AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జపాన్‌లో ఐఫోన్ పోగొట్టుకున్న భారతీయ మహిళ..! ఎక్కడ దొరికొందో తెలిస్తే షాకవుతారు

ఫోన్ పోతే ఎవ్వరైనా టెన్షన్ పడతారు. అందులోనూ ఖరీదైన ఐఫోన్ కనిపించకుండా పోతే టెన్షన్ మామూలుగా ఉండదు!  కానీ జపాన్‌లో ఓ భారతీయ మహిళ ఐఫోన్ పోగొట్టుకున్నా కూల్ గా ఉండటం ఆశ్చర్యపరుస్తుంది. కారణం ఆ దేశ ప్రజల నిజాయితీ పై నమ్మకమే అని ఆమె చెప్పడంతో పోయిన వస్తువులు తిరిగి దొరకడం జపాన్‌లోనే సాధ్యం అంటూ నెటిజన్లు ఆమె అభిప్రాయంతో ఏకీభవిస్తూ పోస్టులు పెడుతున్నారు. 

జపాన్‌లో ఐఫోన్ పోగొట్టుకున్న భారతీయ మహిళ..! ఎక్కడ దొరికొందో తెలిస్తే షాకవుతారు
Indian Woman Loses Iphone 16 Pro For 5th Time In Japan
Sharada V
|

Updated on: Sep 21, 2026 | 3:46 PM

Share

జపాన్ లో తన ఐఫోన్ 16 ప్రోను ఎక్కడో వదిలేసి మరిచిపోయింది ప్రగతి.  పోగొట్టుకున్న ఫోన్ కోసం రాత్రి 12 గంటలకు ఆమె వీధుల్లో నడుచుకుంటూ వెళ్లింది. ఫోన్‌ అప్పుడప్పుడు మాత్రమే చెక్ చేస్తాననీ,  ఎక్కడో  వదిలేసాననీ ఆమె వీడియోలో చెప్పుకొచ్చారు. “ఫోన్‌కు బానిస కావడం మంచిది కాదనీ అంటారు కానీ ఫోన్‌కు బానిస కాకపోవడం నాకు పెద్ద మైనస్” అంటూ చెప్పుకొచ్చారు. ” నా ఫోన్‌ను ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తుంటాను, అది పోయిందని రెండు మూడు గంటల తర్వాత గుర్తుకొస్తుంది,” అని ఆమె చెప్పారు. రాత్రి 12 గంటల సమయంలో తన దగ్గరున్న మరో ఫోన్‌లో లొకేషన్ చెక్ చేస్తే, అది 600 మీటర్ల దూరంలో ఉందనీ  తెలిసిందని అటుగా వెళ్లారు. యాపిల్  ‘ఫైండ్ మై’ ఫీచరే అనేక సార్లు తన ఫోన్‌ను ట్రేస్ చేయడానికి సహాయపడిందని ప్రగతి తెలిపారు.

తను ప్రతిసారీ ‘ఫైండ్ మై’ యాప్ వల్లే ఫోన్‌ను వెతికి కనిపెట్టగలిగాననీ ఆమె అన్నారు.  అలాగే యాపిల్ వాచ్‌కి కనెక్ట్ అయి ఉండటం వల్ల గతంలో ఫోన్‌ను కనిపెట్టగలిగారట.  లొకేషన్‌కు దగ్గరగా  వెళ్లేసరికి దూరం 100 మీటర్లకు తగ్గింది. ఫోన్‌ను ఎవరూ కదిలించి ఉండరని తను ఆశిస్తున్నట్లు ఆమె వీడియోలో చెప్పారు.  ” ఫోన్ ను  ఎవరు చూసినా అలాగే వదిలేస్తారు లేదంటే పోలీసు స్టేషన్‌లో అప్పగిస్తారు” అని ఆమె చెబుతూనే వీడియో లైవ్ స్ట్రీమ్ చేసారు.  ప్రగతి లొకేషన్‌కు చేరుకుని చూడగా ఆమె ఐఫోన్ అక్కడే భద్రంగా ఉంది. జపాన్ కాకుండా వేరే ఏ దేశంలో ఇలా జరుగుతుందో తనకు తెలియదనీ, జపాన్‌లో తనకు ఇలా నాలుగైదు సార్లు ఇలా జరిగిందని  ఆమె చెప్పుకొచ్చారు.

మరిన్నిట్రెండింగ్ స్టోరీలకు ఇక్కడ క్లిక్ చేయండి

ఇది ఐదో సారి

 “జపాన్‌లో ఐఫోన్ 16 ప్రోను పోగొట్టుకోవడం ఇది ఐదో సారి. ఎలాగోలా దాన్ని మళ్లీ వెతికి పట్టుకున్నాను! నిజం చెప్పాలంటే, ఇలాంటి అద్భుతాలు జపాన్‌లో మాత్రమే జరుగుతాయి” అంటూ ఆ స్టేట్మెంట్ నే తన వీడియోకు క్యాప్షన్ గా కూడా ఇచ్చారు.   వీడియోపై రకరకాలుగా స్పందించిన నెటిజన్లు ఆమె అనుభవానికి ఆశ్చర్యపోయారు.  “ఇది జపాన్‌లోనే సాధ్యం!” అని ఒక యూజర్, “జపాన్ ప్రజల నిజాయితీ సాటిలేనిది” అని . మరొకరు, “జపాన్ ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది” అని మూడో వ్యక్తి కామెంట్ చేసారు.

జపాన్‌లో ప్రతిరోజూ వేలాది మంది తమ వస్తువులు పోగొట్టుకుంటూ ఉంటారు. కానీ అలా పోయిన వస్తువులలో దాదాపు అన్నీ మళ్లీ దొరికిపోతాయి. జపాన్‌లో ఎవరికైనా ఇలా పోగొట్టుకున్న వస్తువులు దొరికితే, వాటిని వెంటనే టోక్యోలోని ‘లిడాబాషి’లో ఉన్న ‘లాస్ట్ ప్రాపర్టీ సెంటర్‌’కు పంపిస్తారు. అలా ఎవరెవరో పోగొట్టుకున్న వస్తువులన్నింటినీ ఈ కేంద్రంలో భద్రంగా ఉంచుతారు.

2019లో రికార్డు స్థాయిలో ఏకంగా 41.5 లక్షల వస్తువులు ఈ కేంద్రానికి వచ్చాయి. జపాన్ మొత్తంతో పోలిస్తే కేవలం టోక్యోలోనే 20 శాతం వస్తువులు పోతుంటాయి. అత్యధికంగా మొబైల్ ఫోన్లు మళ్లీ యజమానుల వద్దకు చేరుతుంటాయి. ఈ జాబితాలో వాలెట్లు, పర్సులు రెండో స్థానంలో ఉండటం విశేషం.

Follow Us