ఏటీఎం నుంచి పదే పదే డబ్బులు తీసే అలవాటుందా ?? మే 1 నుంచి మారనున్న ఈ నిబంధనలు తెలుసుకోవాల్సిందే
ఏటీఎం నుంచి మీకు పదే పదే డబ్బులు తీసుకునే అలవాటు ఉంటే ఆ అలవాటును మార్చుకోవాల్సిందే. ఎందుకంటే మే 1 నుంచి ఏటీఎం నుండి డబ్బు తీసుకోవడం ఖరీదైనదిగా మారబోతోంది. ఏటీఎం ఇంటర్‌చేంజ్ ఫీజులను పెంచడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. దీని కారణంగా ఇకపై విత్ డ్రా చేసినా.. లేదా హోమ్ బ్యాంక్ నెట్‌వర్క్ వెలుపల ఉన్న ATM నుండి బ్యాలెన్స్ తనిఖీ చేసినా.. దాని వల్ల మీకు మునుపటి కంటే కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది.
గతంలో మీరు మీ హోమ్ బ్రాంచ్ బ్యాంకు ఏటీఎం నుండి కాకుండా వేరే బ్యాంకు ఏటీఎం నుండి డబ్బు తీసుకుంటే రూ.17 చెల్లించాల్సి ఉండేది. ఇప్పుడు అది రూ. 19 అవుతుంది. ఇతర బ్యాంకు ATM నుండి బ్యాలెన్స్ తనిఖీ చేయడానికి, గతంలో 6 రూపాయలు చెల్లించాల్సి ఉండేది. ఇప్పుడది 7 రూపాయలకు పెరగనుంది. లావాదేవీ రుసుమును ఇతర బ్యాంకు ఏటీఎం నుండి మాత్రమే వసూలు చేస్తారు. మీరు ఉచిత లావాదేవీ పరిమితిని దాటినప్పుడు మెట్రో నగరాల్లో, హోమ్ బ్యాంక్ కాకుండా ఇతర బ్యాంకుల ఏటీఎంల నుండి ఉచిత లావాదేవీల పరిమితి 5 అయితే, మెట్రోయేతర నగరాల్లో ఉచిత లావాదేవీల పరిమితి 3. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పంపిన ATM ఫీజులను పెంచే ప్రతిపాదనను రిజర్వ్ బ్యాంక్ ఆమోదించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వినియోగదారులకు అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి రానున్న మార్పులివే !
ఈ అంకుల్ సైక్లింగ్ చూస్తే అవాక్కవ్వాల్సిందే.. నెట్టింట వీడియో వైరల్
అర్ధరాత్రి మిస్టరీ మహిళ సంచారం.. డోర్‌బెల్స్ మోగిస్తుండటంతో జనంలో భయం
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

