AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health tips: కోడిగుడ్లతో కలిపి వీటిని పొరపాటున కూడా తీనకూడదట..! ఎందుకో తెలుసా…

గుడ్లు ప్రొటీన్ల స్టోర్‌హౌస్‌గా చెబుతారు. అంతేకాదు.. శరీరాన్ని ఫిట్‌గా ఉంచడంలో కూడా సహాయపడతాయి. ప్రతి వ్యక్తి శరీర బరువును బట్టి మనం ప్రోటీన్ తీసుకోవాలి. అంటే,..

Health tips: కోడిగుడ్లతో కలిపి వీటిని పొరపాటున కూడా తీనకూడదట..! ఎందుకో తెలుసా...
Egg Benefits
Jyothi Gadda
|

Updated on: Nov 11, 2022 | 7:28 AM

Share

మనం తీనే ఆహారం మంచిదైతే మన ఆరోగ్యం బాగుంటుంది. ఎందుకంటే మనం తీసుకునే ఆహారం నేరుగా మన ఆరోగ్యం, శరీరంపైనే ప్రభావం చూపిస్తుంది కనుక. ఆహారం అలవాట్లలో మనకు తెలిసో, తెలియకో ఏమైనా పొరపాటు చేసినట్టయితే.. దానికి తగిన మూల్యం కూడా చెల్లించుకోక తప్పదు. కొన్ని రకాలు ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా అలాంటివే. అయితే, ఏదైనా ఆహార పదార్థలను కలిపి తినడం వల్ల..అది మీ శరీరానికి హాని చేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం, ఈ తప్పుడు ఆహార సంకలనాలు మీ జీర్ణవ్యవస్థకు సమస్యలను కలిగిస్తాయి, ఇది అలసట, వికారం, పేగు వ్యాధులకు దారితీస్తుంది. అలాంటి ఆహార పదార్థల్లో ముఖ్యమైనది గుడ్లు..గుడ్డుతో పాటు కలిపి తినకూడని కొన్ని ఆహారపదార్థాలు ఉన్నాయి. వాటి గురించి తప్పక తెలుసుకోవాలి..

గుడ్లు చాలా ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే, చాలా మంది అల్పాహారం నుండి రాత్రి భోజనం వరకు గుడ్లు తినడానికి ఇష్టపడతారు. గుడ్లు ప్రొటీన్ల స్టోర్‌హౌస్‌గా చెబుతారు. అంతేకాదు.. శరీరాన్ని ఫిట్‌గా ఉంచడంలో కూడా సహాయపడతాయి. ప్రతి వ్యక్తి శరీర బరువును బట్టి మనం ప్రోటీన్ తీసుకోవాలి. అంటే, 60 కిలోల బరువున్న వ్యక్తికి రోజుకు 60 గ్రాముల ప్రోటీన్ అవసరం. కాబట్టి ప్రొటీన్లు అధికంగా ఉండే గుడ్లు తినడం వల్ల ఈ లోపాన్ని భర్తీ చేసుకోవచ్చు. అయితే గుడ్లతో తినకూడని ఆహారాలు చాలా ఉన్నాయని మీకు తెలుసా? గుడ్లతో పాటు అలాంటి ఆహారాలు తినడం ఆరోగ్యానికి హానికరం.

టీతో పాటు గుడ్డు తినకూడదు.. కోడిగుడ్ల నుంచి తయారైన ఉత్పత్తులను తిన్న తర్వాత.. అది జీర్ణం కావడానికి కొందరు టీ తాగుతుంటారు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ అలవాటు మీ శరీరానికి చాలా హానికరం. గుడ్లు తిన్న తర్వాత టీ తాగడం వల్ల మలబద్ధకం ఏర్పడుతుంది.

ఇవి కూడా చదవండి

చక్కెర, గుడ్డు కలిపి తినవద్దు.. గుడ్లు, చక్కెర ఎప్పుడూ కలిసి ఉండని పదార్థాలు. చక్కెరతో గుడ్లు ఎప్పుడూ తినవద్దు. మీరు గుడ్లు, చక్కెరను కలిపి ఉడికించినట్లయితే, రెండింటి నుండి విడుదలయ్యే అమైనో ఆమ్లాలు శరీరానికి విషపూరితం కావచ్చు. ఈ కలయిక కారణంగా, మీరు రక్తం గడ్డకట్టడానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాలసి ఉంటుంది.

గుడ్డు, చేపలను ఒకేసారి తినవద్దు.. ఉడకబెట్టిన గుడ్లు, చేపలతో తినడం శరీరానికి చాలా హానికరం. అందుకే గుడ్లు, చేపలు కలిపి ఎప్పుడూ తినకూడదని అంటారు. ఈ కలయిక వల్ల అలర్జీలతో పాటు అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

గుడ్డు,చీజ్ కలిపి తినవద్దు.. గుడ్లు, పనీర్ రెండూ ప్రోటీన్ కలిగిన మంచి వనరులు. కానీ, వాటిని కలిపి తినడం వల్ల మీ జీర్ణక్రియకు హాని కలుగుతుంది. కాబట్టి గుడ్డు, పనీర్ కలిపి తినకుండా జాగ్రత్తపడాలి.

గుడ్డు, సోయా పాలు కలిపి తినవద్దు.. సోయా పాలు అనేక ప్రయోజనాలతో కూడిన ఆహార ఉత్పత్తి. అయితే గుడ్డు, సోయా పాలు కలిపి తినడం మంచిది కాదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, వీటిని కలిపి తింటే ప్రోటీన్ శోషణ నిరోధిస్తుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి