AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విడాకులు పిటిషన్ ఉపసంహరించుకున్న సీఎం విజయ్ భార్య సంగీత..

తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసు కీలక మలుపు తిరిగింది. విడాకుల పిటిషన్‌ను విజయ్ భార్య సంగీత ఉపసంహరించుకున్నారు. దీంతో విజయ్-సంగీత విడాకుల పిటిషన్‌పై విచారణను చెంగల్‌పట్టు జిల్లా కోర్టు ముగించింది. సరిగ్గా ఎన్నికల ముందు విజయ్ భార్య సంగీత ఈ కేసు వేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది.

విడాకులు పిటిషన్ ఉపసంహరించుకున్న సీఎం విజయ్ భార్య సంగీత..
CM Vijay - Sangeetha
Ram Naramaneni
|

Updated on: Aug 07, 2026 | 4:13 PM

Share

తమిళగ వెట్రి కళగం అధినేత, సీఎం విజయ్, అతని భార్య సంగీతల కుటుంబ జీవితం గురించి ఇంటర్నెట్‌లో అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. వారిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో, సంగీత చెంగల్పట్టు కుటుంబ సంక్షేమ న్యాయస్థానంలో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. సరిగ్గా ఎన్నికలకు ముందు ఆమె ఈ పని చేయడం అప్పట్లో పెను సంచలనమైంది.

ఈ కేసుకు సంబంధించి ఏప్రిల్ 20, జూన్ 15 న వాయిదాలకు ఇరు పక్షాలు కోర్టుకు హాజరు కానందున, వారు ప్రముఖులు కావడంతో విచారణను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించాలని ఇరుపక్షాల న్యాయవాదులు అభ్యర్థించారు. దీంతో, ఈ కేసు ఈరోజు మళ్లీ విచారణకు వచ్చింది. వెబ్‌సైట్ లింక్ సమర్పించడంతో వీడియో కాల్ ద్వారా విచారణ ప్రారంభమైంది. సంగీతను తొలుత న్యాయమూర్తి ప్రశ్నించినప్పుడు, కేసు గమనాన్ని మార్చే ఒక నాటకీయ మలుపు చోటుచేసుకుంది.

విచారణ సందర్భంగా, తాను దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు సంగీత ఆకస్మికంగా ప్రకటించింది. దీని తరువాత, విజయ్, సంగీత మధ్య కేసు పూర్తిగా ముగిసిందని చెంగల్పట్టు కుటుంబ సంక్షేమ న్యాయస్థానం ప్రకటించింది. దీంతో గత కొన్ని రోజులుగా ఇంటర్నెట్‌లో ప్రచారంలో ఉన్న విడాకుల వదంతులకు తెరపడింది.

తమిళనాడులో ఎన్నికల ముందే విజయ్‌, సంగీతల విడాకుల కేసు హాట్‌ టాపిక్‌గా మారింది. విజయ్‌ నుంచి విడాకుల కోసం సంగీత కోర్టుకెక్కడంతో తమిళనాడు ఎన్నికల్లో ఈ అంశంపై పలు పార్టీలు ఆయన్ను టార్గెట్‌ చేశాయి. రూ. 250 కోట్ల భరణం కోరుతూ సంగీత కోర్టు మెట్లు ఎక్కారు అయితే విజయ్ నుంచి మాత్రం ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. అయితే ఏమైందో ఏమో విజయ్ ముఖ్యమంత్రి కావడంతో మనసు మార్చుకున్న సంగీత.. ఇపుడు తన భర్తపై పెట్టిన విడాకుల కేసులను వాపసు తీసుకుంటున్నట్టు కోర్టుకు తెలిపింది

2026 ఫిబ్రవరిలో సంగీత చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం అధికారికంగా పిటిషన్ దాఖలు చేశారు. తన భర్త విజయ్‌కు వేరే ఒక నటితో వివాహేతర సంబంధం ఉందనే ఆరోపణలతో పాటు, మానసిక క్షోభకు గురిచేశారని సంగీత తన పిటిషన్‌లో పేర్కొన్నారు. విడాకుల కేసులో తుది తీర్పు వచ్చే వరకు చెన్నై నీలంగరైలోని విజయ్ నివాసంలోనే తాను ఉండేందుకు అనుమతించాలని కోరుతూ సంగీత కోర్టులో మరో అనుబంధ పిటిషన్ వేశారు. ఈ విడాకుల సెటిల్‌మెంట్‌లో భాగంగా భరణం అంశం ప్రధానంగా నిలిచింది. విజయ్ ఎన్నికల నామినేషన్ పత్రాల్లో సమర్పించిన ఆస్తుల వివరాల ఆధారంగా సంగీత సుమారు రూ. 250 కోట్ల భరణాన్ని డిమాండ్ చేసినట్లు సమాచారం. అయితే, విజయ్ తరఫున రూ. 35 కోట్ల భరణం చెల్లించేందుకు, అలాగే పిల్లల బాధ్యతలను చూసుకునేందుకు అంగీకారం తెలిపినట్లు వార్తలు వచ్చాయి.

ఒకవైపు కోర్టులో చట్టపరమైన ప్రక్రియ నడుస్తుండగానే, మరోవైపు ఈ దంపతులు మళ్లీ ఒక్కటయ్యే అవకాశాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్ అలాగే ఇతర కుటుంబ సభ్యులు ఇరు పక్షాల మధ్య రాజీ కుదిర్చేందుకు చొరవ తీసుకున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా విడిగా ఉంటున్న ఈ దంపతులు, కుటుంబ సభ్యుల రాయబారంతో మనస్పర్థలను పక్కనబెట్టి సయోధ్యకు వచ్చే అవకాశం ఉందనే వార్తలు వినపడుతున్నాయి.

Follow Us