Fat in Body : మీ శ‌రీరంలో కొవ్వు అధికంగా పేరుకుపోతుంటే ఈ లక్షణాలు కనిపిస్తాయి.. అల‌ర్ట్ అవ్వండి..!

అధిక కొవ్వు కారణంగా ర‌క్త నాళాల్లో కొవ్వు ర‌క్త ప్ర‌స‌ర‌ణకు అడ్డు ప‌డుతుంది. దీంతో ర‌క్త స‌ర‌ఫ‌రా స‌రిగ్గా జ‌ర‌గ‌దు. ఫ‌లితంగా శ‌రీరంలోని అన్ని అవ‌య‌వాల‌కు ఆక్సిజ‌న్‌, పోష‌కాలు చేర‌వు. దీంతో శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందులు వ‌స్తాయి.

Fat in Body : మీ శ‌రీరంలో కొవ్వు అధికంగా పేరుకుపోతుంటే ఈ లక్షణాలు కనిపిస్తాయి.. అల‌ర్ట్ అవ్వండి..!
Cholesterol Test
Follow us

|

Updated on: Nov 11, 2022 | 10:04 AM

బాడీలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడే దీని లక్షణాలు శరీరంపై కనిపిస్తాయి. శ‌రీరంలో కొవ్వు అధికంగా పేరుకుపోతేనే అధికంగా బ‌రువు పెరుగుతారు. అందువ‌ల్ల శ‌రీరంలో కొవ్వు పేరుకుపోతున్న‌ప్పుడే జాగ్ర‌త్త‌లు తీసుకుంటే.. అధికంగా బ‌రువు పెర‌గ‌కుండా ఉంటారు. అయితే శ‌రీరంలో కొవ్వు అధికంగా పేరుకుపోతుంటే.. ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో తెలుసా..? రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ఇది రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుంది. నేరుగా గుండెను ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఆ ప్రమాద సంకేతాలు ఎక్కడ కనిపిస్తాయో తెలుసుకుందాం.

కొలెస్ట్రాల్ అనేది హార్మోన్లు మరియు కణాల ఉత్పత్తికి శరీరానికి అవసరమైన కొవ్వు పదార్ధం, కానీ అన్ని కొలెస్ట్రాల్ లిపిడ్లు మన ఆరోగ్యానికి మేలు చేయవు. శ‌రీరంలో అధికంగా కొవ్వు పేరుకుపోతుంటే జీర్ణ‌క్రియ మందగిస్తుంది. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కాదు. అజీర్ణ స‌మ‌స్య వ‌స్తుంది. అలాగే గ్యాస్‌, మల‌బ‌ద్ద‌కం ఇబ్బందుల‌కు గురి చేస్తాయి. మీకు ఈ స‌మ‌స్య‌లు స‌డెన్‌గా వ‌స్తే.. మీ బ‌రువు ఒక‌సారి చెక్ చేసుకోండి. దీంతో బ‌రువు పెరుగుతున్నది, లేనిదీ అర్థ‌మ‌వుతుంది. బ‌రువు పెరుగుతుంటే గ‌నుక వెంట‌నే త‌గ్గించుకునే ప్ర‌య‌త్నం చేయండి. లేదంటే ముందు ముందు ఇంకా స‌మ‌స్య‌గా మారుతుంది.

రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ఇది రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుంది మరియు నేరుగా గుండెను ప్రభావితం చేస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం మొదలవుతుంది కాబట్టి, ప్రమాదం కూడా పెరుగుతుంది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల రక్తనాళాలు పాక్షికంగా అడ్డంకి ఏర్పడి శరీర అవయవాలకు అవసరమైన ఆక్సిజన్ అందదు.

ఇవి కూడా చదవండి

శ‌రీరంలో అధికంగా కొవ్వు పేరుకుపోతే జీర్ణాశ‌యం గ్యాస్ అధికంగా ఉత్ప‌త్తి అవుతుంది. దీంతో ప‌దే ప‌దే త్రేన్పులు వ‌స్తుంటాయి. కొంద‌రికి పుల్ల‌ని త్రేన్పులు కూడా వ‌స్తాయి. ఇది ఇంకా ఎక్కువైతే గుండెల్లో మంట‌గా అనిపిస్తుంది. అధిక కొవ్వు కారణంగా క‌ళ్ల కింద తెల్ల‌ని మ‌చ్చ‌లు క‌నిపిస్తుంటాయి. మొటిమ‌లు వ‌స్తాయి. శ‌రీరంలో అక్క‌డ‌క్క‌డా పొక్కుల మాదిరిగా బొబ్బ‌లు వ‌స్తుంటాయి. అవి నొప్పిని కలిగిస్తుంటాయి. అధిక కొవ్వు కారణంగా ర‌క్త నాళాల్లో కొవ్వు ర‌క్త ప్ర‌స‌ర‌ణకు అడ్డు ప‌డుతుంది. దీంతో ర‌క్త స‌ర‌ఫ‌రా స‌రిగ్గా జ‌ర‌గ‌దు. ఫ‌లితంగా శ‌రీరంలోని అన్ని అవ‌య‌వాల‌కు ఆక్సిజ‌న్‌, పోష‌కాలు చేర‌వు. దీంతో శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందులు వ‌స్తాయి.

కొలెస్ట్రాల్ పెరిగిన వెంటనే పాదాలలో వాపు వస్తుంది. మొత్తం పాదాలు, కాళ్లు లేదా అరికాళ్ళ వాపు అధిక కొలెస్ట్రాల్ యొక్క ప్రమాదకరమైన లక్షణం. దీని వెనుక ఒకే ఒక కారణం ఉంది, అంటే రక్త నాళాలు కుంచించుకుపోవడం వల్ల కాళ్ల నుంచి రక్తం తిరిగి గుండెకు చేరడం కష్టమవుతుంది. బలహీనమైన రక్త ప్రసరణ కారణంగా, పాదాలలో ద్రవం పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. కొన్నిసార్లు వాపు ప్రాంతంలో గట్టిగా మారుతుంది. పాదాలు లేదా మడమలో నొప్పి, కదిలించాలంటే కష్టంగా ఉంటుంది. మడమల పగుళ్లు ఏర్పడుతుంటాయి. ఈ ల‌క్ష‌ణాలు ఎవ‌రిలో అయినా ఉంటే వెంట‌నే దాన్ని అనుమానించాల్సిందే. దీని వ‌ల్ల శ‌రీరంలో కొవ్వు పేరుకుపోతుంద‌ని తెలుసుకోవాలి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?