రాహుల్ గాంధీకి కోర్టు రూ.200 ఫైన్.. ఇంతకీ కేసు ఏంటో తెలుసా?
లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీకి మళ్లీ కోర్టు చిక్కులు ఎదురయ్యాయి. స్వాంతంత్ర్య సమరయోధుడు వీర్‌సావర్కర్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో రాహుల్ హాజరుకాకపోవడంపై లక్నో కోర్టు సీరియస్ అయ్యింది. ఆయనకు రూ.200 జరిమానా విధించారు న్యాయమూర్తి. ఏప్రిల్ 14వ తేదీన రాహుల్‌గాంధీ కచ్చితంగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. వీరసావర్కర్ పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న కేసులో రాహుల్ గాంధీకి ఇప్పటికే పలు మార్లు లక్నో కోర్టు

లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీకి మళ్లీ కోర్టు చిక్కులు ఎదురయ్యాయి. స్వాంతంత్ర్య సమరయోధుడు వీర్‌సావర్కర్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో రాహుల్ హాజరుకాకపోవడంపై లక్నో కోర్టు సీరియస్ అయ్యింది. ఆయనకు రూ.200 జరిమానా విధించారు న్యాయమూర్తి. ఏప్రిల్ 14వ తేదీన రాహుల్‌గాంధీ కచ్చితంగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. వీరసావర్కర్ పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న కేసులో రాహుల్ గాంధీకి ఇప్పటికే పలు మార్లు లక్నో కోర్టు సమన్లు పంపింది. కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది.
2002 మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సావర్కార్‌పై రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదయ్యింది. బ్రిటీష్ వాళ్లకు సావర్కర్ పనిమనిషి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు రాహుల్‌గాంధీ. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. చరిత్రను రాహుల్ గాంధీ వక్రీకరించారని, సావర్కర్ వంటి ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుని అగౌరవపరిచారని విమర్శలు వెల్లువెత్తాయి. రాహుల్ వ్యాఖ్యలు కాంగ్రెస్, బీజేపీ మద్దతుదారుల మధ్య తీవ్ర చర్చకు దారితీసింది.
నృపేంద్ర పాండే అనే లాయర్ ఇచ్చిన ఫిర్యాదుపై లక్నోలో కేసు నమోదయ్యింది. సీఆర్‌పీసీ సెక్షన్ 156(3) కింద పాండే దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరపాలని కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలో తాజాగా కేసును విచారించిన కోర్టు రాహుల్ గాంధీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏప్రిల్ 14వ తేదీన రాహుల్ కోర్టుకు హాజరుకాకపోతే తీవ్ర చర్యలు తప్పవని న్యాయస్థానం హెచ్చరించింది.