AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదే నా అసలైన ఏజ్.. ఆధార్ కార్డు చూపించి క్లారిటీ ఇచ్చిన యంగ్ హీరోయిన్

చాలా మంది హీరోయిన్స్ వయసుకు సంబందించిన రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ హీరోయిన్ ఏకంగా ఆధార్ కార్డు చూపించి మరి తన ఏజ్ పై క్లారిటీ ఇచ్చింది. ఇంతకూ పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?

ఇదే నా అసలైన ఏజ్.. ఆధార్ కార్డు చూపించి క్లారిటీ ఇచ్చిన యంగ్ హీరోయిన్
Actress
Rajeev Rayala
|

Updated on: Sep 21, 2026 | 4:03 PM

Share

టాలీవుడ్‌లో ప్రస్తుతం క్రేజీ హీరోయిన్‌గా దూసుకుపోతున్న తెలుగమ్మాయిల్లో వైష్ణవి చైతన్య పేరు ముందువరుసలో ఉంటుంది. యూట్యూబ్‌ వీడియోలతో కెరీర్‌ను ప్రారంభించిన ఆమె.. ఆ తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టి తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా ‘బేబీ’ సినిమాతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుని ఒక్కసారిగా స్టార్ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. అందం, అభినయంతో పాటు సహజమైన నటనతో ఆకట్టుకుంటున్న వైష్ణవి.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఈ క్రమంలో ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు కూడా తరచూ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఆమె వయసుపై కొంతకాలంగా నెట్టింట్లో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. వైష్ణవి చైతన్య వయసు 32 ఏళ్లు అంటూ కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. దీనికి ప్రధాన కారణంగా వికీపీడియాలో ఆమె వయసుకు సంబంధించిన వివరాలు కనిపించడం అనే చెప్పాలి. ఈ క్రమంలోనే ఆమె వయసుపై కూడా నెటిజన్ల మధ్య చర్చ మరింత పెరిగింది.

బిందాస్ మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మతిపోవాల్సిందే.. ఇప్పుడు ఎలా ఉందంటే

తన వయసుపై జరుగుతున్న ప్రచారానికి తాజాగా వైష్ణవి చైతన్య స్వయంగా క్లారిటీ ఇచ్చింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. వికీపీడియాలో తన వయసుకు సంబంధించిన సమాచారం తప్పుగా ఉందని వెల్లడించింది. వికీపీడియాలో తన వయసు 33 ఏళ్లుగా చూపిస్తున్నారని, అయితే అది నిజం కాదని వైష్ణవి చెప్పింది. తన వయసు 25 సంవత్సరాలు మాత్రమేనని ఆమె స్పష్టం చేసింది. తన మాటలకు మరింత బలం చేకూర్చేలా ఆధార్ కార్డును చూపిస్తూ తన వయసుపై వస్తున్న ప్రచారానికి ఆమె క్లారిటీ ఇచ్చేసింది.

ఇవి కూడా చదవండి

ఆ డైరెక్టర్ అందరి ముందు లాగిపెట్టి కొట్టారు.. ఆ తర్వాత ఆ తప్పు చేయలేదు : బాలాదిత్య

దీంతో ఇప్పటివరకు తన వయసుపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఆమె స్వయంగా ఫుల్‌స్టాప్ పెట్టినట్టయింది. ప్రస్తుతం వైష్ణవి చైతన్య ఇచ్చిన ఈ క్లారిటీకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాంతో  అభిమానులు కూడా వికీపీడియాలో ఉన్న వివరాలను సరిచేయాలని కామెంట్లు చేస్తున్నారు. ఇక వైష్ణవి సినిమాల విషయానికొస్తే.. ‘బేబీ’తో వచ్చిన గుర్తింపును కొనసాగిస్తూ వైష్ణవి చైతన్య వరుస ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరిస్తుంది. రీసెంట్ గా ఎపిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఇప్పుడు మరిన్ని ఆసక్తికరమైన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది వైష్ణవి.

ఓ సీన్ కోసం ఆ స్టార్ హీరో ఉతకాని, వాసనొస్తున్న సూట్‌ వేసుకున్నారు: దేవి ప్రసాద్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి