AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోలీస్‌ స్టేషన్‌లో లూటీ కలకలం.. తుపాకీ, యూనీఫాం ఎత్తుకెళ్లిన దొంగలు..ఖాకీలకే సవాల్‌..

పోలీస్ సేషన్ కు వంద మీటర్ల దూరంలో పెట్టెను పగులగొట్టి, వస్తువులకు నిప్పుపెట్టిన దొంగలు పిస్టల్, కాట్రిడ్జ్‌లను ఎత్తుకెళ్లారు. నిద్రలేవగానే పిస్టల్, కాట్రిడ్జ్ చోరీపై పోలీసు శాఖలో కలకలం రేగింది. ఫోరెన్సిక్ బృందంతో పాటు కెప్టెన్ సహా ఉన్నతాధికారులకు చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఆధారంగా గాలింపు చేపట్టారు.

పోలీస్‌ స్టేషన్‌లో లూటీ కలకలం.. తుపాకీ, యూనీఫాం ఎత్తుకెళ్లిన దొంగలు..ఖాకీలకే సవాల్‌..
Police Post In Kanpur
Jyothi Gadda
|

Updated on: Nov 11, 2022 | 1:15 PM

Share

ఎక్కడైనా దొంగతనం, దోపిడీలు జరిగితే ఏం చేస్తారు..సమీప పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తారు. కానీ, పోలీస్‌ స్టేషన్‌లోనే దొంగలు పడి లూటీ చేస్తే.. ఏం చేయాలి..? ఇది వింతగా అనిపిస్తుంది కదూ..! కానీ, నిజంగానే ఓ చోట పోలీస్‌ స్టేషన్‌లో దొంగలుపడ్డారు. ఖాకీ చేతుల్లో ఉండాల్సిన తుపాకీనే కాదు పోలీస్‌ యూనీఫాం, పది కాట్రిజ్‌లును కూడా దొంగిలించారు. పోలీసులకే సవాల్‌గా మారిన ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ జిల్లాలో జరిగింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

కాన్పూర్‌లోని న్యూ ఆజాద్‌ నగర్‌ పరిధిలోని బిద్నూ ఔట్‌పోస్టులో గత రాత్రి దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. పోలీసు పిస్తోల్‌తోపాటు యూనిఫాంను ఎత్తుకెళ్లారు. తుపాకీ కనింపించకపోవడంతో.. ఔట్‌పోస్ట్‌ ఇన్‌చార్జీ సుధాకర్‌ పాండే కేసు నమోదుచేశారు. కాన్పూర్‌లోని బిద్నులో, బిద్ను పోలీస్ స్టేషన్‌లోని న్యూ ఆజాద్ నగర్‌లో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. బుధవారం రాత్రి ఔట్‌పోస్టును లక్ష్యంగా చేసుకుని గాఢనిద్రలో ఉన్న సుధాకర్ పాండే పక్కనే ఉన్న పెట్టెను దొంగలు ఎత్తుకెళ్లారు. అయితే విషయం కాస్తా పై అధికారుల దృష్టికి వెళ్లడంతో జిల్లా ఎస్పీ.. సుధారక్‌ పాండేపై వేటువేశారు. పోలీస్‌ స్టేషన్‌ను పరిశీలించిన ఉన్నతాధికారులు ప్రభుత్వ తుపాకీతోపాటు యూనీఫాం, పది కాట్రిజ్‌లు కనిపించకుండా పోయాయని గుర్తించారు. ఈ వ్యవహారంపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

పోలీస్ పోస్ట్ కు వంద మీటర్ల దూరంలో పెట్టెను పగులగొట్టి, వస్తువులకు నిప్పుపెట్టిన దొంగలు పిస్టల్, కాట్రిడ్జ్‌లను ఎత్తుకెళ్లారు. నిద్రలేవగానే పిస్టల్, కాట్రిడ్జ్ చోరీపై పోలీసు శాఖలో కలకలం రేగింది. ఫోరెన్సిక్ బృందంతో పాటు కెప్టెన్ సహా ఉన్నతాధికారులకు చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఆధారంగా గాలింపు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లో అమర్చిన సీసీటీవీలను పోలీసులు పరిశీలించారు.. అలాగే దుకాణదారులను, ఆ ప్రాంత ప్రజలను విచారిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి