ఓరి దీని వేషాలో.. చ‌నిపోయిన‌ట్లు న‌టించిన పాము.. వీడియో చూస్తే పొట్ట చెక్కలే..!

రెడ్డిట్‌లో పోస్టు చేయ‌బ‌డ్డ ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. ఈ పామును పాముల ప్ర‌పంచానికి డ్రామా రాణిగా అభివ‌ర్ణిస్తున్నారు.

ఓరి దీని వేషాలో.. చ‌నిపోయిన‌ట్లు న‌టించిన పాము.. వీడియో చూస్తే పొట్ట చెక్కలే..!
Hognose Snake
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 11, 2022 | 2:09 PM

పాము..ఈ పేరు వింటే చాలు..చాలా మంది భయంతో అల్లంత దూరం పరిగెడతారు. ఎదురగా వస్తే.. ఆ పాముల బారి నుంచి త‌ప్పించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తారు. ప్రాణాల‌ను కాపాడుకుంటారు. అలాగే ఓ పాము కూడా మ‌న‌షుల దాడి నుంచి త‌ప్పించుకునేందుకు చేసిన ప్రయత్నం మనుషుల్ని ఆశ్చర్యపోయేలా చేస్తుంది. ప్రాణాల మీదకు వస్తే మనుషులే కాదు..పాము సైతం మ్యాజిక్‌ ట్రిక్స్‌ ప్లే చేస్తాయని ఈ పాము నిరూపించింది. కానీ, ఈ పాము చేసిన యాక్టింగ్‌ చేస్తే మాత్రం మీరూ ఖచ్చితంగా షాక్‌ అవుతారు. అప్ప‌టి వ‌ర‌కు బుస‌లు కొడుతూ, కోర‌లు చాచుతూ ముందుకు వెళ్లిన పాము..ఒక్కసారిగా విగత జీవిలా మారిపోయింది.. ఓ వ్య‌క్తి త‌న చేతితో పామును ట‌చ్ చేశాడు. అంతే.. ఆ పాము చ‌నిపోయిన‌ట్టుగా న‌టించింది. తన శరీరం తన అదుపులో లేనట్టుగా భలేగా నటించింది.

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఈ పాము న‌ట‌న చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఏం యాక్టింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రెడ్డిట్‌లో పోస్టు చేయ‌బ‌డ్డ ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. ఈ పామును పాముల ప్ర‌పంచానికి డ్రామా రాణిగా అభివ‌ర్ణిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అయితే ఈ పాము హ‌గ్నోస్ జాతికి చెందిన‌ది. ఈ పాములు త‌మ‌ను తాము ర‌క్షించుకోవ‌డానికి ఇలాంటి ప‌ద్ధ‌తుల‌ను ఉపయోగిస్తాయ‌ని జంతుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఇవి విష‌పూరిత‌మైన పాములు కావని, మ‌నుషుల‌కు ఎలాంటి హాని క‌లిగించ‌వంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?