- Telugu News Photo Gallery Cricket photos Rajasthan Royals Player Riyan Parag Fined 12 Lakh for Slow Over Rate in IPL 2025 Match against CSK
IPL 2025: ధోని టీంపై సంచలన విజయం..కట్‌చేస్తే.. కెప్టెన్సీని విడిచిపెట్టే ముందు పరాగ్‌కు షాకిచ్చిన బీసీసీఐ
Riyan Parag Fined: ఐపీఎల్ 2025 11వ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై రాజస్థాన్ రాయల్స్ గెలిచినప్పటికీ, కెప్టెన్ రియాన్ పరాగ్ స్లో ఓవర్ రేట్ కారణంగా రూ.12 లక్షల జరిమానా విధించారు. అలాగే, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా ఇదే నిబంధనను ఉల్లంఘించినందుకు జరిమానా చెల్లించాల్సి వచ్చింది.
Updated on: Mar 31, 2025 | 10:03 PM

ఐపీఎల్ (IPL) 2025లో 11వ మ్యాచ్ చెన్నై వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగింది. ఆతిథ్య రాజస్థాన్ జట్టు ఈ మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. కానీ, ఈ విజయోత్సవం మధ్య, రాజస్థాన్ జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్‌కు బీసీసీఐ జరిమానా విధించింది.

చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ కెప్టెన్ పరాగ్ తన ఓవర్లను సకాలంలో పూర్తి చేయనందుకు బీసీసీఐ 12 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని ఇప్పుడు పరాగ్ మ్యాచ్ ఫీజు నుంచి తీసివేయనున్నారు.

ఈ సీజన్‌లో స్లో ఓవర్ రేట్‌కు దోషిగా తేలిన రెండవ కెప్టెన్ రియాన్ పరాగ్. అతని కంటే ముందు, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా ఈ నియమాన్ని ఉల్లంఘించినందుకు రూ. 12 లక్షల జరిమానా చెల్లించాడు. స్లో ఓవర్ రేట్‌కు పాల్పడినట్లు రుజువైతే ఐపీఎల్ జట్టు కెప్టెన్లు చెల్లించాల్సిన మొత్తం ఇది.

ఐపీఎల్ విడుదల చేసిన ఓ ప్రకటనలో, రియాన్ పరాగ్ బృందం స్లో ఓవర్ రేట్‌కు సంబంధించి చేసిన మొదటి నేరం ఇది కాబట్టి, ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని సెక్షన్ 2.22 కింద అతనికి రూ. 12 లక్షల జరిమానా విధించినట్లు పేర్కొంది.

రియాన్ పరాగ్ కంటే ముందు, ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానాకు గురయ్యాడు. ఆ మ్యాచ్‌లో, అతను ఒక మ్యాచ్ నిషేధం తర్వాత జట్టులోకి తిరిగి వచ్చాడు. స్లో ఓవర్ రేట్ నియమాన్ని మూడుసార్లు ఉల్లంఘించినందుకు అతనిపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. కానీ ఈ సంవత్సరం ఐపీఎల్ ప్రారంభానికి ముందే ఆ నియమాన్ని రద్దు చేశారు.





























