Phani CH |
Updated on: Nov 07, 2022 | 9:03 PM
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో విజయవంతంగా ముగిసింది.
23న తెలంగాణలోకి ప్రవేశించి.. నవంబర్ 7న మద్నూర్ మండలం మెనూరు వద్ద భారీ బహిరంగ సభతో ముగిసిన యాత్ర..
తెలంగాణలో 375 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ.. ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి 15 కిలోమీటర్లు.. సాయంత్రం 4 గంటల నుంచి 10 కిలోమీటర్ల యాత్ర సాగింది..
19 అసెంబ్లీ నియోజక వర్గాల్లో, 7 పార్లమెంట్ నియోజక వర్గాలలో సాగిన యాత్ర. చారిత్రక చార్మినార్ వద్ద నుంచి నవంబర్, 1,2 తేదీలలో హైదరాబాద్ లో సాగిన యాత్ర.
సామాజిక సంఘాలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు, నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళలు, జర్నలిస్టులు, రైతులు తదితరులతో సమావేశం అయిన రాహుల్..
పాదయాత్ర లో చాలా ఉత్సాహంగా పాల్గొన్న రాహుల్.. తెలంగాణ సమాజం రాహుల్ కు సంపూర్ణ మద్దతు..
బహిరంగ సభలలో భారత్ జోడో యాత్ర లక్ష్యాలను వివరించిన రాహుల్..బీజేపీ మోడీ, టిఆర్ఎస్ కేసీఆర్ లపై పదునైన విమర్శలు