AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది..! స్టార్ హీరో అవ్వాల్సినవాడు.. టాప్ ప్రొడ్యూసర్ అయ్యాడు..!!

సినీ పరిశ్రమలో ఎంతో మంది నటులుగా రాణిస్తున్నారు. హీరోలు, హీరోయిన్స్ మాత్రమే కాదు నిర్మాతలు కూడా కొందరు మంచి క్రేజ్ తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ స్టార్ ప్రొడ్యూసర్‌గా దూసుకుపోతున్న ఓ నిర్మాత కూడా బ్లాక్ బస్టర్ సినిమాలు చేసి సక్సెస్ అయ్యారు.

షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది..! స్టార్ హీరో అవ్వాల్సినవాడు.. టాప్ ప్రొడ్యూసర్ అయ్యాడు..!!
Tollywood
Rajeev Rayala
|

Updated on: Feb 25, 2026 | 8:53 AM

Share

సినిమా ఇండస్ట్రీలో నటులుగా చాలా మంది రాణిస్తున్నారు. చాలా మంది హీరోలుగా రాణిస్తున్నారు. కొందరు డైరెక్ట్ గా హీరోలుగా సినిమాలు చేస్తుంటే మరికొంతమంది కమెడియన్ నుంచి హీరోలుగా మారారు. మరికొంతమంది డైరెక్టర్స్ నుంచి యాక్టర్స్‌గా మారిన వారు కూడా ఉన్నారు. అలాగే అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసిన తర్వాత కూడా హీరోలుగా మారిన వారు చాలా మంది ఉన్నారు. అయితే ఓ నటుడు కూడా హీరోగా మారాలనుకున్నాడు కానీ నిర్మతగా మారాడు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆతర్వాత సహాయక పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నాడు. ఆ క్రేజ్ తోనే హీరోగా మారాడు. కానీ ఆ సినిమా ఆగిపోయింది. హీరోగా అదృష్టం పరీక్షించుకున్నా అది కుదరలేదు. దాంతో నిర్మాతగా మారి టాప్ ప్లేస్ ను వెళ్ళాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో తోప్ నిర్మాత ఆయన. ఇంతకూ ఆయన ఎవరంటే.?

ఆయన ఎవరో కాదు బండ్ల గణేశ్‌.. ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు ఆయనది. నటుడిగా, నిర్మాతగా అంతకుమించి పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ వీర భక్తుడిగా ఆయనకు ప్రత్యేక క్రేజ్ ఉంది. దేవర అంటూ సినిమా ఈవెంట్స్‌ లో తన అభిమాన హీరో గురించి చెప్పిన డైలాగులు, స్పీచ్‌లు ఓ రేంజ్‌లో సెన్సేషన్‌ అయ్యాయి. సమయమొచ్చినప్పుడల్లా సోషల్‌ మీడియాలో పవర్‌స్టార్‌పై తనుకున్న అభిమానాన్ని చాటుకునే బండ్లన్న ఇప్పుడు నిర్మాతగా రాణిస్తున్నారు.

బండ్ల గణేష్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టారు. ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి మెప్పించారు. ఆతర్వాత నిర్మాతగా పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పలు కమర్షియల్ సినిమాలు నిర్మించారు. బడా హీరోలతో సినిమాలు చేసి భారీ హిట్స్ అందుకున్నారు బండ్ల గణేష్. అయితే బండ్ల గణేష్ హీరోగా ఓ సినిమా కూడా మొదలైంది. ఈ విషయం డైరెక్టర్ బాబ్జీ సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. ” 2002 లో సోదరుడు బండ్ల గణేష్ హీరోగా శీనుగాడు అను సినిమా నా దర్శకత్వం లో అన్నపూర్ణ స్టూడియో లో అత్యంత ఘనంగా ప్రారంభమయింది. సినిమా పరిశ్రమ లోని ప్రముఖులైన పెద్ద పెద్ద హీరోలు , హీరోయిన్ లు , దర్శకులు , నిర్మాతలతో అన్నపూర్ణ స్టూడియో కిట కిట లాడింది. ఆ ప్రారంభోత్సవం జరిగిన విధానం గురించి చాలా రోజుల వరకు పరిశ్రమ వర్గాలు గొప్పగా మాట్లాడుకున్నాయి. ఈ సినిమా లో హీరోగా నటించిన బండ్ల గణేష్ గారి పాత్ర నగేష్ లాంటి గొప్ప నటులు పోషించాల్సిన పాత్ర. కొంత షూటింగ్ జరిగాక సడన్ గా ఆ చిత్ర నిర్మాత చనిపోవడంతో సినిమా ఆగిపోయింది. అలా జరిగి ఉండకపోతే ఆ సినిమా అనుకున్నట్లుగా రూపొంది విడుదలయి ఉంటే మిత్రులు బండ్ల గణేష్ ఒక సక్సెస్ ఫుల్ హీరోగా తనదైన జెండాను ఎగరేసి ఉండేవారు. నాకు కూడా ఆ సినిమా దర్శకుడి గా మంచి బ్రేక్ ఇచ్చి ఉండేది. అలా పెద్ద హీరోగా సక్సెస్ సాధించాల్సిన బండ్ల గణేష్  అనుకోకుండా నిర్మాతగా మారి ప్రస్తుతం ఒక అగ్ర నిర్మాతగా పేరు ప్రఖ్యాతులు సంపాదించు కోవడం నాకు సంతోషకరం”. అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు దర్శకుడు బాబ్జి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us