AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shiva Nirvana : అంత అన్యాయం జరిగితే పోలీసులు ఎందుకు రాలేదు.. ట్రోల్స్ పై క్లారిటీ ఇచ్చిన ఇరుముడి డైరెక్టర్..

ఇటీవల ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న లేటేస్ట్ మూవీ ఇరుముడి. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటించిన ఈ సినిమాకు అటు థియేటర్లలో.. ఇటు ఓటీటీలలో మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే ఈ చిత్రంపై మొదటి నుంచి కొందరు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కొన్ని ప్రశ్నలకు శివ నిర్వాణ తనదైన స్టైల్లో ఇచ్చిపడేశారు.

Shiva Nirvana : అంత అన్యాయం జరిగితే పోలీసులు ఎందుకు రాలేదు.. ట్రోల్స్ పై క్లారిటీ ఇచ్చిన ఇరుముడి డైరెక్టర్..
Shiva Nirvana
Rajitha Chanti
|

Updated on: Sep 21, 2026 | 1:25 PM

Share

చాలా కాలం తర్వాత టాలీవుడ్ మాస్ హీరో రవితేజ కెరీర్ మలుపు తిప్పిన సినిమా ఇరుముడి. కొన్నాళ్లుగా సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్న ఈ హీరోకు ఈ మూవీ సరైన బ్రేక్ ఇచ్చిందనే చెప్పాలి. రవితేజ కథానాయకుడిగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. థియేటర్లలోనే కాకుండా ఇటీవల ఓటీటీలోనూ అడుగుపెట్టిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. అయితే, సినిమాలో ఊరి నేపథ్యంలో అంత పెద్ద క్రైమ్ యాంగిల్ జరిగినా, ఎక్కడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లేదా ఎస్సై ఎంక్వైరీ పాత్రలు కనిపించకపోవడంపై సోషల్ మీడియాలో ట్రోల్స్, ప్రశ్నలు మొదలయ్యాయి. దీనిపై దర్శకుడు శివ నిర్వాణ స్పందిస్తూ ట్రోలర్స్‌కు దిమ్మతిరిగే వివరణ ఇచ్చారు. సినిమాలో పోలీస్ లేయర్‌ను కావాలనే పక్కన పెట్టానని శివ నిర్వాణ స్పష్టం చేశారు.

“ఒకవేళ సీన్‌లోకి ఎస్సై వచ్చి ఎంక్వైరీ మొదలుపెడితే, ప్రేక్షకులు పాత్రల తాలూకు అంతర్మథనం, వారి భావోద్వేగ ప్రయాణాన్ని ఆస్వాదించడం మానేస్తారు. ‘నేరం వెనుక ఎవరున్నారు? పోలీసులు ఎప్పుడు పట్టుకుంటారు?’ అనే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కోణంలోనే ఆలోచించడం మొదలుపెడతారు. దీంతో కథలోని అసలు ఎమోషన్ దెబ్బతింటుంది” అని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, సినిమాలో నేరాలకు కారణమైన వ్యక్తి పలుకుబడి ఉన్న ఎమ్మెల్యే అని, అతడు పోలీసులను రాకుండా తన అధికారాన్ని ఉపయోగించాడా లేదా అనే లీగల్ ప్రొసీజర్ మొత్తాన్ని 2 గంటల 20 నిమిషాల నిడివిలో చూపించడం అసాధ్యమని తెలిపారు.

తాను ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు ఒక స్వచ్ఛమైన భావోద్వేగాన్ని అందించాలనుకున్నానని, క్రైమ్ డ్రామాగా మార్చి లీగల్ అంశాలతో ఆడియన్స్ దృష్టిని పక్కదారి పట్టించడం ఇష్టం లేకే పోలీస్ సీన్లను ఉద్దేశపూర్వకంగానే దూరంగా ఉంచినట్లు ఆయన వెల్లడించారు. కథలోని ఎమోషనల్ డెప్త్‌ను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పడంతో, ఈ పోలీస్ సీన్ల వివాదానికి దర్శకుడు పూర్తి ముగింపు పలికారు.

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..

Follow Us
ఇరుముడి సినిమాలో పోలీసులు ఎందుకు రాలేదు..
ఇరుముడి సినిమాలో పోలీసులు ఎందుకు రాలేదు..
సచిన్ vs కోహ్లీ.. అవి మిస్ అవ్వకుంటే, సెంచరీల హీరో ఎవరంటే?
సచిన్ vs కోహ్లీ.. అవి మిస్ అవ్వకుంటే, సెంచరీల హీరో ఎవరంటే?
రెండు వారాలకు కృష్ణుడు పారితోషికం ఎంతో తెలుసా?
రెండు వారాలకు కృష్ణుడు పారితోషికం ఎంతో తెలుసా?
పాల ప్యాకెట్స్.. గ్రీన్, బ్లూ, ఆరెంజ్ రంగులో ఎందుకు ఉంటాయో తెలుసా
పాల ప్యాకెట్స్.. గ్రీన్, బ్లూ, ఆరెంజ్ రంగులో ఎందుకు ఉంటాయో తెలుసా
గుమ్మడి పువ్వులను తింటే ఎంత మంచిదో తెలుసా? అస్సలే ఊహించరు!
గుమ్మడి పువ్వులను తింటే ఎంత మంచిదో తెలుసా? అస్సలే ఊహించరు!
వేడి ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెడుతున్నారా? ఏమవుతుందో తెలిస్తే..
వేడి ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెడుతున్నారా? ఏమవుతుందో తెలిస్తే..
తల్లి అంత్యక్రియల తేదీపై AI చాట్ బాట్ తప్పుడు సలహా
తల్లి అంత్యక్రియల తేదీపై AI చాట్ బాట్ తప్పుడు సలహా
శుభలగ్నంలో మొగుడ్ని అమ్మేసే సీన్ చూసి ఆ పెద్ద హీరో ఏమన్నారంటే..
శుభలగ్నంలో మొగుడ్ని అమ్మేసే సీన్ చూసి ఆ పెద్ద హీరో ఏమన్నారంటే..
సొంత ఇల్లు లేక.. తల్లి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లలేని దుస్థితి
సొంత ఇల్లు లేక.. తల్లి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లలేని దుస్థితి
హార్దిక్ పాండ్యా రీఎంట్రీకి ఓ కండీషన్ పెట్టిన గంభీర్..
హార్దిక్ పాండ్యా రీఎంట్రీకి ఓ కండీషన్ పెట్టిన గంభీర్..