AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raja Yoga: రవి చంద్రుల పరివర్తన.. ఆ రాశి ఉద్యోగులకు తిరుగే ఉండదు..!

Sun–Moon Sign Exchange 2026: ఆగస్టు 13, 14, 15 తేదీల్లో రవి-చంద్రుల మధ్య అరుదైన రాశి పరివర్తన యోగం (Sun-Moon Parivartan Yoga) ఏర్పడుతోంది. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం ఈ యోగం రాజయోగం, ఉద్యోగ పురోగతి, ప్రభుత్వ అవకాశాలు, విదేశీ ప్రయాణాలు, ఆస్తి వ్యవహారాల్లో అనుకూల ఫలితాలకు దోహదపడుతుందని భావిస్తారు. ముఖ్యంగా మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, మీన రాశుల వారు ఈ కాలంలో చేపట్టే ప్రయత్నాలకు మంచి ఫలితాలు లభించే అవకాశం ఉందని చెబుతున్నారు.

Raja Yoga: రవి చంద్రుల పరివర్తన.. ఆ రాశి ఉద్యోగులకు తిరుగే ఉండదు..!
Sun Moon Parivartan Yoga
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 07, 2026 | 3:41 PM

Share

రాజయోగకారక గ్రహాలైన రవి, చంద్రుల మధ్య ఈ నెల(ఆగస్టు) 13, 14, 15 తేదీల్లో రాశి పరివర్తన జరుగుతోంది. ఈ రెండు గ్రహాల మధ్య సంవత్సరానికి ఒకసారి మాత్రమే పరివర్తన జరుగుతుంది.. ఈ రెండు గ్రహాల మధ్య పరివర్తన జరిగితే రాజయోగాలు, రాజకీయ ప్రాబల్యం కలుగుతాయి. ప్రభుత్వంలో ఉన్నతోద్యోగం లభించే అవకాశం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు తరచూ వెళ్లే అవకాశం కూడా లభిస్తుంది. ఆ మూడు రోజుల్లో ఎటువంటి ప్రయత్నాలు చేపట్టినా ఉత్తరోత్రా ఘన విజయాలు సిద్ధిస్తాయి. ఆస్తి సమస్యలు అనుకూలంగా సమసిపోతాయి.. మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, మీన రాశుల వారికి మనసులోని కోరికలు నెరవేరుతాయి.

మేషం

ఈ రాశివారికి చతుర్థ, పంచమాధిపతుల మధ్య పరివర్తన జరగడం అనేది ఒక విశేషమైన అధికార యోగం. ఉద్యోగంలో ఉన్నత పదవులు చేపట్టే అవకాశం ఉంది. ఒక కంపెనీకి సర్వాధికారి అయ్యే సూచనలు కూడా ఉన్నాయి. రాజయోగాలు పడతాయి. రాజకీయ ప్రాబల్యం కలుగు తుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు వృద్ధి చెందుతాయి. ఆస్తి లాభం, భూలాభం కలుగుతాయి. గృహ, వాహన యోగాలు పడతాయి. సంపద బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది.

మిథునం

ఈ రాశికి ధన, తృతీయాధిపతుల మద్య పరివర్తన జరగడం వల్ల ఆస్తి వివాదాలు కొద్ది ప్రయ త్నంతో అనుకూలంగా పరిష్కారమవుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు లాభిస్తాయి. సగటు వ్యక్తి కూడా సంపన్నుడయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉన్నతోద్యోగానికి సంబంధించిన పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయాలు సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది. ఉన్నత కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు.

కర్కాటకం

రాశ్యధిపతి చంద్రుడికి, ధన స్థానాధిపతి రవికి మధ్య పరివర్తన జరగడం వల్ల అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. కుటుంబ జీవితంలో సమస్యలు తొలగిపోయి సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. మీ సలహాలు, సూచనలతో సంస్థలు బాగా లబ్ధి పొందుతాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి.

తుల

దశమాధిపతి చంద్రుడికి, లాభాధిపతి రవికి మధ్య పరివర్తన జరగడం వల్ల ఉద్యోగంలో అధికా రులు, యాజమాన్యాలు మీకు అనుకూలంగా మారడం జరుగుతుంది. ఉద్యోగంలో శీఘ్ర పురోగ తికి అవకాశం ఉంది. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. పేరు ప్రఖ్యా తులు లభిస్తాయి. ప్రముఖులతో స్నేహ సంబంధాలు విస్తరిస్తాయి. ఆదాయం బాగా వృద్ధి చెందు తుంది.

వృశ్చికం

భాగ్య, దశమాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల ఈ రాశివారికి ఉద్యోగ జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి లాభిస్తాయి. నిజ ఆదాయంతో పాటు అదనపు ఆదాయం కూడా వృద్ధి చెందుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు.

మీనం

ఈ రాశికి పంచమ, షష్టాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజ యాలు సాధిస్తారు. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. సంతాన యోగానికి సంబంధించి శుభవార్త వింటారు. సంపన్న కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది..

Follow Us