Oneplus nord CE3: వన్‌ప్లస్‌ నుంచి అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్ల తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే..

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. వన్‌ప్లస్‌ సిరీస్‌ నుంచి మరో ప్రీమియం ఫోన్‌ను త్వరలోనే మార్కెట్లోకి తీసుకురానుంది. వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ3 పేరుతో లాంచ్‌ చేయనున్న ఈ ఫోన్‌లో ఆకట్టుకునే ఫీచర్లను అందించనున్నట్లు సమాచారం. అయితే ఈ ఫోన్‌ ఫీచర్లకు సంబంధించి ఇప్పటి..

Oneplus nord CE3: వన్‌ప్లస్‌ నుంచి అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్ల తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే..
Oneplus Nord Ce3
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 10, 2022 | 7:54 PM

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. వన్‌ప్లస్‌ సిరీస్‌ నుంచి మరో ప్రీమియం ఫోన్‌ను త్వరలోనే మార్కెట్లోకి తీసుకురానుంది. వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ3 పేరుతో లాంచ్‌ చేయనున్న ఈ ఫోన్‌లో ఆకట్టుకునే ఫీచర్లను అందించనున్నట్లు సమాచారం. అయితే ఈ ఫోన్‌ ఫీచర్లకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు. అయితే సోషల్‌ మీడియాలో మాత్రం కొన్ని ఫీచర్లు లీక్‌ అయ్యాయి.

నెట్టింట వైరల్‌ అవుతోన్న ఈ ఫీచర్ల ప్రకారం ఈ ఫోన్‌లో 108 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాను ఇవ్వనున్నట్లు సమాచారం. కెమెరాకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చారు. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ పవర్‌ఫుల్‌ క్వాల్‌కం స్నాప్‌డ్రాగన్‌ 965 ప్రాసెసర్‌ను అందించనున్నారు. 5జీ నెట్‌ వర్క్‌తో పని చేసతే ఈ ఫోన్‌లో ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. 6.7 ఇంచెస్‌ స్క్రీన్‌తో కూడిన ఎల్‌సీడీ స్క్రీన్‌ ఈ ఫోన్‌ సొంతం. ఇదిలా ఉంటే ఈ ఫోన్‌ ధరకు సంబంధించిన ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ2కు కొనసాగింపుగా తీసుకొస్తున్నారు. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌లో బ్యాటరీకి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చారు. ఇందులో ఏకంగా 67 డబ్ల్యూ ఫాస్ట్‌చార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందిస్తున్నట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

పెళ్లికి రావాలని చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం
పెళ్లికి రావాలని చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం
ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్