Boat Wave Ultima: బడ్జెట్‌ ధరలో బోట్ నుంచి బ్లూటూత్‌ కాలింగ్‌ స్మార్ట్‌వాచ్‌.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

ప్రముఖ దేశీయ వేరబుల్స్‌ బ్రాండ్‌ బోట్‌ తాజాగా మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ వాచ్‌ను లాంచ్‌ చేసింది. తక్కువ బడ్జెట్‌లో ఆకర్షణీయమైన ఫీచర్లతో ఈ వాచ్‌ను తీసుకొచ్చారు. బోట్‌ వేవ్‌ అల్టిమా పేరుతో తీసుకొచ్చిన ఈ వాచ్‌లో ప్రత్యేకంగా బ్లూటూత్‌ కాలింగ్‌ ఫీచర్‌ను..

Boat Wave Ultima: బడ్జెట్‌ ధరలో బోట్ నుంచి బ్లూటూత్‌ కాలింగ్‌ స్మార్ట్‌వాచ్‌.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
Boat Wave Ultima
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 09, 2022 | 7:56 PM

ప్రముఖ దేశీయ వేరబుల్స్‌ బ్రాండ్‌ బోట్‌ తాజాగా మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ వాచ్‌ను లాంచ్‌ చేసింది. తక్కువ బడ్జెట్‌లో ఆకర్షణీయమైన ఫీచర్లతో ఈ వాచ్‌ను తీసుకొచ్చారు. బోట్‌ వేవ్‌ అల్టిమా పేరుతో తీసుకొచ్చిన ఈ వాచ్‌లో ప్రత్యేకంగా బ్లూటూత్‌ కాలింగ్‌ ఫీచర్‌ను అందించారు. దీంతో పాటు పలు రకాల హెల్త్‌, ఫిట్‌నెస్‌ ఫీచర్లను అందించారు. బ్లూటూత్‌ కాలింగ్‌తో నేరుగా ఫోన్‌లను స్మార్ట్‌ వాచ్‌తో మాట్లాడుకునే అవకాశం ఉంటుంది.

బోట్‌ ఈ వాచ్‌ ద్వారా తొలి కర్వ్‌డ్‌ డిస్‌ప్లేను అందించింది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ వాచ్‌ బోట్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్నాయి. ధర విషయానికొస్తే ఈ స్మార్ట్‌ వాచ్‌ రూ. 2999కి అందుబాటులో ఉంది. రెడ్‌, బ్లాక్‌, గ్రీన్‌ వంటి రంగుల్లో ఈ వాచ్‌ను అందించారు. ఇక ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 1.8 ఇంచెస్‌ కర్వ్‌డ్‌ డిస్‌ప్లేతో పాటు బ్లూటూత్‌ వీ5.3 సపోర్ట్‌, ఆడియో కాల్స్‌ కోసం ఇన్‌బిల్ట్‌ హెచ్‌డీ స్పీకర్‌, హైసెన్సిటివిటీ మైక్రోఫోన్ వంటి లేటెస్ట్ ఫీచ‌ర్లను అందించారు.

ఈ స్మార్ట్‌వాచ్‌లో వందకు పైగా స్పోర్ట్స్‌ మోడ్స్‌ను అందించారు. ఇక హెల్త్‌ ఫీచర్ల విషయానికొస్తే హార్ట్‌ రేట్‌ మానిటర్‌, బ్లడ్‌ ఆక్సిజన్‌ లెవెల్స్‌ ట్రాకింగ్‌ వంటి అధునాతన ఫీచర్లను అందించారు. దీంతో పాటు ఐపీ68 రేటింగ్‌తో కూడిన డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ను అందించారు. ఇక బ్యాటరీకి సైతం పెద్ద పీట వేశారు. ఈ స్మార్ట్‌ వాచ్‌ను ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే పది రోజుల పాటు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!
50 MP ట్రిపుల్ కెమెరా.. అదిరిపోయే ఫీచర్స్‌తో పోకో స్మార్ట్ ఫోన్
50 MP ట్రిపుల్ కెమెరా.. అదిరిపోయే ఫీచర్స్‌తో పోకో స్మార్ట్ ఫోన్