Weird Love Story: సవతి సోదరుడిని ప్రేమించిన యువతి.. నీ మనసు చెప్పింది వినమని పెళ్లి చేసిన తల్లి.. ఎక్కడంటే

ఓ పెళ్లికి సంబంధించిన విషయం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఒక అమ్మాయి .. తన అన్నయ్యను పెళ్లి చేసుకుంది. అవును వినడానికి వింతగా అనిపించినా ఇది నిజంగా జరిగింది. కాకపోతే మన దేశంలో కాదు.. ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా ఖ్యాతిగాంచిన ఫిన్‌లాండ్‌లో ఈ విచిత్రం చోటుచేసుకుంది.

Weird Love Story: సవతి సోదరుడిని ప్రేమించిన యువతి.. నీ మనసు చెప్పింది వినమని పెళ్లి చేసిన తల్లి.. ఎక్కడంటే
Weird Love Story
Follow us
Surya Kala

|

Updated on: Nov 10, 2022 | 10:29 AM

ప్రేమ గుడ్డిది అని అంటారు. ప్రేమ వయసు, కులం, మతం, ఆస్థిఆస్తులు ఏవీ చూడదు. ప్రేమ ఎవరికైనా ఎప్పుడైనా కలగవచ్చు. రెండు హృదయాల కలయిక.. ప్రేమ తప్ప మరేవిషయానికి చోటు లేదు. విదేశాల్లో ఎక్కువగా ప్రేమ వివాహాలు జరగడానికి ఇదే కారణం. అయితే భారతదేశంలో కూడా.. ప్రేమ వివాహాలు జరగడం మొదలు పెట్టాయి. ఎల్లలు దాటి మరీ ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు కొందరు. అయితే ఇప్పటికీ మనదేశంలో ఎక్కువగా పెద్దలు చూసిన పెళ్లిళ్లను చేసుకోవడానికే యువత ఎక్కువ ఆసక్తిని చూపిస్తుందోన్నది మాత్రం నిజం. అయితే ఓ పెళ్లికి సంబంధించిన విషయం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఒక అమ్మాయి .. తన అన్నయ్యను పెళ్లి చేసుకుంది. అవును వినడానికి వింతగా అనిపించినా ఇది నిజంగా జరిగింది. కాకపోతే మన దేశంలో కాదు.. ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా ఖ్యాతిగాంచిన ఫిన్‌లాండ్‌లో ఈ విచిత్రం చోటుచేసుకుంది. మ్యాటిల్డా ఎరిక్సన్ అనే 23 ఏళ్ల అమ్మాయి 27 ఏళ్ల శామ్యూల్ ఎరిక్సన్‌ను వివాహం చేసుకుంది. ఈ పెళ్లిలో విచిత్రం ఏంటంటే.. ఇద్దరూ తోబుట్టువులే.

డైలీ స్టార్ నివేదిక ప్రకారం.. 3 సంవత్సరాల క్రితం  అంటే 2019 సంవత్సరంలో, మటిల్డా తల్లి మరొక వ్యక్తిని వివాహం చేసుకుంది. దీంతో మటిల్డా జీవితంలో  సవతి తండ్రి వచ్చాడు. శామ్యూలీ మటిల్డా సవతి తండ్రి కుమారుడు. అటువంటి పరిస్థితిలో.. మాటిల్డా , శామ్యూలీలు ఇద్దరూ తోబుట్టువులయ్యారు. అయితే వీరి ప్రేమ కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

నివేదికల ప్రకారం… మటిల్డా తన తల్లి 50వ పుట్టినరోజు సందర్భంగా.. మటిల్డా తన సవతి సోదరుడు అంటే శామ్యూలీని మొదటిసారి కలిసింది. అప్పుడు ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఒకరికొకరు హృదయాన్ని పంచుకున్నారు. రెండు వారాల తర్వాత ఇద్దరూ డేటింగ్ ప్రారంభించారు. అంతే కాదు ఇద్దరూ కలిసి సహజీవనం కూడా ప్రారంభించారు. అయితే తమ సంబంధం గురించి స్నేహితులకు చెప్పడం ఇష్టం లేని ఈ జంట..తన ప్రియురాలు మటిల్డాను అందరి ముందు సిస్టర్ అని పిలిచేవాడు. కాలక్రమంలో మటిల్డా తల్లికి మొత్తం విషయం తెలిసింది. అప్పుడు తన కూతురుతో నువ్వు ఇతరుల మాటలు వినడానికి బదులు నీ హృదయం మాట వినమని సలహా ఇచ్చింది. అప్పుడు నీ జీవితం అంతా బాగుంటుందని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మాటిల్డా ఈ తల్లి సలహాను అంగీకరించింది. తన సవతి సోదరుడు శామ్యూలీని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే, పెళ్లికి ముందు, మటిల్డా తన సవతి సోదరుడిని వివాహం చేసుకున్న తర్వాత ఏదైనా చట్టపరమైన సమస్యను ఎదుర్కోవలసి వస్తుందా అనే విషయంపై సమాచారాన్ని సేకరించింది. ఈ పెళ్లితో తమ జీవితానికి ఎటువంటి ఇబ్బంది కలగదని తెలుసుకుంది. దీంతో మాటిల్డా శామ్యూలీలు పెళ్లి చేసుకున్నారు. త్వరలో తాము పిల్లలని కనే ప్లాన్ చేస్తున్నట్లు కూడా చెబుతున్నారు ఈ జంట.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..