- Telugu News Photo Gallery Cricket photos Suryakumar Yadav becomes the 5th Indian batter to complete 8000 runs in T20 cricket after mi vs kkr ipl 2025 match
IPL 2025: 3 ఫోర్లు, 2 సిక్స్‌లు.. 300 స్ట్రైక్‌రేట్‌తో ఊచకోత.. కట్‌చేస్తే.. టీ20 క్రికెట్‌లో సూర్య మరో రికార్డ్
Suryakumar Yadav Records: ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించింది. ముంబై జట్టు 117 పరుగుల లక్ష్యాన్ని 12.5 ఓవర్లలోనే ఛేదించింది. ర్యాన్ రికెల్టన్ 62 పరుగులతో నాటౌట్‌గా, సూర్యకుమార్ యాదవ్ 27 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ టీ20 క్రికెట్‌లో అద్భుతమైన రికార్డ్ నెలకొల్పాడు.
Updated on: Apr 01, 2025 | 6:47 AM

సోమవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో లోకల్ టీం ముంబై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా జరిగిన 12వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు తొలి విజయాన్ని సాధించింది.

ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ టీ20 క్రికెట్‌లో మరో అద్బుత రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. పొట్టి ఫార్మాట్‌లో 8,000 పరుగులు చేసిన ఐదవ భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.

సూర్యకుమార్ తన 312వ ఇన్నింగ్స్‌లో ఈ మైలురాయిని చేరుకున్నాడు. టీ20లలో సూర్యకుమార్ సగటు 34, స్ట్రైక్ రేట్ 152గా నిలిచింది.

ఈ జాబితాలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, సురేష్ రైనాల సరసన సూర్యకుమార్ చేరాడు. ఈ ఫార్మాట్‌లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ 12,976 పరుగులు చేయగా, రోహిత్ 11,838 పరుగులు చేశాడు.

టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో, సూర్యకుమార్ 38 సగటుతో 2,598 పరుగులు చేశాడు. టీ20ఐలలో అతనికి నాలుగు సెంచరీలు కూడా ఉన్నాయి. ఇది ఒక భారతీయుడి రెండవ అత్యధిక సెంచరీలుగా నిలిచాయి.





























