AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంగ్లాండ్ చేతిలో ఓటమి.. పాకిస్తాన్ సెమీస్ చేరాలంటే ఈ విచిత్రం జరగాల్సిందే..?

Pakistan May Qualify for T20 World Cup Semi-Fnals: ఇంగ్లాండ్ జట్టుతో ఘోర పరాజయంతో పాకిస్తాన్ పరిస్థితి దారుణంగా మారింది. ఫిబ్రవరి 28న శ్రీలంకతో తన చివరి మ్యాచ్ ఆడనుంది. అయితే, ఈ మ్యాచ్ ఫలితంతోపాటు మరికొన్ని విచిత్రాలు కూడా జరగాల్సిందే. లేదంటే పాకిస్తాన్ టీం దాదాపుగా సెమీస్ రేసు నుంచి తప్పుకున్నట్లే.

ఇంగ్లాండ్ చేతిలో ఓటమి.. పాకిస్తాన్ సెమీస్ చేరాలంటే ఈ విచిత్రం జరగాల్సిందే..?
Pakistan Qualification Scenarios
Venkata Chari
|

Updated on: Feb 25, 2026 | 7:15 AM

Share

Pakistan Qualification Scenarios: పల్లెకెలె వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్‌లో పాకిస్తాన్ ఇంగ్లాండ్ చేతిలో రెండు వికెట్ల తేడాతో ఓడిపోయింది. హ్యారీ బ్రుక్ అద్భుతంగా ఆడి 51 బంతుల్లో సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. 165 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో చేధించింది. ఈ విజయంతో ఇంగ్లాండ్ రెండు మ్యాచ్‌ల్లో నాలుగు పాయింట్లు సాధించి సూపర్-8 గ్రూప్-2 నుంచి సెమీఫైనల్‌కు చేరింది. ఇక పాకిస్తాన్ మాత్రం రెండు మ్యాచ్‌ల్లో ఒక్క పాయింట్‌తోనే నిలిచింది. ఈ ఓటమితో పాకిస్తాన్ సెమీఫైనల్ ఆశలకు తీవ్ర దెబ్బ తగిలింది.

ప్రస్తుతం పాయింట్ల పట్టిక (సూపర్-8 గ్రూప్-2)..

ఇంగ్లాండ్ – 4 పాయింట్లు (2 మ్యాచ్‌లు), నెట్ రన్ రేట్ +1.491

న్యూజిలాండ్ – 1 పాయింట్ (1 మ్యాచ్), నెట్ రన్ రేట్ 0

ఇవి కూడా చదవండి

పాకిస్తాన్ – 1 పాయింట్ (2 మ్యాచ్‌లు), నెట్ రన్ రేట్ -0.461

శ్రీలంక – 0 పాయింట్లు (1 మ్యాచ్), నెట్ రన్ రేట్ -2.550

ఇది కూడా చదవండి: IND vs SA: సూర్య, గంభీర్ తీసుకున్న ఈ ఒక్క నిర్ణయమే.. టీమిండియా ఓటమికి కారణం: అశ్విన్

సూపర్-8లో పాకిస్తాన్‌కు ఇంకా ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఫిబ్రవరి 28న శ్రీలంకతో ఆడనుంది. ఇక ఇంగ్లాండ్ ఫిబ్రవరి 27న న్యూజిలాండ్‌తో తలపడుతుంది. పాకిస్తాన్ సెమీఫైనల్ చేరాలంటే తప్పనిసరిగా శ్రీలంకపై గెలవాలి. అయితే గెలిచినా కూడా అది సరిపోకపోవచ్చు.

మిగిలిన మ్యాచ్‌లు – సూపర్-8 గ్రూప్-2..

ఫిబ్రవరి 25: న్యూజిలాండ్ vs శ్రీలంక

ఫిబ్రవరి 27: న్యూజిలాండ్ vs ఇంగ్లాండ్

ఫిబ్రవరి 28: పాకిస్తాన్ vs శ్రీలంక

ఇది కూడా చదవండి: IND vs ZIM: గంభీర్ ఈ 3 తప్పిదాలు రిపీటైతే.. సెమీస్ చేరకుండానే టీమిండియా ఔట్..?

పాకిస్తాన్ సెమీఫైనల్ చేరే అవకాశాలు..

1: పాకిస్తాన్ శ్రీలంకపై గెలవాలి. అదే సమయంలో ఇంగ్లాండ్ న్యూజిలాండ్‌పై గెలవాలి. అలాగే, శ్రీలంక న్యూజిలాండ్‌పై గెలవాలి. అప్పుడు పాయింట్ల పట్టిక ఇలా ఉంటుంది.. పాకిస్తాన్ (3), శ్రీలంక (2), న్యూజిలాండ్ (1). ఈ పరిస్థితిలో గ్రూప్-2 నుంచి రెండో ఉత్తమ జట్టుగా పాకిస్తాన్ సెమీఫైనల్‌కు చేరుతుంది.

2: న్యూజిలాండ్ తమ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఒకదాంట్లో గెలిచి, ఒకదాంట్లో ఓడితే – పాకిస్తాన్ శ్రీలంకపై గెలిచిన పక్షంలో – పాకిస్తాన్, న్యూజిలాండ్ రెండూ 3 పాయింట్లతో సమానంగా నిలుస్తాయి. అప్పుడు మెరుగైన నెట్ రన్ రేట్ (NRR) ఉన్న జట్టు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.

3: పాకిస్తాన్ శ్రీలంకతో మ్యాచ్‌లో ఓడిపోతే – నేరుగా టోర్నమెంట్ నుంచి బయటపడుతుంది.

4 : పాకిస్తాన్ vs శ్రీలంక మ్యాచ్ వర్షం కారణంగా రద్దైతే పాకిస్తాన్‌కు 2 పాయింట్లు వస్తాయి. అదే సమయంలో శ్రీలంక vs న్యూజిలాండ్ మ్యాచ్ కూడా వర్షం వల్ల రద్దైతే శ్రీలంకకు కూడా 2 పాయింట్లు ఉంటాయి. ఇక న్యూజిలాండ్ ఇంగ్లాండ్ చేతిలో ఓడితే, న్యూజిలాండ్ కూడా 2 పాయింట్లతోనే నిలుస్తుంది. అప్పుడు పాకిస్తాన్, శ్రీలంక, న్యూజిలాండ్ జట్లలో మెరుగైన నెట్ రన్ రేట్ ఉన్న జట్టు ఇంగ్లాండ్‌తో కలిసి సెమీఫైనల్‌కు చేరుతుంది.

ఇది కూడా చదవండి: IND vs ZIM: జింబాబ్వేతో కీలక మ్యాచ్.. ఏకంగా నలుగురికి హ్యాండిచ్చిన సూర్య.. ఎవరంటే?

హ్యారీ బ్రుక్ చారిత్రాత్మక ఇన్నింగ్స్..

పాకిస్తాన్‌పై హ్యారీ బ్రుక్ తన టీ20 కెరీర్‌లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు. 51 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో శతకం బాది ఇంగ్లాండ్‌ను సెమీఫైనల్‌కు చేర్చాడు. 165 పరుగుల లక్ష్య ఛేజింగ్‌లో ఇంగ్లాండ్ 35/3, 58/4గా కష్టాల్లో ఉన్న సమయంలో బ్రుక్ ఒంటరిగా జట్టును గెలిపించాడు. ఈ ఇన్నింగ్స్ టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇంగ్లాండ్ కెప్టెన్ చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా కూడా నిలిచింది.

ఇక ఉస్మాన్ తారిఖ్ (4 ఓవర్లలో 2/31), షాహీన్ షా అఫ్రిది (4/30) అద్భుతంగా బౌలింగ్ చేసినప్పటికీ, బ్రుక్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి ఇంగ్లాండ్‌కు ఐదు బంతులు మిగిలి ఉండగానే విజయం అందించాడు. ఈ విజయంతో ఇంగ్లాండ్ వరుసగా ఐదోసారి టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్‌కు చేరిన జట్టుగా నిలిచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us