AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓ సీన్ కోసం ఆ స్టార్ హీరో ఉతకాని, వాసనొస్తున్న సూట్‌ వేసుకున్నారు: దేవి ప్రసాద్

దర్శకుడు, నటుడు దేవి ప్రసాద్ ఓ స్టార్ హీరో అంకితభావం, పని పట్ల శ్రద్ధ గురించి ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ఓ సినిమా షూటింగ్ సమయంలో ఉతకని సూట్ ధరించి నటించిన వృత్తి నైపుణ్యం, అలాగే మరో సినిమా కోసం ఖర్చులు తగ్గించేందుకు ఆయన చేసిన సూచనలు ఆయన గొప్పతనాన్ని చాటిచెబుతాయి.

ఓ సీన్ కోసం ఆ స్టార్ హీరో ఉతకాని, వాసనొస్తున్న సూట్‌ వేసుకున్నారు: దేవి ప్రసాద్
Devi Prasad
Rajeev Rayala
|

Updated on: Sep 20, 2026 | 7:34 PM

Share

తెలుగు సినీ చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణ పేరు తరతరాలకు గుర్తుండిపోతుంది. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. తాజాగా, దర్శకుడు, నటుడు దేవి ప్రసాద్ తెలుగు వన్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సూపర్ స్టార్ కృష్ణ పని పట్ల అంకితభావం, నిబద్ధత, మరియు నిర్మాతల పట్ల ఆయనకున్న శ్రద్ధ గురించి పలు అపురూపమైన సంఘటనలను వివరించారు. ఈ విషయాలు కృష్ణ గారి వ్యక్తిత్వాన్ని, వృత్తి నైపుణ్యాన్ని మరోసారి స్పష్టం చేస్తాయి.  దేవి ప్రసాద్ మాటల్లో కృష్ణ  ఒక వర్క్ హాలిక్. పని చేయకుండా ఉండలేకపోవడం ఆయన నైజం అని అన్నారు. “ఆయన పని చేయకుండా ఉండలేకపోయేవారండి. ఎప్పుడూ షూటింగ్ జరుగుతా ఉంటుంది,” అని దేవి ప్రసాద్ పేర్కొన్నారు. దొంగోడొచ్చాడు, చుట్టాలబ్బాయి వంటి చిత్రాలకు దేవి ప్రసాద్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న రోజుల్లో జరిగిన ఒక సంఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు.

ఏం పాటరా బాబు..! యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న సాంగ్.. విన్నకొద్దీ వినాలనిపించేలా ఉందిగా

ఒకరోజు కృష్ణ గారి నటిస్తున్న మరో సినిమా షూటింగ్ రద్దు అవ్వడంతో, విశ్రాంతి తీసుకోవడానికి బదులుగా, ఆయన స్వయంగా ఫోన్ చేసి, అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న దేవి ప్రసాద్‌తో మాట్లాడరట. “నేను కృష్ణను మాట్లాడుతున్నాను. నా షూటింగ్ క్యాన్సిల్ అయ్యింది. మీరేమైనా షూటింగ్ పెట్టుకోగలుగుతారా.?” అని అడిగారట. అసిస్టెంట్ డైరెక్టర్లు అందుబాటులో లేకపోవడంతో, దేవి ప్రసాద్ తాను అప్రెంటిస్ స్థాయిలోనే ఉన్నానని చెప్పడంతో, కృష్ణ గారు కో డైరెక్టర్‌తో మాట్లాడి, మిగతా ఆర్టిస్టులు (గిరిబాబు, మారుతీ రావు వంటి వారు) అందుబాటులో ఉన్నారని నిర్ధారించుకొని, మధ్యాహ్నం నుండే షాట్స్ ప్లాన్ చేయమని ఆదేశించారట. ప్రొడక్షన్ సైడ్ నుంచి అడగకుండా, హీరో స్వయంగా పని కోసం చొరవ తీసుకోవడం ఆయన పని పట్ల అంకితభావానికి నిదర్శనం అని దేవి ప్రసాద్ అన్నారు.

తెలుగు సినిమా దెబ్బకు కన్నీళ్లు పెట్టుకుంటున్న నార్త్ ఆడియన్స్.. ఓటీటీలో దూసుకుపోతున్న మూవీ

అలాగే గూఢచారి 117 చిత్ర షూటింగ్ సందర్భంగా జరిగిన ఒక సంఘటన గురించి మాట్లాడుతూ.. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండగా, టైటిల్ షాట్ కోసం కృష్ణ గారు తెల్లటి సూట్‌లో నటించాల్సి వచ్చింది. అయితే ఆ షాట్ చివరి నిమిషంలో అనుకోవడంతో, కాస్ట్యూమ్స్ డిపార్ట్‌మెంట్ వారు గతంలో కృష్ణ గారు ధరించిన సూట్‌ను శుభ్రపరచకుండానే, వేరొక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కు వాడిన తర్వాత, తిరిగి గోడౌన్‌లో పడవేశారట. ఆ షాట్ కోసం సూట్ తీసుకురాగా, అది దుర్వాసన వస్తోందని దేవి ప్రసాద్ వివరించారు. “ఏంటయ్యా ఇది చూసావా ఎలా ఉందో,” అని కృష్ణ గారు వ్యాఖ్యానించినా, హైదరాబాద్‌ వెళ్లి తిరిగి రావడానికి సమయం లేదని, విడుదల సమీపిస్తున్నందున ఆప్టికల్ వర్క్ చేయడానికి టైం ఉండదని గ్రహించి, ఎటువంటి ఫిర్యాదు లేకుండా, అదే ఉతకని సూట్‌ను ధరించి షాట్ పూర్తి చేశారట.

ఇవి కూడా చదవండి

చిరంజీవికి జోడిగా అందాల భామ.. మొదటిసారి మెగాస్టార్‌ సరసన సీనియర్ హీరోయిన్

Krishna

Krishna

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us