AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోహిత్, లక్ష్మణ్ కాదు.. బీసీసీఐతో అగార్కర్ విభేదాలకు అసలు రీజన్ ఆయన కెప్టెన్సీనే..!

Ajit Agarkar: భారత క్రికెట్ నియంత్రణ మండలి (Board of Control for Cricket in India) చీఫ్ సెలెక్టర్‌గా వ్యవహరించిన అజిత్ అగార్కర్ (Ajit Agarkar) పదవీకాలం అనేక వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. జూలై 2023లో ఆయన బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే బోర్డు పెద్దలతో అభిప్రాయ భేదాలు తలెత్తినట్లు ప్రముఖ మీడియా నివేదికలు వెల్లడిస్తున్నాయి.

రోహిత్, లక్ష్మణ్ కాదు.. బీసీసీఐతో అగార్కర్ విభేదాలకు అసలు రీజన్ ఆయన కెప్టెన్సీనే..!
Ajit Agarkar
Venkata Chari
|

Updated on: Sep 21, 2026 | 1:51 PM

Share

Ajit Agarkar: అజిత్ అగార్కర్ (Ajit Agarkar) హయాంలో భారత జట్టు వరుసగా ఐసీసీ ట్రోఫీలను సాధించి వైట్ బాల్ క్రికెట్‌లో అద్భుత విజయాలను నమోదు చేసింది. అయితే ఆయన పదవీకాలం ప్రారంభమైన తొలి రోజుల్లోనే బోర్డుతో మనస్పర్థలు మొదలయ్యాయి. జూలై 2023లో జరిగిన రెండో సమావేశంలో ఐర్లాండ్ పర్యటనకు వెళ్లే టీ20 జట్టు కెప్టెన్ ఎంపికపై పెద్ద వివాదమే నడిచింది. ఆసియా కప్ టోర్నీని దృష్టిలో ఉంచుకుని రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మతో (Rohit Sharma) పాటు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి కల్పించారు. దీంతో కొత్త నాయకుడిని ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో రుతురాజ్ గైక్వాడ్‌ను (Ruturaj Gaikwad) కెప్టెన్‌గా నియమించాలని అగార్కర్ గట్టిగా పట్టుబట్టాడు. ఆసియా క్రీడల జట్టుకు కూడా రుతురాజ్ నాయకత్వం వహిస్తుండటంతో ఆయనకే పగ్గాలు ఇవ్వాలని భావించాడు. మరోవైపు అప్పుడే సుదీర్ఘ కాలంగా గాయం నుంచి కోలుకుని వస్తున్న స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాపై (Jasprit Bumrah) పనిభారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో అగార్కర్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.

ఎక్కువమంది చదివినది: ఇంట్లో పులి.. విదేశాల్లో పిల్లి.. అభిషేక్, వైభవ్‌లకు ఇచ్చిపడేసిన మాజీ స్టార్ ప్లేయర్..!

అయితే బీసీసీఐ (BCCI) మాత్రం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఐర్లాండ్ టూర్‌కు బుమ్రాను నాయకుడిగా చేయాలని బోర్డు పట్టుబట్టడంతో ఇరువర్గాల మధ్య మొదటిసారి తీవ్ర విభేదాలు వెలుగు చూశాయి. కాలక్రమేణా రోహిత్ శర్మ భవిష్యత్తు అంశం కూడా ఈ వివాదాలను మరింత పెంచింది. వచ్చే 2027 వన్డే ప్రపంచకప్ టోర్నీ ప్రణాళికలలో రోహిత్‌ను కొనసాగించడంపై అగార్కర్ పెద్దగా ఆసక్తి చూపలేదని వార్తలు వచ్చాయి. ఛాంపియన్స్ ట్రోఫీ విజయం సాధించినప్పటికీ రోహిత్‌ను వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడం చర్చనీయాంశమైంది.

ఇవి కూడా చదవండి

IND vs JPN: జపాన్‌తో తలపడే టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే.. ఓపెనర్‌గా బుడ్డోడు ఫిక్స్..!

ఇంగ్లాండ్‌తో లార్డ్స్ వేదికగా జరగాల్సిన వన్డే మ్యాచ్‌నే రోహిత్‌కు ఆఖరి మ్యాచ్‌గా సెలెక్టర్లు చెప్పినట్లు సమాచారం అందడంతో బోర్డు వెంటనే జోక్యం చేసుకుంది. కార్యదర్శి దేవాజిత్ సైకియా (Devajit Saikia) స్పందించి రోహిత్ జట్టులోనే కొనసాగుతారని స్పష్టం చేశారు. వెస్టిండీస్ జట్టుతో జరిగే స్వదేశీ సిరీస్ కోసం జట్లను ఎంపిక చేయడమే అగార్కర్ చివరి బాధ్యతగా నిలిచింది. ఆయన స్థానంలో కొత్త చీఫ్ సెలెక్టర్‌గా మాజీ ఆటగాడు పార్థివ్ పటేల్ (Parthiv Patel) రేసులో ముందున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us