AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రమానందన దంపతులకు బిగుస్తున్న ఉచ్చు..! ఈ కొత్త ట్విస్ట్ మామూలుగా లేదుగా..

యూకేలో ఉద్యోగాలు, వీసాలు ఇప్పిస్తామంటూ మోసం చేశారంటూ రమానందన దంపతులపై బాధితులు మరోసారి ఫిర్యాదు చేశారు. సీఎం ప్రజావాణిలో పలువురు బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. రూ.25 లక్షల నుంచి రూ.95 లక్షల వరకు వసూలు చేశారని ఆరోపించారు. కేసును డీజీపీ, ఈడీ దృష్టికి తీసుకెళ్లాలని ప్రజావాణి అధికారులు సూచించారు. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

రమానందన దంపతులకు బిగుస్తున్న ఉచ్చు..! ఈ కొత్త ట్విస్ట్ మామూలుగా లేదుగా..
Nandu World Fame Ramanandana Interrogated
Shaik Madar Saheb
|

Updated on: Sep 21, 2026 | 8:28 AM

Share

ఒకరి ఆశ.. ఇంకొకరికి అవకాశంగా మారుతుంది. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ఓ పద్దతి అయితే… దుర్వినియోగపరిచి బతుకులను ఆగం చేసే వారిది ఇంకో పద్దతి. యూకేలో జాబ్స్‌.. బ్యాక్‌డోర్‌ నుంచి పంపించే మార్గాలు తమకు బాగా తెలుసంటూ.. ఓ జంట యువతను నమ్మబలికింది. విదేశాల్లో జీతాలు, జీవితాలపై ఆశలుపెట్టుకున్న వారే టార్గెట్‌గా ఆ జంట మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఒక్కొక్కరి దగ్గర్నుంచి మినిమం పది నుంచి 20 లక్షల వరకు వసూలు చేసిన కపుల్‌.. మొత్తం వంద కోట్లకు టోకరా వేసినట్లు కథనాలు బయటకు వస్తున్నాయి. నందూస్‌ వరల్డ్‌ పేరుతో సోషల్‌ మీడియాలో తెగ పాపులర్‌ అయిన రమా నందన, మధుకర్‌ జంటపై ఇప్పుడు FIRలు నమోదవుతున్నాయి. బాధితులు ఒక్కొక్కరిగా పోలీసులను ఆశ్రయిస్తూ తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో నందు యూకే నుంచి రావడం.. ఆమెకు పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగిపోయాయి. జాబ్స్ పేరుతో మోసాలు.. వీసాల పేరుతో వసూళ్ల ఆరోపణలతో పోలీసులు వేస్తున్న ప్రశ్నలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. యూకేలో ఉద్యోగాలిప్పిస్తామని మోసం చేశారన్న బాధితుల వరుస ఫిర్యాదులతో ఆమె ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా.. యూట్యూబర్‌ నందన, ఆమె భర్త మధుకర్‌ తెలంగాణ సీఎం ప్రజావాణిలో ఫిర్యాదు అందింది..

యూకేలో ఉద్యోగాలు, వీసాలు ఇప్పిస్తామంటూ అమాయక నిరుద్యోగులను మోసగిస్తున్నారని ఆరోపిస్తూ పలువురు బాధితులు బేగంపేటలోని జ్యోతిబాఫులే ప్రజాభవన్‌లో నిర్వహించిన సీఎం ప్రజావాణిలో.. ఇన్‌ఛార్జి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షురాలు గద్వాల విజయలక్ష్మి, నోడల్‌ అధికారి విద్యాసాగర్, ఎన్‌ఆర్‌ఐ సలహా కమిటీ ఛైర్మన్, అంబాసిడర్‌ డా.వినోద్‌కుమార్‌లను కలిసి ఫిర్యాదు చేశారు. యూకే ప్రభుత్వం తమ కన్సల్టెన్సీ కంపెనీకి ఉద్యోగులను నియమించుకునే అనుమతి ఇచ్చిందని నందన, ఆమె భర్త మధుకర్‌ నమ్మబలికి మోసం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు.

రూ.25లక్షల నుంచి రూ.95లక్షల వరకు వసూలు

స్టూడెంట్, విజిటర్‌ వీసాలపై యూకే వెళ్లి, వీసా గడువు ముగియనున్న వారికి ఉద్యోగ వీసా ఇప్పిస్తామని నమ్మించి ఒక్కొక్కరి నుంచి రూ.25లక్షల నుంచి రూ.95లక్షల వరకు వసూలు చేశారని తెలిపారు. వారి కన్సల్టెన్సీ సమర్పించిన పత్రాలు నకిలీవని తేలడంతో యూకే ప్రభుత్వం పలువురు బాధితులపై చర్యలు తీసుకుందని.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రమానందన బాధితులు తెలంగాణలోని వికారాబాద్, జగిత్యాల, నిజామాబాద్‌ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఉన్నారని తెలిపారు. కాగా.. వారి గోడు విన్న సీఎం ప్రజావాణి బాధ్యులు రాష్ట్ర డీజీపీతో పాటు ఈడీకి ఫిర్యాదు చేయాలని, తాము పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. రమానందన కేసు విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు ఆదేశాలు ఇస్తుందన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!