Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sudha Murthy: శంభాజీ భిడే‌కి సుధా మూర్తి పాదాభివందనం చేయడంపై వివాదం.. ఏం జరిగిందంటే..?

మహారాష్ట్ర రాష్ట్రంలోని ముంబైకి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింధుదుర్గ్ జిల్లాలోని ఒక ఆలయంలో తన అల్లుడు బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునక్ క్షేమం కోసం ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ పర్యటన సందర్భంగా సుధామూర్తి ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అంతేకాదు.. తొలిసారిగా సుధామూర్తి వివాదంలో చిక్కుకున్నారు.

Sudha Murthy: శంభాజీ భిడే‌కి సుధా మూర్తి పాదాభివందనం చేయడంపై వివాదం.. ఏం జరిగిందంటే..?
Sudha Murthy in Maharashtra Temple
Follow us
Surya Kala

|

Updated on: Nov 10, 2022 | 12:55 PM

జీవితంలో మనిషి బతకడం వేరు.. జీవించడం వేరు. చాలా మంది మరణించే వరకూ బతికేస్తుంటారు.. అతి కొద్దిమంది మాత్రమే జీవిస్తుంటారు. అలా జీవితాన్ని జీవించే వారు అతి తక్కుమంది.. వారిలో ఒకరు సుధామూర్తి. పద్మశ్రీ సుధా మూర్తి ఇన్ఫోసిస్ అధినేత ఆర్ నారాయణ మూర్తి భార్య.. ఇన్ఫోసిస్  సహ వ్యవస్థాపకురాలు. కోట్లాది రూపాయల ఆదాయం కలిగిన ఓ సంస్థకు యజమాని. ఒక భారతీయ సంఘ సేవకురాలు, రచయిత్రి సుధా మూర్తి అల్లుడు రిషి సునాక్ ఇటీవల బ్రిటన్ ప్రధాని మంత్రిగా పదవిని చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుధామూర్తి బుధవారం మహారాష్ట్ర రాష్ట్రంలోని ముంబైకి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింధుదుర్గ్ జిల్లాలోని ఒక ఆలయంలో తన అల్లుడు బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునక్ క్షేమం కోసం ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ పర్యటన సందర్భంగా సుధామూర్తి ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అంతేకాదు.. తొలిసారిగా సుధామూర్తి వివాదంలో చిక్కుకున్నారు.

జిల్లాలోని దేవ్‌గడ్ తహసీల్‌లో బాపర్డే గ్రామంలోని దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించారు సుధా మూర్తి. భారతీయ సంతతికి చెందిన రుషి సునాక్ ఇటీవల యునైటెడ్ కింగ్‌డమ్‌కి ప్రధానిగా ఎంపికైన నేపథ్యంలో ఆయన క్షేమం కోరుతూ.. సుధా మూర్తి దుర్గాదేవి ఆలయంలో పూజలను చేశారు. ఈ పర్యటన సందర్భంగా.. సుధా మూర్తి బాపర్డేలోని యశ్వంతరావు రాణే హయ్యర్ సెకండరీ పాఠశాల విద్యార్థులతో సంభాషించారు.

ఇవి కూడా చదవండి

అంతేకాదు సుధా మూర్తి ఈ వారం ప్రారంభంలో మహారాష్ట్రకు చెందిన వివాదాస్పద రైట్‌వింగ్ నాయకుడు సాంగ్లీలో హిందుత్వ కార్యకర్త శంభాజీ భిడే (భిడే గురు జీ) ను కలిశారు. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.

ఇలా ఆశీర్వాదం తీసుకుని నమస్కరిస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇప్పుడు సుధామూర్తి చేసిన పనిపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. కొందరు సరికాదంటే.. మరికొందరు సుధా మూర్తి చేసిన పని తప్పులేదంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాదు సుధా మూర్తి భారతదేశపు గొప్ప మహిళ, మంచి మనసున్న సామజిక వేత్త అనడంలో సందేహం లేదు. అయితే శంభాజీ భిడే కూడా  ఏమీ తక్కువ కాదు.. అయన MScలో ఫిజిక్స్ గోల్డ్ మెడలిస్ట్. ఆయన తన జీవితమంతా భారతమాత సేవకే అంకితం చేశారని పలువురు కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..