- Telugu News Photo Gallery Business photos Oppo launches new smartphone Oppo a58 features and price details Telugu Tech News
Oppo a58: మార్కెట్లోకి ఒప్పో కొత్త ఫోన్ వచ్చేసింది.. 50 ఎంపీ కెమెరాతో పాటు మరెన్నో ఫీచర్లు..
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో తాజాగా మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. ఒప్పో ఏ58 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్ ఇప్పటికే ఇతర దేశాల్లో విడుదల చేసిన ఈఫోన్‌ను త్వరలోనే భారత్‌లోకి తీసుకురానున్నారు..
Updated on: Nov 10, 2022 | 4:25 PM

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజ సంస్థ ఒప్పో తాజాగా మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. ఒప్పో ఏ58 పేరుతో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. అయితే భారత్‌లో ఈ ఫోన్ ఇంకా తీసుకురాలేదు.

ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌లో 1612 x 720 పిక్సెల్ పిక్సెల్స్ రిజల్యూషన్ 6.56 ఇంచెస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఇక 33 వాట్స్ ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు.

నవంబర్ 10వ తేదీ నుంచి ఈ ఫోన్ ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రాగా భారత్‌లో ఎప్పుడు లాంచ్ చేస్తారన్న విషయాన్ని మాత్రం ఇంకా ప్రకటించలేదు.

ఇక ధర విషయానికొస్తే ఒప్పో ఏ58 5జీ 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 234 డాలర్లుగా ఉంది. మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 19,123గా ఉండనుంది.





























