Rajendra Prasad : ఆ నటుడికి జరిగిన యాక్సిడెంట్ నా జీవితాన్ని మార్చేసింది.. ఆయన అడిగిన ప్రశ్నకు నా దగ్గర ఆన్సర్ లేదు.. రాజేంద్రప్రసాద్..
తెలుగు సినీ నటులు రాజేంద్ర ప్రసాద్, నూతన ప్రసాద్‌లకు జరిగిన ఘోర కారు ప్రమాదం వివరాలను రాజేంద్ర ప్రసాద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ ప్రమాదంలో నూతన ప్రసాద్ వెన్నెముక దెబ్బతిని పక్షవాతానికి గురవగా, రాజేంద్ర ప్రసాద్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆరోజు జరిగిన విషయాలను పంచుకున్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో దశాబ్దాలుగా తనదైన నటనతో అలరిస్తున్న విలక్షణ నటుడు రాజేంద్ర ప్రసాద్. ఇప్పటికీ వరుస చిత్రాల్లో కీలకపాత్రలు పోషిస్తున్నారు. తెలుగు సినీ నటులు రాజేంద్ర ప్రసాద్, దివంగత నూతన ప్రసాద్‌లకు 1980ల మధ్యలో జరిగిన ఓ విషాదకరమైన కారు ప్రమాదం వివరాలను రాజేంద్ర ప్రసాద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. “బామ్మ మాట బంగారు బాట” అనే సినిమా చిత్రీకరణ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నూతన ప్రసాద్ తీవ్రంగా గాయపడి, జీవితాంతం పక్షవాతానికి గురయ్యారు. రాజేంద్ర ప్రసాద్ మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన తీరును రాజేంద్ర ప్రసాద్ వివరించారు. కారులో రాజేంద్ర ప్రసాద్ డ్రైవింగ్ సీట్‌లో, నూతన ప్రసాద్ వెనుక సీట్‌లో కూర్చుని ఉన్నారు. ఒక సన్నివేశం కోసం కారును క్రేన్ సహాయంతో పైకి లేపుతుండగా, క్రేన్ నుంచి ఐరన్ చైన్ లింక్ అనుకోకుండా ఊడిపోయింది. దీంతో కారు అదుపు తప్పి కిందకు దూసుకుపోయింది. ఈ ఘటన క్షణాల్లో జరిగిందని, కారు కింద పడే క్రమంలో నూతన ప్రసాద్ వెనుక సీటులో ఉండటం వల్ల ఆయన తల, కింది భాగం గట్టిగా నొక్కుకుపోయాయని రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. దీనివల్ల నూతన ప్రసాద్ వెన్నెముకకు తీవ్రమైన గాయం తగిలి, రెండు కాళ్లు ప్యారలైజ్ అయ్యే పరిస్థితి ఏర్పడిందని వివరించారు.
అదే సమయంలో, రాజేంద్ర ప్రసాద్‌ను ప్రమాదం తర్వాత కారులో నుంచి బయటికి తీస్తుండగా, ఆయనకు పెద్దగా దెబ్బలు తగలలేదని గుర్తించారు. నూతన ప్రసాద్ మాత్రం “నేను నడవలేకపోతున్నాను, నన్ను పట్టుకెళ్లండి” అని చెప్పినట్లు రాజేంద్ర ప్రసాద్ గుర్తు చేసుకున్నారు. ఈ ప్రమాదం జరిగిన మరుసటి రోజు ఓ వార్తాపత్రికలో “హీరో రాజేంద్ర ప్రసాద్‌కు తీవ్ర గాయాలు, నూతన ప్రసాద్‌కు స్వల్ప గాయాలు” అనే హెడ్‌లైన్స్‌తో వార్తలు వచ్చాయని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. అయితే, వాస్తవానికి నూతన ప్రసాద్‌కే తీవ్రమైన గాయాలయ్యాయని, ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిందని రాజేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు.
ఈ ఘటన రాజేంద్ర ప్రసాద్ జీవితంపై చెరగని ముద్ర వేసింది. ఒకే కారులో, ఒకే చోట నుంచి, ఒకేసారి కింద పడినా ఇద్దరికీ వేర్వేరు ఫలితాలు రావడం తనను ఇప్పటికీ కలచివేస్తుందని ఆయన పేర్కొన్నారు. నూతన ప్రసాద్ తనను కలిసినప్పుడల్లా “చిన్నోడా, నువ్వు నేను కలిపి ఒకే చోట నుంచి ఒకేసారి ఒకేలా పడ్డాం కదా, ఏంటి ఈ తేడా?” అని అడిగేవారని, దానికి తాను సమాధానం చెప్పలేకపోయానని రాజేంద్ర ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదానికి ముందు నూతన ప్రసాద్ దాదాపు 32 చిత్రాలలో పని చేస్తూ చాలా బిజీ ఆర్టిస్ట్‌గా ఉన్నారని రాజేంద్ర ప్రసాద్ గుర్తు చేసుకున్నారు. ఈ సంఘటన తన జీవితంపై ఒక గొప్ప అనుభవంగా నిలిచిందని, జీవిస్తున్నంత కాలం టెన్షన్ పడాల్సిన అవసరం లేదన్న వాస్తవాన్ని ఇది బోధించిందని రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఈ ప్రమాదం తెలుగు సినీ చరిత్రలో ఒక విషాద సంఘటనగా మిగిలిపోయింది.
ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..
ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..
