Oral Cavity Cancer: పొగాకు వినియోగదారుల్లో మీరు కూడా ఉన్నారా? ఈ లక్షణాలుంటే నోటి క్యాన్సర్ ఉన్నట్లే..

మనం ఆహార అలవాట్లు, లైఫ్‌స్టైల్‌ కారణంగా.. తెలిసీ తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్లు పలు ప్రాణాంతక వ్యాధులకు కారణం అవుతుంటాయి. అందులో క్యాన్సర్ కూడా ఒకటి. క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించి, తగిన చికిత్సనందించకపోతే జీవితాన్ని కోల్పోవల్సి..

Oral Cavity Cancer: పొగాకు వినియోగదారుల్లో మీరు కూడా ఉన్నారా? ఈ లక్షణాలుంటే నోటి క్యాన్సర్ ఉన్నట్లే..
National Cancer Awareness Day
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 08, 2022 | 4:19 PM

మనం ఆహార అలవాట్లు, లైఫ్‌స్టైల్‌ కారణంగా.. తెలిసీ తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్లు పలు ప్రాణాంతక వ్యాధులకు కారణం అవుతుంటాయి. అందులో క్యాన్సర్ కూడా ఒకటి. క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించి, తగిన చికిత్సనందించకపోతే జీవితాన్ని కోల్పోవల్సి వస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదికల ప్రకారం.. నేడు ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలకు ప్రధాన కారణం క్యాన్సర్. అవును.. అత్యధిక మరణాలు కాన్యర్‌ వల్ల సంభవిస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది. 2020లో దాదాపు 10 మిలియన్ల మంది క్యాన్సర్‌ వ్యాధితో మృతి చెందారు. ప్రతి ఆరు మరణాల్లో ఒకటి కాన్యర్‌ అన్నమాట.

అందుకే అవగాహన అవసరం..

ప్రస్తుతం మన దేశంలో దాదాపు 45 లక్షల మంది క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. వీరిలో 40 నుంచి 50 శాతం క్యాన్సర్ పేషెంట్లు చివరి దశలో ప్రాణాలతోపోరాడుతున్నట్లు పలు అధ్యనాలు వెల్లడించాయి. ఇటువంటి వారికి చికిత్సనందించడం ఓ సవాలే. దురదృష్టవశాత్తు మరణాల రేటు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక క్యాన్సర్‌ చికిత్స దీర్ఘకాలిక మైనది. చికిత్స సమయంలో రోగి శారీరకంగానేకాకుండా మానసికంగా కూడా కుంగుబాటుకు గురౌతాడు. క్యాన్సర్‌ కేసులను తగ్గించడానికి ఏకైక మార్గం క్యాన్సర్ వ్యాధి లక్షణాలు, కారణాలపై అవగాహన కలిగి ఉండటం. ఫరీదాబాద్‌లోని సర్వోదయ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ దినేష్ పెంధార్కర్ ఏమంటున్నారంటే..

క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించే వెలుసుబాటు మన దేశ హెల్త్‌ సిస్టమ్‌లో లేదు. కేవలం లక్షణాలను బట్టి మొదట చికిత్స ప్రారంభించి, అనంతరం క్యాన్సర్‌ నిర్ధారణకు పరీక్షలు చేస్తారు. అందువల్ల ప్రజలతోపాటు, డాక్టర్లకు కూడా వివిధ క్యాన్సర్లకు సంబంధించిన లక్షణాలపై అవగాహన ఉండాలి.

ఇవి కూడా చదవండి

క్యాన్సర్లకు ప్రధానం కారణాలు ఏవంటే..

మన దేశంలోని మొత్తం క్యాన్సర్‌లలో 40 శాతం నోటి క్యాన్సర్లుకావడం గమనార్హం. ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన వారికి నోటి క్యాన్సర్‌ ప్రమాదం ఎక్కువ. సాధారణంగా నాలుగు ప్రధాన కారణాల వల్ల క్యాన్సర్‌ వ్యాధి తలెత్తుతుంది.

  • పొగాకు
  • ఆల్కహాల్
  • ఊబకాయం (ఒబేసిటీ)
  • హ్యూమన్ పాపిల్లోమావైరస్ (హెచ్‌పీవీ), హెపటైటిస్‌ వంటి వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు

పొగాకుకు దూరం.. దూరం..

ఓరల్ కేవిటీ క్యాన్సర్‌లకు ప్రధాన కారంణం పొగాకు. పొగాకు ఉత్పత్తులను నమలడం, పొగ తాగడం వంటి ఏ రూపంలో వాడినా క్యాన్సర్‌ ముప్పు 40 శాతం అధికం.

నోటి క్యాన్సర్ లక్షణాలు ఇవే..

ఇతర క్యాన్సర్లతో పోల్చితే నోటి క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించవచ్చు. పొగాకు ఉత్పత్తులను వినియోగించేవారు తమ నోటి భాగాన్ని అద్దంలో చూసుకోవడం ద్వారా సులువుగా గుర్తించవచ్చు.

  • తరచూ నోటిపూత
  • చిగుళ్ల వాపు
  • బ్రష్‌ చేసే సమయంలో రక్తం కారడం,
  • మెడ ప్రాంతంలో వాపు/నొప్పి

ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలి. వైద్యులు నోటి భాగాన్ని పరీక్షించి, పరీక్షల నిమిత్తం నోటిలోని బయాప్సీ నమూనాను సేకరిస్తారు. సాధారణంగా పొగాకు నమిలేవారికి నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. తొలి దశలోకాకుండా.. చివరి దశలో నోటి క్యాన్సర్‌ను గుర్తిస్తే మాత్రం ఏళ్లపాటు చికిత్స కొనసాగించవల్సి ఉంటుంది. అధిక సందర్భాల్లో మృత్యువు దాపురిస్తుంది.

నోటి క్యాన్సర్‌ నివారణకు ఏకైక మార్గం పొగాకు వినియోగానికి దూరంగా ఉండటం, అవగాహన మాత్రమేనని డాక్టర్ దినేష్ పెంధార్కర్ సూచించారు.

మరిన్ని హెల్త్‌/లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.