- Telugu News Photo Gallery Science photos China send monkeys to space to study mating about reproduction in zero gravity
జీరో గ్రావిటీలో పునరుత్పత్తిని అధ్యయనం కొరకు కోతులను అంతరిక్షంలోకి పంపనున్న చైనా
రోదసీపై ఆధిపత్యానికి డ్రాగన్ కొత్త ఎత్తులు వేస్తోంది. త్వరలో స్పేస్ లోకి కోతులను పంపి ప్రయోగాలు చేసుందుకు రెడీ అవుతోంది. జీరో గ్రావిటీలో కోతుల పునరుత్పత్తి సాధ్యమా ? అన్న విషయంపై పరిశోధనలు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
Updated on: Nov 07, 2022 | 3:22 PM

రోదసీపై ఆధిపత్యానికి డ్రాగన్ కొత్త ఎత్తులు వేస్తోంది. త్వరలో స్పేస్ లోకి కోతులను పంపి ప్రయోగాలు చేసుందుకు రెడీ అవుతోంది.

జీరో గ్రావిటీలో కోతుల పునరుత్పత్తి సాధ్యమా ?? అన్న విషయంపై పరిశోధనలు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. చైనా రోదసీలో కొత్తగా నిర్మించిన తియాంగాంగ్ స్పేస్‌స్టేషన్‌లో ఈ పరిశోధనలు నిర్వహిస్తారు.

రోదసీ లోకి పంపించిన తరువాత కోతుల ప్రవర్తన ఎలా ఉంటుంది .. వాటిపెరుగుదల ఎలా ఉంటుందన్న విషయంపై రీసెర్చ్ చేస్తారు.

రోదసీలో కోతుల పునరుత్పత్తి సాధ్యమా ? అన్న విషయం పైనే ప్రధానంగా పరిశోధన జరుగుతుంది. రోదసీలో ఇప్పటికే పలు జీవులపై చైనా శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహించారు.

భవిష్యత్‌లో మనుషులు కూడా అక్కడ కాపురం చేసే అవకాశం ఉందా ? అన్న విషయంపై కూడా పరిశోధనలు జరిగే అవకాశం ఉంది.

చైనా శాస్త్రవేత్తలు ఇప్పటికే ఎలుకలను రోదసీ లోకి పంపించి పరిశోధనలు చేశారు. ఎలుకల్లో అక్కడ పునరుత్పత్తి సాధ్యమా ? అన్న విషయంపై పరిశోధనలు జరిగాయి.

రష్యా , అమెరికా స్పేస్ స్టేషన్లకు ధీటుగా తియాంగాంగ్ స్పేస్ స్టేషన్‌ను చైనా తీర్చిదిద్దింది.




