Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆంధ్రా స్కూళ్లల్లో.. వాటర్ బెల్ విధానం అమలు

ఆంధ్రా స్కూళ్లల్లో.. వాటర్ బెల్ విధానం అమలు

Phani CH

|

Updated on: Mar 31, 2025 | 9:13 PM

తెలుగు రాష్ట్రాలలో ఎండ దంచికొడుతోంది. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని వాతావరణశాఖ అధికారులు చెప్తున్నారు. ఈ క్రమంలో సమ్మర్‌పై ఏపీ ప్రభుత్వం యాక్షన్‌ ప్లాన్‌ రెడీ చేసింది. భానుడి భగభగలు పెరిగిపోవడంతో అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు సీఎం చంద్రబాబు. పాఠశాలల్లో ఇంటర్‌వెల్, లంచ్ బ్రేక్ మాత్రమే కాదు.. అదనంగా మరో బ్రేక్ రానుంది.

అదే వాటర్ బెల్. వేసవిలో విద్యార్థులు డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మార్నింగ్ 8.45 గంటలకు ఒకసారి.. 10.50 గంటలకి రెండోసారి.. 11.50 గంటలకు మూడోసారి బెల్ మోగించి.. ఐదు నిమిషాల చొప్పున స్టూడెంట్స్ మంచి నీళ్లు తాగేందుకు బ్రేక్ ఇవ్వనున్నారు. ఎండ వేడిమి సమాచారాన్ని మొబైల్ అలర్ట్స్ ద్వారా ఆయా ప్రాంతాల ప్రజలకు తెలియజేసి… వారు ఎండలబారిన పడకుండా జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. ముందస్తు జాగ్రత్తలతో వడదెబ్బ మరణాలు నివారించాలని యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. వేసవిని ఉంచుకుని తీవ్ర వడగాలులు వీచే ప్రాంతాల్లో మజ్జిగ కేంద్రాలు, చలివేంద్రాలు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలపై రోజూ మొబైల్ అలర్ట్స్ ద్వారా ప్రజలకు చేరవేయాలని సూచించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏటీఎం నుంచి పదే పదే డబ్బులు తీసే అలవాటుందా ?? మే 1 నుంచి మారనున్న ఈ నిబంధనలు తెలుసుకోవాల్సిందే

వినియోగదారులకు అలర్ట్‌.. ఏప్రిల్ 1 నుంచి రానున్న మార్పులివే !

ఈ అంకుల్ సైక్లింగ్ చూస్తే అవాక్కవ్వాల్సిందే.. నెట్టింట వీడియో వైరల్‌

అర్ధరాత్రి మిస్టరీ మహిళ సంచారం.. డోర్‌బెల్స్‌ మోగిస్తుండటంతో జనంలో భయం

భార్య వేధింపులతో నరకం చూస్తున్నా.. కాపాడండి బాబోయ్