోట్ల రూపాయల ఆన్‌లైన్ మోసాలను గుర్తించి నిలువరించారు. Fake Profiles, Honey Trap, Investment Scam, Sextortion కేసుల్లో గూగుల్ సెర్చ్‌లు, సోషల్ మీడియా చాట్లు, డివైస్ డేటా కీలక ఆధారాలుగా మారుతున్నాయి.

ఎన్ని కేసుల్లో గూగుల్ సెర్చ్ బయటపడుతోంది?

దేశంలో “Google Search వల్లే అరెస్ట్” అనే ప్రత్యేక అధికారిక గణాంకాన్ని NCRB లేదా CBI విడుదల చేయదు. అయితే గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా వెలుగులోకి వచ్చిన అనేక హత్యలు, భార్యాభర్తల హత్యలు, ప్రేమ వ్యవహారాలు, సైబర్ మోసాలు, సెక్స్టార్షన్ కేసుల్లో… Browser History , Google Search , YouTube Watch History , Google Timeline, Location History వంటి సర్చెస్ దర్యాప్తులో కీలక సాక్ష్యాలుగా కోర్టుల్లో సమర్పించబడ్డాయి.

తెలంగాణ.. ఏపీ పరిస్థితి?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీసులూ ఇప్పుడు ప్రతి పెద్ద కేసులో.. Mobile Forensics , Browser History , Google Account , Gmail Activity , Cloud Backup , Google Timeline తప్పనిసరిగా పరిశీలిస్తున్నారు. సైబర్ నేరాలు, హత్యలు, మిస్సింగ్ కేసులు, బ్లాక్‌మెయిల్ కేసుల్లో ఈ డిజిటల్ ఆధారాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.

దేశాన్ని కుదిపిన కొన్ని ఉదాహరణలు

ముఖ్యంగా దేశాన్ని కుదిపిన శ్రద్ధా వాకర్ హత్య కేసు, ఆఫ్తాబ్ పూనావాలా హత్య తర్వాత.. శరీర భాగాలు ఎలా దాచాలి?, వాసన ఎలా రాకుండా చూడాలి? ఫ్రిజ్‌లో ఎంతకాలం ఉంచొచ్చు? వంటి సెర్చ్‌లు ఎక్కవ అయ్యాయని దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి.

ఉత్తరప్రదేశ్‌ – ఫతేపూర్ ప్రేమహత్య కేసు

ప్రేమ వ్యవహారానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్న దంపతులు యువకుడిని హత్య చేసిన కేసులో పోలీసులు మొబైల్‌లను పరిశీలించగా సంచలన విషయాలు బయటపడ్డాయి. హత్యకు ముందు నిందితులు హత్య చేసిన తర్వాత ఆనవాళ్లు ఎలా తొలగించాలి?, శవాన్ని ఎలా మాయం చేయాలి?, హత్య కేసుల్లో శిక్ష ఎలా ఉంటుంది? వంటి అంశాలపై గూగుల్, యూట్యూబ్‌లో వెతికినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఈ డిజిటల్ ఆధారాలే కేసులో ముందస్తు ప్రణాళికను నిరూపించడంలో కీలకంగా మారాయి.

పుణే – కేతన్ అగర్వాల్ హత్య కేసు (2026)

దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ కేసులో నిందితులు హత్యకు ముందు “ఎలా చంపితే ప్రమాదంలా కనిపిస్తుంది?”, “పోలీసులను ఎలా తప్పుదోవ పట్టించాలి?” వంటి అంశాలపై గూగుల్‌లో వెతికినట్లు పోలీసులు వెల్లడించారు. అంతేకాదు, హత్య జరిగే ప్రాంతానికి ముందుగానే వెళ్లి పలుమార్లు పరిశీలించినట్లు, నేరానికి ముందే ప్రణాళిక రూపొందించినట్లు డిజిటల్ ఆధారాలు వెల్లడించాయి. గూగుల్ సెర్చ్, ఫోన్ సమాచారం, ప్రయాణ వివరాలు కలిపి దర్యాప్తులో బలమైన సాక్ష్యాలుగా మారాయి.

బెంగళూరు త్రిపుల్ మర్డర్ కేసు (2026)

ఇటీవలి సంచలన కేసుల్లో ఒకటైన ఈ ఘటనలో నిందితుడు హత్యల ప్రణాళిక కోసం నెలల తరబడి గూగుల్‌కు చెందిన కృత్రిమ మేధ సహాయన్ని ఉపయోగించినట్లు పోలీసులు చెప్పారు. దర్యాప్తులో భాగంగా సంభాషణల వివరాలను సేకరించేందుకు సాంకేతిక సంస్థలను సంప్రదించారు. డిజిటల్ సంభాషణలు కూడా నేర దర్యాప్తులో ఎంత కీలకమవుతున్నాయో ఈ కేసు చూపించింది.

హైదరాబాద్ – ఫిలింనగర్ హత్య కేసు (2026)

ప్రేమ, ఆర్థిక వివాదాల నేపథ్యంలో జరిగిన హత్య కేసులో నిందితుడి మొబైల్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు డిజిటల్ ఆధారాలను సేకరించారు. ఫోన్‌లోని సెర్చ్, కాల్ వివరాలు, ప్రయాణ వివరాలు, ఇతర డిజిటల్ ఆనవాళ్లను విశ్లేషించి నిందితుడిని అరెస్టు చేశారు. ఈ కేసులో ఫోన్‌లోని డిజిటల్ సమాచారం దర్యాప్తుకు కీలకంగా ఉపయోగపడిందని హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు.

అనంతపురంలో కాలిన మృతదేహం కేసు (2026)

రాయదుర్గం సమీపంలో కాలిపోయిన గుర్తుతెలియని మృతదేహం కేసును అనంతపురం పోలీసులు శాస్త్రీయ దర్యాప్తుతో ఛేదించారు. మొబైల్ ఫోన్ సమాచారం, సాంకేతిక ఆధారాలు, సంఘటన స్థలంలో లభించిన చిన్న ఆనవాళ్లు, డిజిటల్ విశ్లేషణ ఆధారంగా నిందితులను గుర్తించారు. ఈ కేసు కూడా ఆధునిక డిజిటల్ దర్యాప్తు ఎంత కీలకమో చూపించింది

ప్రేమ, సెక్స్టార్షన్ కేసులు

Instagram పరిచయం. Googleలో… Fake Number, Location Hide, Video Delete అని సెర్చ్ చేసిన తర్వాత బ్లాక్‌మెయిల్ చేసిన కేసులు పలు రాష్ట్రాల్లో నమోదయ్యాయి.

పోలీసులు ఇప్పుడు ఏం చూస్తున్నారు?

ఈ రోజుల్లో నిందితుడు ఎంత తెలివిగా వ్యవహరించినా…పోలీసులు చూసేది.. Google Search History, Chrome History, Incognito Usage Logs, Google Location Timeline ,Gmail Login History, , Device Forensics, IP Address , CCTV , UPI ట్రాన్సాక్షన్లు ,SIM మార్పులు ఇవి కలిపి నేరం జరిగిన టైమ్‌లైన్‌ను రూపొందిస్తున్నారు.

అయితే నేరానికి గూగుల్‌ సెర్చ్ ఒక్కటే సాక్ష్యం కాదు. న్యాయ నిపుణులు ప్రకారం.. గూగుల్‌లో “Poison” అని సెర్చ్ చేశాడంటే అతడు నేరస్థుడని కాదు. కానీ అదే సమయంలో లోకేషన్, సీసీటీవీ, కాల్‌డేటా, Financial Transactions, DNA, Fingerprints వంటివి అన్నీ కలిస్తే గూగుల్‌ సెర్చ్ బలమైన సాక్ష్యంగా మారుతుంది. ఇదే ఇప్పుడు కొత్త ట్రెండ్. ఒకప్పుడు Finger prints, తర్వాత DNA చూసేవారు. కానీ ఈ సాంకేతిక యుగంలో మాత్రం Digital Footprints చూస్తున్నారు. ఓ నేరం చేసిన వ్యక్తి తన వేలిముద్రలు తుడిచేయగలడేమో కానీ గూగుల్‌ సర్వర్‌లో పడిన అడుగుజాడలను తుడవడం అంత సులువు కాదు.

నిపుణులు చెప్పే హెచ్చరిక

సైకాలజిస్టులు, సైబర్ నిపుణులు చెబుతన్న విషయం ఏమిటంటే.. హింసాత్మక ఆలోచన Google Search, Crime Planning, Execution. ఈ మొత్తం ప్రక్రియ ఇప్పుడు చాలా వేగంగా మారుతోంది. అందుకే కుటుంబాలు, విద్యాసంస్థలు, పోలీసులు, డిజిటల్ ప్రవర్తనపై అవగాహన పెంచాలని సూచిస్తున్నారు.

నేరం చేసేవాడు నేరానికి ముందు గూగుల్‌నే అడుగుతున్నాడు. నేరం జరిగిన తర్వాత ఆ నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు కూడా అదే గూగుల్‌ను అడుగుతున్నారు. ఇక్కడ ఇద్దరి మధ్య తేడా ఒక్కటే మొదటివాడు తప్పించుకోవడానికి గూగుల్‌ను వాడితే, రెండోవాడు పట్టుకోవడానికి వాడుతున్నాడు. నేరస్థుడు గురువుగా భావించే.. గూగులే చివరకు అతన్ని పట్టించేందుకు కోర్టులో సాక్షిగా నిలుస్తుంది.

డిజిటల్ యుగంలో నేరం మారింది. ఆయుధాలు మారాయి. పద్ధతులు మారాయి. కానీ ఒక విషయం మాత్రం మారలేదు. ప్రతి నేరం ఏదో ఒక ఆనవాళ్లు వదిలేస్తుంది. ఈ రోజుల్లో ఆ ఆనవాళ్లు రక్తపు చారలు కాకపోవచ్చు. బ్రౌజర్ హిస్టరీ, సెర్చ్ హిస్టరీ, లొకేషన్ డేటా, క్లౌడ్ బ్యాకప్ రూపంలో ఉండొచ్చు.ఒక క్లిక్‌తో మొదలయ్యే సెర్చ్.. జీవితాంతం వెంటాడే సాక్ష్యంగా మారొచ్చు. తస్మాత్ జాగ్రత్త.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us