మద్యం మత్తులో రోగిని చితకబాదిన డాక్టర్‌.. సోషల్ మీడియాలో వీడియో వైరల్‌..

రోగి కుమారుడు శ్యామ్‌ కుమార్‌ తన తల్లి సుఖమతి ఆరోగ్యం అర్థరాత్రి క్షీణించటంతో ఆస్పత్రికి తీసుకొచ్చాడు.108,112 కు కాల్ చేసినా ఫలితం లేకపోవటంతో..అతడు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే తన తల్లిని..

మద్యం మత్తులో రోగిని చితకబాదిన డాక్టర్‌.. సోషల్ మీడియాలో వీడియో వైరల్‌..
Chhattisgarh Hospital
Follow us

|

Updated on: Nov 10, 2022 | 1:30 PM

దేశంలో ఇప్పటికే ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరుపై ఇటీవల సోషల్ మీడియాలో అనేక వైరల్‌ వీడియోలు విడుదలవుతున్నాయి. వాటి ఆధారంగా సర్కార్‌ దవాఖాన స్థితిగతుల పట్ల ప్రజలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇక ప్రభుత్వ ఆస్పత్రులకు ధీటుగానే ప్రైవేటు వైద్యుల నిర్వాకం ఉంది. ఇక తాజాగా ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్వాకానికి సంబంధించిన మరో వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లోని ఓ ఆస్పత్రిలో ఓ మహిళా రోగిని ఓ వైద్యుడు కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైద్యుడు మత్తులో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. కోర్బా జిల్లాలోని మెడికల్ కాలేజీ హాస్పిటల్ నుండి వైరల్ వీడియో. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో ప్రసారం కావడంతో నిందితుడు డాక్టర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు జిల్లా వైద్య కళాశాల డీన్ డాక్టర్ అవినాష్ మెష్రామ్ తెలిపారు.

ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో మత్తులో ఉన్న ఒక వైద్యుడు మహిళా రోగిని విచక్షణా రహితంగా కొట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆస్పత్రి యాజమాన్యం డాక్టర్‌పై షోకాజ్ నోటీసు జారీ చేసింది. రోగి కుమారుడు శ్యామ్‌ కుమార్‌ తన తల్లి సుఖమతి ఆరోగ్యం అర్థరాత్రి క్షీణించటంతో ఆస్పత్రికి తీసుకొచ్చాడు.108,112 కు కాల్ చేసినా ఫలితం లేకపోవటంతో..అతడు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే తన తల్లిని ఆటో రిక్షాలో ఆసుపత్రికి తీసుకొచ్చాడు. అయితే, చికిత్స సమయంలో వైద్యుడు తన తల్లిని కొట్టాడని ఆరోపించాడు శ్యామ్‌ కుమార్‌. ఘటనకు సంబంధించిన వీడియోని కూడా సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశాడు.

ఇవి కూడా చదవండి

ఈ క్రమంలోనే ఉన్నతాధికారులు సదరు డాక్టర్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, వైద్యుడిపై షోకాజ్ నోటీసు జారీ చేశామని మెడికల్ కాలేజీ హాస్పిటల్ డీన్ డాక్టర్ అవినాష్ మెష్రామ్ తెలిపారు. ఈ అంశంపై తదుపరి విచారణ కొనసాగుతోందని, తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

గతంలోనూ ఒడిశాలోని ధర్మగఢ్ సబ్ డివిజనల్ ఆసుపత్రిలో ఇలాంటి సంఘటనే జరిగింది. వాగ్వాదం తర్వాత ఒక వైద్యుడు తన రోగిని కొట్టాడు. తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న రోగి ఆసుపత్రి వస్తే..అక్కడ అందుబాటులో డాక్టర్ లేరు. నిరీక్షించే సమయంతో విసుగు చెందిన అతను డాక్టర్ లేకపోవడంపై ఆసుపత్రి యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడు. డాక్టర్‌ ఆసుపత్రికి చేరుకోగానే వారిద్దరూ వాగ్వాదానికి దిగారు. దీంతో వైద్యుడు రోగిని కర్రలతో తీవ్రంగా చితక్కొట్టాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి