రైలులో ప్రయాణిస్తున్న మహిళ.. పోలీసులకు పొంతనలేని సమాధానాలు.. అనుమానంతో బ్యాగ్‌ చెక్‌ చేయగా..

దేశంలో ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా స్మగ్లర్స్ ఆగడాలు కట్టడి చేయలేకపోతున్నారు. ప్రతిరోజూ ఏదో ప్రాంతంలో ఏదో ఒక స్మగ్లింగ్‌ జరుగుతూనే ఉంది.

రైలులో ప్రయాణిస్తున్న మహిళ.. పోలీసులకు పొంతనలేని సమాధానాలు.. అనుమానంతో బ్యాగ్‌ చెక్‌ చేయగా..
Suspicious Bag
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 08, 2022 | 6:06 PM

దేశంలో ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా స్మగ్లర్స్ ఆగడాలు కట్టడి చేయలేకపోతున్నారు. ప్రతిరోజూ ఏదో ప్రాంతంలో ఏదో ఒక స్మగ్లింగ్‌ జరుగుతూనే ఉంది. ఇటీవల అరుదైన బల్లులు, తాబేళ్లు, పాముల అక్రమ రవాణా ఎక్కువైపోయింది. తాజాగా రైల్లో ఓ మహిళ విదేశీ పాములు, బల్లులు, సాలీళ్లను అక్రమ రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నవంబరు 6న అర్ధరాత్రి నీలాంచల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న 52 ఏళ్ల మహిళ వీటిని ఝార్ఖండ్‌లోని టాటానగర్‌ నుంచి ఢిల్లీకి తరలిస్తుండగా పక్కా సమాచారంతో రైల్వే పోలీసులు తనిఖీలు నిర్వహించి వాటిని స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఆమె వద్దనున్న బ్యాగులో 29 విషపూరిత విదేశీ పాములు, బల్లులు, సాలీళ్లను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్లో వాటి విలువ కోట్లలో ఉంటుందని పోలీసులు తెలిపారు. మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా తనది పూణె అని చెప్పింది. నాగాలాండ్‌లో ఓ వ్యక్తి తనకు ఈ బ్యాగ్ ఇచ్చి ఢిల్లీ తీసుకెళ్లాలని సూచించినట్టు పోలీసులకు తెలిపింది. రైల్వే పోలీసులు తాము స్వాధీనం చేసుకున్న పాములు, బల్లులు, సాలీళ్లను అటవీశాఖ అధికారులకు అప్పగించారు. మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా