AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yashasvi Jaiswal: అనాడు బండ బూతులు తిట్టాడు.. ఇప్పటికీ నా చెవుల్లో మోగుతున్నాయన్న జైస్వాల్

Yashasvi Jaiswal: యశస్వి జైస్వాల్‌కు రోహిత్ శర్మ గతంలో ఇచ్చిన వార్నింగ్ గుర్తుందా? గల్లీ క్రికెట్ ఆడుతున్నావా అంటూ రోహిత్ మందలించిన ఘటనను జైస్వాల్ తాజాగా గుర్తుచేసుకున్నాడు. శ్రీలంక సిరీస్‌కు ముందు ఫీల్డింగ్ ప్రాక్టీస్‌లో అదే సలహాను పాటిస్తూ ఫోటో షేర్ చేశాడు. ఈ ఆసక్తికర ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Yashasvi Jaiswal: అనాడు బండ బూతులు తిట్టాడు.. ఇప్పటికీ నా చెవుల్లో మోగుతున్నాయన్న జైస్వాల్
Yashasvi Jaiswal (1)
Rakesh
|

Updated on: Aug 07, 2026 | 3:55 PM

Share

Yashasvi Jaiswal: టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అన్ని ఫార్మాట్లకూ సరిపోయే అద్భుతమైన బ్యాటింగ్ స్టైల్ కలిగి ఉన్నాడు. ప్రస్తుతం టెస్టుల్లో భారత్ తరఫున కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతున్న జైస్వాల్, శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఈ ప్రాక్టీస్ సెషన్ సమయంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలో తనని తిట్టిన ఒక సరదా ఘటనను గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో ఒక పిక్ షేర్ చేశాడు.

గల్లీ క్రికెట్ ఆడుతున్నావా ఏంటి?

ఈ సంఘటన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 సమయంలో జరిగింది. ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ చేస్తుండగా, జైస్వాల్ సిల్లీ పాయింట్‌లో హెల్మెట్ పెట్టుకుని ఫీల్డింగ్ చేస్తున్నాడు. సాధారణంగా సిల్లీ పాయింట్ వద్ద ఉన్న ఫీల్డర్ క్యాచ్ పట్టడానికి ముందుకు వంగి నిలబడాలి. కానీ ఆ సమయంలో స్మిత్ షాట్ కొట్టడానికి ముందే జైస్వాల్ పైకి లేవడానికి ప్రయత్నించాడు. అది చూసిన రోహిత్ శర్మ స్లిప్‌లో నుంచి గట్టిగా “ఏయ్ జస్సు! గల్లీ క్రికెట్ ఆడుతున్నావా ఏంటి? కిందకు వంగి నిలబడు” అని గద్దించాడు. రోహిత్ శర్మ మైక్ స్టంప్‌లో రికార్డైన ఈ మాటలు అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

ఒక లెజెండ్ చెప్పాడు.. అందుకే వంగి నిలబడ్డా

ప్రస్తుతం శ్రీలంకలో తీవ్రంగా శ్రమిస్తున్న జైస్వాల్, హెల్మెట్ ధరించి ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలను పోస్ట్ చేశాడు. దానికి “ఒక దిగ్గజం చెప్పాడు.. బంతి ఆడేంతవరకు పైకి లేవకూడదు అని!” అంటూ క్యాప్షన్ జతచేశాడు. ఈసారి ఫీల్డింగ్ చేసేటప్పుడు మోకాళ్లు వంచి, రోహిత్ శర్మ ఇచ్చిన సలహాను పక్కాగా పాటిస్తున్నట్లు ఫోటోలలో స్పష్టంగా కనిపిస్తోంది. డిఫెన్సివ్ షాట్స్ ఆడటంలో క్యాచ్‌లను పట్టుకోవడానికి సిల్లీ పాయింట్‌లో వంగి ఉండటం ఎంతో ఉపయోగపడుతుంది.

టెస్టుల్లో జైస్వాల్ ఆల్ టైమ్ రికార్డులు

శ్రీలంక సిరీస్‌కు ముందు జైస్వాల్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల ఆఫ్ఘనిస్థాన్‌పై జరిగిన మూడో వన్డేలో విరాట్ కోహ్లీ గైర్హాజరీలో తుది జట్టులో చోటు దక్కించుకుని 110 పరుగుల అద్భుత సెంచరీతో మెరిసాడు. ఇక టెస్టు క్రికెట్ విషయానికి వస్తే, జైస్వాల్ ఇప్పటివరకు 29 మ్యాచ్‌లలో 2,535 పరుగులు చేశాడు. భారత్ తరఫున అత్యంత వేగంగా (కేవలం 40 ఇన్నింగ్స్‌లలో) 2,000 టెస్టు పరుగులు పూర్తి చేసిన దిగ్గజాలు రాహుల్ ద్రావిడ్, వీరేంద్ర సెహ్వాగ్‌ల సరసన జైస్వాల్ ఉమ్మడిగా తొలి స్థానంలో నిలిచాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us