Meta Layoffs: నిన్న ట్విట్టర్‌.. నేడు మెటాలో ఉద్యోగాల కోత.. సోషల్‌ మీడియా ఉద్యోగుల్లో దడదడ..

సోషల్‌ మీడియాలో ఉద్యోగుల్లో దడదడలాడిస్తోంది. ట్విట్టర్‌ బాటపట్టిన మెటా ఇప్పుడు సర్వత్రా హాట్‌ టాపిక్‌గా మారింది. సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌..

Meta Layoffs: నిన్న ట్విట్టర్‌.. నేడు మెటాలో ఉద్యోగాల కోత.. సోషల్‌ మీడియా ఉద్యోగుల్లో దడదడ..
Meta Layoffs
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 10, 2022 | 12:42 PM

నిన్న ట్విట్టర్‌ లో కాస్ట్‌కట్‌ కలకలం రేపింది.. నేడు మెటాలో ఉద్యోగాల కోత.. మోతమోగిస్తోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట..ఉద్యోగులకు ఉద్వాసన.. ఎప్పుడు ఎక్కడ.. ఎలా ఊడుతుందో తెలియని ఉద్యోగాలు సోషల్‌ మీడియాలో ఉద్యోగుల్లో దడదడలాడిస్తోంది. ట్విట్టర్‌ బాటపట్టిన మెటా ఇప్పుడు సర్వత్రా హాట్‌ టాపిక్‌గా మారింది. సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటాలో ఒకరు కాదు ఇద్దరు కాదు 11 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. తమ సంస్థలో 13 శాతం మేర ఉద్యోగులను తగ్గించనున్నట్లు ప్రకటిస్తూ..ఉద్యోగుల గుండెల్లో బాంబులు పేల్చారు మెటా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ మార్క్‌ జుకర్‌ బర్గ్‌. అయితే తరుముకొస్తోన్న ఆర్థిక మాంద్యంతో అమెరికన్‌ కంపెనీలు కాస్త ముందుగానే ఎలర్ట్‌ అయినట్టు ఈ కోతలు తేటతెల్లం చేస్తున్నాయి.

ఉద్యోగుల తొలగింపు కఠినమైన నిర్ణయమేనని, అయితే కాస్ట్‌ కటింగ్‌లో భాగంగా తప్పలేదని జుకర్‌ బర్గ్‌ వెల్లడించారు. అంతేకాదు రాబోయే యేడాది మొదటి మూడు నెలలు పూర్తయ్యేవరకు ఉద్యోగ నియామకాలుండవని స్పష్టం చేశారు. యాడ్స్‌ ఆదాయం తగ్గినందు వల్ల. ఆర్థిక మాంద్యం ప్రభావం ఉద్యోగులపై పడిందని వెల్లడించారు మెటా చీఫ్‌. ఈ యేడాది వరుసగా రెండు త్రైమాసికాల్లో మెటా.. రెవెన్యూలో భారీగా తగ్గుదల కనిపించింది.

కోవిడ్‌ అనంతర పరిణామాలు ఇప్పుడు అనేక కంపెనీల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అంతర్జాతీయంగా ఆర్థిక సంక్షోభం ప్రభావంతో పెరిగిన బ్యాంకు వడ్డీరేట్లు, ఇతర ఆర్థిక సంబంధిత మార్పులు… టెక్‌ కంపెనీలపై తీవ్రంగా ప్రభావం చూపాయి.

దీంతో ఆల్ఫాబెట్‌, అమెజాన్‌ లాంటి అనేక కంపెనీలు కాస్ట్‌కటింగ్‌ మొదలుపెట్టాయి. ఉద్యోగులను తొలగించాయి. కొద్దిరోజుల పాటు, కొత్తగా ఉద్యోగులను తీసుకోకూడదని నిర్ణయించాయి. గత అక్టోబర్‌ నెలలో మైక్రోసాఫ్ట్‌లో 1000 మంది ఉద్యోగులను ఉద్యోగాల్లోంచి తీసేశారు.

ట్విట్టర్‌ 90 శాతం మంది భారతీయ ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. అయితే మెటా ఉద్యోగులపై వేటు ఇండియన్‌ ఎంప్లాయీస్‌పై ఎలా ఉంటుందనేది ఇంకా తేలలేదు. అయితే మెటా వేటుతో ఇండియన్స్‌కి ముప్పు తప్పదని స్పష్టం అవుతోంది. తొలగించిన ఉద్యోగులకు 16 వారాల వేతనం లభిస్తుందని వెల్లడించారు జుకర్‌ బర్గ్‌. కంపెనీలో పనిచేసిన కాలానికి ఏడాదికి రెండు వారాల చొప్పున అదనపు వేతనం ఇవ్వనున్నట్టు వెల్లడించారు.

ఉద్యోగాల్లో నుంచి తీసివేసినా, వారి కుటుంబ సభ్యులకు ఆరు నెలల వరకు ఆరోగ్య బీమా కొనసాగుతుందని జుకర్‌ బర్గ్ చెప్పారు. మెటాలో భారతీయ ఉద్యోగులు 400 మంది ఉన్నారు. మెటా బిజినెస్‌ సైతం జోరుగానే సాగుతోంది. అయినా కాస్ట్‌కట్‌ లో భాగంగా ఉద్యోగాల కోత ఇండియన్ ఎంప్లాయీస్‌లోనూ దడపుట్టిస్తోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం

పెట్రోలు ధరల టెన్షన్‌కు ఇక టాటా.. అందుబాటులోకి సీఎన్జీ కార్లు
పెట్రోలు ధరల టెన్షన్‌కు ఇక టాటా.. అందుబాటులోకి సీఎన్జీ కార్లు
'అల్లు అర్జున్‌కో రూలు.. వాళ్లకో రూలా?' సుమన్ సంచలన కామెంట్స్
'అల్లు అర్జున్‌కో రూలు.. వాళ్లకో రూలా?' సుమన్ సంచలన కామెంట్స్
గోల్డ్ లవర్స్‌కి అదిరిపోయే న్యూస్.. తగ్గిన బంగారం ధర
గోల్డ్ లవర్స్‌కి అదిరిపోయే న్యూస్.. తగ్గిన బంగారం ధర
బిగ్ బాస్ విజేతగా నిఖిల్.. ప్రైజ్ మనీతో పాటు పారితోషికం భారీగానే
బిగ్ బాస్ విజేతగా నిఖిల్.. ప్రైజ్ మనీతో పాటు పారితోషికం భారీగానే
ముగిసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌.. 445 పరుగులకు ఆలౌట్
ముగిసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌.. 445 పరుగులకు ఆలౌట్
Horoscope Today: ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో వారికి శుభవార్తలు..
Horoscope Today: ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో వారికి శుభవార్తలు..
'శ్రీతేజ్‌ను అందుకే కలవలేకపోతున్నా.. నిత్యం ప్రార్థిస్తున్నా'
'శ్రీతేజ్‌ను అందుకే కలవలేకపోతున్నా.. నిత్యం ప్రార్థిస్తున్నా'
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విజేతగా నిఖిల్.. రన్నరప్ గా గౌతమ్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విజేతగా నిఖిల్.. రన్నరప్ గా గౌతమ్
ప్రముఖ తబలా విద్వాంసుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ హఠాన్మరణం
ప్రముఖ తబలా విద్వాంసుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ హఠాన్మరణం
రూ.699లకే టీవీ ఛానల్స్‌, సూపర్‌ఫాస్ట్ ఇంటర్నెట్, 12 OTTలు
రూ.699లకే టీవీ ఛానల్స్‌, సూపర్‌ఫాస్ట్ ఇంటర్నెట్, 12 OTTలు
పెళ్లికి రావాలని చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం
పెళ్లికి రావాలని చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం
ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్