AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain Alert: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్.. తెలంగాణకు భారీ వర్షసూచన.. వాతావరణశాఖ అప్డేట్ ఇదే..

ఏపీ, తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వానలు కురవనున్నాయి. ఈ మేరకు వాతావరణశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

Rain Alert: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్.. తెలంగాణకు భారీ వర్షసూచన.. వాతావరణశాఖ అప్డేట్ ఇదే..
Rains
Venkatrao Lella
|

Updated on: Aug 07, 2026 | 3:09 PM

Share

సముద్ర మట్టం వద్ద ఉన్న రుతుపవన ద్రోణి ప్రస్తుతం గంగానగర్, ఢిల్లీ, హమీర్‌పూర్, రాంచీ, దిగ్ఘా మీదుగా కొనసాగుతూ.. అక్కడి నుంచి ఆగ్నేయ దిశగా తూర్పు-మధ్య బంగాళాఖాతం వైపు విస్తరించి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతం మీద సముద్ర మట్టానికి 4.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్య ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. దీని ప్రభావంతో తెలంగాణలో రాబోయే మూడ్రోజుల పాటు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణశాఖ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఈ నెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు  తెలంగాణ రాష్ట్రంలోని అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ స్పష్టం చేసింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30–40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అదేవిధంగా అక్కడక్కడ గంటకు 30–40 కి.మీ. వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

అయితే తెలంగాణలో ఇప్పటికే పలు జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో గత కొద్ది రోజులుగా వర్షాలు పడుతున్నాయి. వాయవ్య బంగాళాఖాతం, ఉత్తర ఒడిశాపై ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభుత్వం రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే కొన్ని రోజుల పాటు ఈ వర్షాలు ఇలాగే కొనసాగే అవకాశముంది. కానీ రాష్ట్రంలో ఎల్‌నివో ప్రభావంతో ఇప్పటికీ లోటు వర్షపాతం నమోదైంది. సాధారణంతో పోలిస్తే 20 శాతం లోటు వర్షపాతం రికార్డ్ అయింది.

ఏపీలో వర్షాలకు ఛాన్స్

అటు ఏపీలో కూడా వర్షాలు పడుతున్నాయి. గత కొద్ది రోజులుగా పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. అయితే బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో నేడు, రేపు భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశముందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది.

Follow Us