- Telugu News Photo Gallery Is Egg Veg or Non Veg: Should Vegetarians Eat Eggs? Scientists finally put an end to the debate
Is Egg Veg or Non Veg: గుడ్లు శాఖాహారమా? మాంసాహారమా?.. సైన్స్ ఏం చెబుతోందంటే..
సైన్స్ కోణం నుంచి చూస్తే.. కోడి గుడ్డు పెట్టినంత మాత్రాన అది మాంసాహారం కాదు. జంతువుల నుంచి వచ్చే ప్రతిదీ మాంసాహారంగా పరిగణించకూడదు. దీనికి మరో మంచి ఉదాహరణ పాలు. గుడ్డు మాంసాహారమైతే మరి పాలు కూడా గేదెల నుంచి వస్తాయి కదా! అప్పుడు పాలను కూడా మాంసాహారంగానే పరిగణించాలి..
Updated on: Nov 09, 2022 | 2:39 PM

ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు గుడ్డులో పుష్కలంగా ఉంటాయి. మాంసకృత్తులు, 9 రకాల అమైనో ఆమ్లాలు, బి కాంప్లెక్స్ విటమిన్లు, డి విటమిన్, ఖనిజాలు నిండుగా ఉంటాయి. ఐతే గుడ్డు శాఖాహారమా లేక మాంసాహారమా అనే మీమాంస మాత్రం ప్రతి ఒక్కరిలో ఉంది. ఐతే సైన్స్‌లో శాకాహార ఆహారానికి నిర్ధిష్ట నిర్వచనం ఉంది. జంతు మాంసం లేని ఆహారాన్ని శాఖాహారం అని అంటారు. ఈ కోణంలో చూస్తే గుడ్డు శాఖాహారంగానే పరిగణించాలి. ఇలాంటి ఆహారం తీసుకునే వ్యక్తులను ఓవో-వెజిటేరియన్స్ అంటారు.

సైన్స్‌ను పక్కనపెడితే.. భారతీయులు మాత్రం గుడ్డును మాంసాహారంగా పరిగణిస్తారు. అందుకే శాఖాహారులు వీటిని తినరు. సైన్స్ కోణం నుంచి చూస్తే.. గుడ్లు 2 రకాలు. ఫలదీకరణం గుడ్లు, ఫలదీకరణం చేయని గుడ్లు. మొదటి రకం గుడ్డులోంచి కోడి పిల్ల బయటకు వస్తుంది. ఇక రెండో రకం గుడ్డు కేవలం ఆహారం కోసం ఉపయోగించే గుడ్లు. అంటే వీటి నుంచి కోడి పల్లలు బయటికిరావు.

కోడి పెట్ట, కోడి పుంజుల పునరుత్పత్తి చర్య వల్ల పెట్టిన కోడి గుడ్డును ఫలదీకరణ గుడ్డు అంటారు. కోడి పుంజు సహకారంలేకుండా పెట్టిన గుడ్డును ఫలదీకరణం చేయని గుడ్డు అంటారు. గుడ్డులోపల కోడి పిల్ల అభివృద్ధి చెందని గుడ్లను కోళ్ల ఫారంలలో సేద్యం చేస్తారు. ఇటువంటి గుడ్డను శాఖాహారంగా పరిగణించవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఐతే కొన్ని గుడ్లలో అప్పుడప్పుడు రక్తపు చుక్కలు కనిపిస్తాయి. సైన్స్ భాషలో దీనిని మీట్ స్పాట్ అంటారు. గుడ్డు ఫలదీకరణం చెందిందని దీని అర్థం కాదు. కోడి శరీరంలో గుడ్డు తయారవుతున్నప్పుడు రక్తనాళాలు దెబ్బతింటాయి. దాని ప్రభావం వల్లనే గుడ్డులో రక్తం చుక్కలు కనిపిస్తాయి.

సైన్స్ కోణం నుంచి చూస్తే.. కోడి గుడ్డు పెట్టినంత మాత్రాన అది మాంసాహారం కాదు. జంతువుల నుంచి వచ్చే ప్రతిదీ మాంసాహారంగా పరిగణించకూడదు. దీనికి మరో మంచి ఉదాహరణ పాలు. గుడ్డు మాంసాహారమైతే మరి పాలు కూడా గేదెల నుంచి వస్తాయి కదా! అప్పుడు పాలను కూడా మాంసాహారంగానే పరిగణించాలి..





























