Gujarat Election 2022: గుజరాత్ ఎన్నికలకు బీజేపీ తొలి జాబితా విడుదల.. క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య, హార్ధిక్ పటేల్‌కు టికెట్
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది . ఘట్లోడియా స్థానం నుంచి సీఎం భూపేంద్ర పటేల్ పోటీ చేస్తారని బీజేపీ స్పష్టం చేసింది. అలాగే జామ్ నగర్ నార్త్ నుంచి రవీంద్ర జడేజా భార్య రివాబాకు బీజేపీ టికెట్ ఇచ్చింది.

గుజరాత్ ఎన్నికల్లో అభ్యర్థుల జాబితా విడుదల చేసింది బీజేపీ. క్రీడాకుటుంబాలకు ఈసారి బీజేపీ సీట్లు వస్తాయన్న ఊహాగానాలు నిజమయ్యాయి. క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబాకు బీజేపీ టిక్కెట్ ఇచ్చింది. అలాగే విరాంగ్రామ్ నుంచి సామాజిక కార్యకర్త, పాటిదార్ రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు హార్ధిక్ పటేల్‌ని పోటీ చేయిస్తోంది. 2019లో బీజేపీలో చేరిన జడేజా భార్య రివాబాని గుజరాత్ నార్త్ జామ్‌నగర్ నుంచి బరిలోకి దింపుతోంది బీజేపీ. బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న గుజరాత్ ఎన్నికల్లో ఆ పార్టీ ఆచితూచి అడుగులు వేస్తోంది. సిట్టింగుల్లో 38 మందికి సీట్లు దక్కకపోవడమే అందుకు నిదర్శనం. 141 మంది ప్రాణాలను హరించిన ఇటీవల మోర్బీ బ్రిడ్జి కూలిన ఘటన అక్కడి స్థానిక ఎమ్మెల్యేకి సీటు దక్కకుండా చేసింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమక్షంలో జరిగిన కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశంలో ఈ జాబితాను ఖరారు చేశారు . ఈ సమావేశంలో అభ్యర్థుల పేర్లపై చర్చ జరిగింది. ఇప్పుడు అధికారికంగా కూడా ప్రకటించారు. సిఎం భూపేంద్ర పటేల్ ఘట్లోడియా నుండి పోటీ చేయవచ్చు, కాంగ్రెస్‌ను వీడి బిజెపిలో చేరవచ్చు, హార్దిక్ పటేల్ బిరంగామ్ నుండి, అల్పేష్ ఠాకోర్ రాధన్‌పూర్ నుండి పార్టీ టిక్కెట్టు పొందే అవకాశం ఉంది. క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా పేరు కూడా సాధ్యమైన అభ్యర్థుల జాబితాలో చేర్చబడింది.
బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల..
- భూపేంద్ర పటేల్ కు ఘట్లోహియా
- సింహజడేజాకు అబ్దాస్
- మాల్తీ మహేశ్వరికి గాంధీ ధామ్
- రాపర్ నుండి వీరేంద్ర జడేజా
- లింబరీ నుండి జితు రాణా
- చోటిలా నుండి శ్యామ్‌జీ భాయ్ చౌహాన్
- ధంగ్దర నుండి పురోషితం భాయ్
- మోర్బీ టు కాంతి భాయ్
- జితు భాయ్ సోమానికి బ్యాంనర్
- రాజ్‌కోట్ ఈస్ట్ నుండి ప్రతాప్ భాయ్ కంగార్ వరకు
- రాజ్‌కోట్ వెస్ట్ నుండి దర్శిత ప్రకాష్ వరకు
- కున్వర్ జీ బవలియాకు జస్దాన్
- జెట్‌పూర్ నుండి జయేష్ రాడ్డియా
- జస్ధర్ కున్వర్జీ భాయ్
- జైత్‌పూర్ నుండి జయేష్ రాడ్డియా
- కలవాడ్ టు బెడ్జీ అమర్ భాయ్ చౌరా
- జామ్‌నగర్ నుంచి రవీనా జడేజా
- మేనకకు ద్వారకా పపుభ
- బాబు భాయ్ పోఖారియాకు పోర్బందర్
- జునాగఢ్ నుండి సంజయ్ భాయ్ కొరాడియా వరకు
పూర్తి జాబితాను ఇక్కడ చూడండి..
भारतीय जनता पार्टी केन्द्रीय चुनाव समिति ने गुजरात विधानसभा चुनाव-2022 के लिए निम्नलिखित नामों पर अपनी स्वीकृति प्रदान की है। (1/3) pic.twitter.com/Jk4YBdmzlk
— BJP (@BJP4India) November 10, 2022
ఎన్నికల తేదీలు, ఫలితాలు..
గుజరాత్‌లో అసెంబ్లీలోని 182 స్థానాలకు రెండు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. తొలి దశలో 89 స్థానాలకు డిసెంబర్ 1న, రెండో దశలో 93 స్థానాలకు 5న ఎన్నికలు జరపనున్నారు. డిసెంబర్ 8న కౌంటింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలనూ ప్రకటిస్తారు.
వరుసగా ఆరో సార్లు..
ఇక, 2017 ఎన్నికల్లో 99 సీట్లు గెలిచి వరుసగా ఆరో సారి ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేసింది. 77 సీట్లతో కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది. శాతాల వారీగా చూస్తే, చెల్లుబాటు అయ్యే ఓట్లలో బీజేపీకి 49.05 శాతం ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు 42.97 శాతం ఓట్లు వచ్చాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం