అదృష్టం అంటే ఇతనిదే ! రాత్రికి రాత్రే “కోటీశ్వరుడు” అయిన పోలీస్‌ ఉద్యోగి.. ఖాతాలో రూ.10కోట్లు

ఖాతాలో డబ్బు చూసిన బ్యాంకు అధికారులు పోలీసు అధికారిని సంప్రదించారు. అయితే బ్యాంకు నుంచి ఫోన్ వచ్చినప్పుడే ఖాతాలో ఉన్న మొత్తం సదరు పోలీస్‌ ఆఫీసర్‌కు కూడా తెలిసింది.

అదృష్టం అంటే ఇతనిదే ! రాత్రికి రాత్రే “కోటీశ్వరుడు” అయిన పోలీస్‌ ఉద్యోగి.. ఖాతాలో రూ.10కోట్లు
Money In Account
Follow us

|

Updated on: Nov 10, 2022 | 7:47 AM

నిద్రపోగానే చాలా మంది కోటీశ్వరులు అవుతారు..కానీ, అది కల మాత్రమే అవుతుంది. కళ్లు తెరిచి చూస్తే..అంతా ఉత్తిదే అని తేలిపోతుంది. అయితే ఈ వార్త ఓ నిజమైంది. అతనికి వచ్చిన కల తెల్లవారిన తర్వాత నిజమైంది. పాకిస్థాన్‌లోని కరాచీలో ఓ పోలీసు అధికారి రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోయాడు. కరాచీ నగరంలోని ఓ పోలీసు అధికారి ఖాతాలో ఒక్కరాత్రిలోనే ఏకంగా రూ10 కోట్లు జమ చేశారు. అయితే ఈ పది కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో బ్యాంకుకు కూడా తెలియదు. ఖాతాలో డబ్బు చూసిన బ్యాంకు అధికారులు పోలీసు అధికారిని సంప్రదించారు. అయితే బ్యాంకు నుంచి ఫోన్ వచ్చినప్పుడే ఖాతాలో ఉన్న మొత్తం సదరు పోలీస్‌ ఆఫీసర్‌కు కూడా తెలిసింది. ఈ మేరకు సదరు పోలీసు అధికారి అమీర్ గోపాంగ్ మాట్లాడుతూ.. తన ఖాతాలో ఇంత పెద్ద మొత్తంలో డబ్బు చూసి తానూ నిజంగా నమ్మలేకపోతున్నాని, షాకింగ్‌గా ఉందన్నారు.

అయితే, అమీర్ గోపాంగ్ కరాచీలోని బహదూరాబాద్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. రూ.10 కోట్లు ఊహించని విధంగా అతని ఖాతాలో చేరింది. డబ్బు వస్తే సంతోషపడాలి అనుకుంటే అమీర్‌కి పెద్ద తలనొప్పి పట్టుకుంది. ఆ డబ్బు ఎక్కడ్నుంచి వచ్చింది.. మూలం స్పష్టంగా తెలియకపోవడంతో అమీర్ ఖాతా, ATM కార్డ్‌ని ప్రస్తుతానికి పనిచేయకుండా చేశారు బ్యాంక్ సిబ్బంది. సంక్షిప్తంగా, డబ్బు గురించి కొంత సమాచారం వచ్చే వరకు అమీర్ ఖాతాను హోల్డ్‌లో ఉంచారు. అమీర్ ఇప్పుడు తన సొంత డబ్బును కూడా ఉపయోగించుకోలేని కోటీశ్వరుడుగా మిగిలిపోయాడు.

ఇదిలా ఉండగా, లర్కానా, సుక్కూర్‌లలో జరిగిన ఇలాంటి ఘటనల్లో ఇతర పోలీసు అధికారులు కూడా తమ బ్యాంకు ఖాతాల్లోకి భారీగా డబ్బులు వచ్చాయని అమీర్ చెప్పారు. దీనిపై ఆరా తీస్తే.. ఇలాంటి ఘటనలు మరెన్నో ఉన్నాయని తెలిసింది. అయితే, తమకు మాత్రం ఎలాంటి సమాచారం లేదంటున్నారు పోలీసులు. విచారణ కొనసాగుతోందని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి