Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎముకల బలానికి ఇది సూపర్‌ ఫుడ్‌.. మధుమేహంతో బాధపడేవారికి కూడా ఇది ఒక మంచి ఆప్షన్

ఎముకల బలానికి ఇది సూపర్‌ ఫుడ్‌.. మధుమేహంతో బాధపడేవారికి కూడా ఇది ఒక మంచి ఆప్షన్

Phani CH

|

Updated on: Apr 01, 2025 | 2:27 PM

40 దాటగానే ప్రతి ఒక్కరిలో ఎముకలు అరిగిపోవడం, కండరాల దృఢత్వం తగ్గిపోతుంటుంది. అంతేకాదు, అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. వీటిని తట్టుకోవడానికి రోగ నిరోధక శక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇందుకు పౌష్టికాహారం చాలా ముఖ్యం. మన వంటగదిలో ప్రతిరోజూ ఉపయోగించే వస్తువులు చాలా పోషకాలతో నిండినవే.. అందులో చిన్న నువ్వులు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయి. నువ్వులు మన శరీరానికి అవసరమైన అనేక పోషకాలు అందిస్తాయి.

నువ్వులు ఎముకల ఆరోగ్యానికి ఎంతో మంచి ఆహారం. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల సాంద్రతను పెంచి ఎముకల సమస్యలను దూరం చేస్తాయి. వృద్ధాప్యంలో ఎముకల నష్టాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. నువ్వులు చర్మానికి మంచి పోషకాలు అందిస్తాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ E ఉంటాయి. ఇవి చర్మానికి నష్టం కలిగించే విషయాలను తగ్గించి వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేస్తాయి. చర్మానికి తేమను అందించి మెరుపునిస్తాయి. జుట్టు సమస్యలు ఉన్నవారికి నువ్వులు వరంగా చెప్పవచ్చు. ఇందులో ఐరన్, జింక్, విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు రాలిపోవడాన్ని తగ్గించి చుండ్రు సమస్యను నివారిస్తాయి.. జుట్టు పెరుగుదలకు దోహదపడతాయి. అంతేకాదు, నువ్వులు గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. గుండె జబ్బుల నుంచి రక్షణ కల్పిస్తాయి. మధుమేహంతో బాధపడేవారికి నువ్వులు మేలు చేస్తాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సునీత లానే అంతరిక్షంలో చిక్కుకున్న ‘హీరో’

అరె భయ్యా.. పాము అనుకున్నావా..? పొట్ల కాయ అనుకున్నావా?

ఆంధ్రా స్కూళ్లల్లో.. వాటర్ బెల్ విధానం అమలు

ఏటీఎం నుంచి పదే పదే డబ్బులు తీసే అలవాటుందా ?? మే 1 నుంచి మారనున్న ఈ నిబంధనలు తెలుసుకోవాల్సిందే

వినియోగదారులకు అలర్ట్‌.. ఏప్రిల్ 1 నుంచి రానున్న మార్పులివే !

Published on: Mar 31, 2025 09:36 PM