అరె భయ్యా.. పాము అనుకున్నావా..? పొట్ల కాయ అనుకున్నావా?
ఎంతటి ధైర్యవంతుడైనా పాము అనగానే పదిగజాల దూరం పరిగెడతాడు. ఇక ఎదురుగా కనిపిస్తే ఏకంగా పై ప్రాణాలు పైకే పోయినంత షాక్ అవుతుంటారు. అయితే కొందరు మాత్రం బుసలు కొట్టే విషనాగులతో విన్యాసాలు చేస్తుంటారు. వాటిని మెడలో వేసుకోవడం, నడుముకు చుట్టుకోవడం వంటి పనులతో ఆకట్టుకుంటూ ఉంటారు.
అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్‌గా మారతాయి. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి కింగ్ కోబ్రా పామును పట్టుకున్న విధానం చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలో ఓ స్నేక్ క్యాచర్ కింగ్ కోబ్రాను పట్టుకున్న విధానం చూసి అంతా షాక్ అవుతున్నారు. పడగ విప్పిన కింగ్ కోబ్రా వద్దకు స్కేక్ క్యాచర్ వెళతాడు. ముందుగా.. తన కాలును పాము దగ్గరగా తీసుకెళతాడు. దీంతో ఆ పాము అతన్ని కాటేయడానికి బుసలు కొట్టింది. అయితే ఇంతలో అతను తన చేయిని పాము తలపైకి తీసుకెళ్లి, ఒక్కసారిగా దాని మెడను ఒడుపుగా క్షణాల్లో పట్టేసుకుంటాడు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే ఒట్టి చేతులతో పామును ఎంతో సులభంగా పట్టుకున్న తీరును చూసి అక్కడున్న వారికి మైండ్ బ్లాంక్ అయినంత పని అయింది. ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోన్న ఈ వీడియోపై నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. అది పాము అనుకున్నావా? పొట్ల కాయ అనుకున్నావా బ్రో అంటూ కొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తే.. మరికొందరు మాత్రం ఇలాంటి పనులు రిస్క్‌తో కూడుకున్నవని పోస్టులు పెడుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆంధ్రా స్కూళ్లల్లో.. వాటర్ బెల్ విధానం అమలు
ఏటీఎం నుంచి పదే పదే డబ్బులు తీసే అలవాటుందా ?? మే 1 నుంచి మారనున్న ఈ నిబంధనలు తెలుసుకోవాల్సిందే
వినియోగదారులకు అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి రానున్న మార్పులివే !
ఈ అంకుల్ సైక్లింగ్ చూస్తే అవాక్కవ్వాల్సిందే.. నెట్టింట వీడియో వైరల్
అర్ధరాత్రి మిస్టరీ మహిళ సంచారం.. డోర్‌బెల్స్ మోగిస్తుండటంతో జనంలో భయం