AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold: అయ్యబాబోయ్.. బంగారం ధరలు అంత పెరుగుతాయా.. మార్కెట్ లెక్కలు చూస్తే..

పసిడి పరుగులు పెడుతుందా? లేక మరింత దిగివస్తుందా? మొన్నటిదాకా సరికొత్త రికార్డులను తాకిన బంగారం ధరలు.. ఇప్పుడు కాస్త శాంతించడంతో మార్కెట్‌లో అసలేం జరుగుతోందనే ఉత్కంఠ మొదలైంది. ఇది తాత్కాలిక తగ్గుదలేనా.. లేక రాబోయే భారీ పెరుగుదలకు సంకేతమా? అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్న ఆ సంచలన అంచనాలు ఏమిటి? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Gold: అయ్యబాబోయ్.. బంగారం ధరలు అంత పెరుగుతాయా.. మార్కెట్ లెక్కలు చూస్తే..
Gold Price: సెప్టెంబర్ చివరి రోజుల్లో బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. సెప్టెంబర్ 30, 2026న ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర సుమారు రూ.1,48,950గా ఉండేది. ఆగస్టు చివరి రోజైన ఆగస్టు 31న, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర సుమారు రూ.1,58,260గా ఉంది. అంటే, సుమారు ఒక నెల వ్యవధిలో 10 గ్రాముల బంగారం ధర రూ.9,310 మేర తగ్గిపోయింది. శాతం పరంగా చెప్పాలంటే ఆగస్టు 31 - సెప్టెంబర్ 30 మధ్య 24-క్యారెట్ల బంగారం ధర సుమారుగా 5.9% తగ్గింది. ఒక నెల, గత ఐదు రోజుల డేటా ఆధారంగా దీనిని అర్థం చేసుకుందాం.
Krishna S
|

Updated on: Sep 21, 2026 | 3:17 PM

Share

పసిడి మార్కెట్‌లో ధరల హెచ్చుతగ్గులు ఇన్వెస్టర్లను, సామాన్య కొనుగోలుదారులను తీవ్ర సందిగ్ధంలో పడేస్తున్నాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, ద్రవ్యోల్బణం, స్థానిక డిమాండ్‌ల ప్రభావంతో బంగారం ధరలు నిత్యం మారుతున్నాయి. జనవరిలో గరిష్ట స్థాయిలను తాకిన ధరలు, ప్రస్తుతం స్వల్పంగా దిగిరావడంతో రాబోయే రోజుల్లో బంగారం బాట ఎటువైపు ఉండబోతుందనే చర్చ మొదలైంది. ఈ ఏడాది జనవరిలో గ్రాము బంగారం ధర గరిష్టంగా రూ.15,000 స్థాయికి చేరింది. అయితే ఆ తర్వాత మార్కెట్ సర్దుబాటుతో ప్రస్తుతం రూ.14,000 వద్ద ట్రేడ్ అవుతోంది. గత కొన్ని నెలలుగా ధరలు ఈ రెండు స్థాయిల మధ్యనే హెచ్చుతగ్గులకు లోనవుతుండటంతో మరింత తగ్గుతుందా లేక మళ్లీ పరుగులు పెడుతుందా అనే అయోమయం మార్కెట్‌లో కనిపిస్తోంది.

స్వల్పకాలిక ఒడిదుడుకులు సహజం

ధరలు తగ్గుముఖం పట్టడం చూసి భయపడాల్సిన అవసరం లేదని, ఇది సాధారణ కరెక్షన్ మాత్రమేనని మార్కెట్ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఏడాది పొడవునా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, వార్షిక ప్రాతిపదికన బంగారం ధరలు ఎల్లప్పుడూ స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తున్నాయి. ప్రస్తుత ధరలు కొంత అదుపులో ఉన్నప్పటికీ, ఏడాది చివరకు  పసిడి మళ్లీ సరికొత్త రికార్డులను తాకే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

దీర్ఘకాలిక పెట్టుబడికి స్వర్ణావకాశం

ప్రస్తుత ధరల వద్ద బంగారంలో పెట్టుబడి పెట్టడం సరైన నిర్ణయమేనా అన్న ప్రశ్నకు ఆర్థిక నిపుణులు అవును అనే బదులిస్తున్నారు. బంగారాన్ని ఎప్పుడూ స్వల్పకాలిక లాభాల కోసం చూడకూడదని, సురక్షితమైన దీర్ఘకాలిక ఆస్తిగా మాత్రమే పరిగణించాలని సూచిస్తున్నారు. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థల సీనియర్ అనలిస్టుల అంచనా ప్రకారం.. రాబోయే రోజుల్లో బంగారం ధర సుమారు 127 శాతం వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్ జోస్యం: ఔన్సు 10 వేల డాలర్ల స్థాయికి?

అంతర్జాతీయ ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ జెఫరీస్ ఈక్విటీ స్ట్రాటజీ హెడ్ క్రిస్ వుడ్ ప్రకారం.. రాబోయే కాలంలో బంగారం ధరలు రెట్టింపు అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రస్తుతం ఉన్న స్థాయిల నుంచి ఒక ఔన్సు బంగారం ధర సుమారు 10,000 డాలర్లకు చేరుకోవచ్చని ఆయన అంచనా వేశారు. అదే జరిగితే, భారత కరెన్సీ పరంగా తులం బంగారం ధర దాదాపు రూ. 3,21,700 మార్కును అధిగమించే ఆస్కారం ఉందని ఆయన వెల్లడించారు.1

కాగా ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు బంగారాన్ని నిల్వ చేసుకోవడం, కరెన్సీల ఒడిదుడుకులు, అంతర్జాతీయ రాజకీయ అనిశ్చితులు పసిడికి బలమైన మద్దతుగా నిలుస్తున్నాయి. కాబట్టి ప్రస్తుత తాత్కాలిక ధరల తగ్గుదలని కొనుగోలుదారులు, దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు ఒక మంచి అవకాశంగా మలుచుకోవచ్చని విశ్లేషకుల అభిప్రాయం.

Follow Us