AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేసవిలో చర్మాన్ని తాజాగా ఉంచేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి..! మిస్సవ్వకండి..!

చెమట, దురద, ఎరుపు కారణంగా చాలా మంది వేసవిలో చర్మ సమస్యలు ఎదుర్కొంటారు. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి స్నానం చేసే ముందు కొన్ని సహజ పదార్థాలను నీటిలో కలపడం వల్ల ఉపయోగకరంగా ఉంటుంది. ఆ పదార్ధాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వేసవిలో చర్మాన్ని తాజాగా ఉంచేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి..! మిస్సవ్వకండి..!
Glowing Skin
Prashanthi V
|

Updated on: Mar 31, 2025 | 10:33 PM

Share

వేసవిలో శరీరాన్ని తేమతో ఉంచడం ముఖ్యం. అందుకే ఎక్కువ ద్రవాలను తీసుకోవాలి. అలాగే వేడి వల్ల తలెత్తే అసౌకర్యాన్ని తగ్గించడానికి చల్లటి నీటితో స్నానం చేయడం మంచిది. సాధారణ నీటితో కాకుండా.. కొన్ని సహజ పదార్థాలతో స్నానం చేస్తే చర్మ ఆరోగ్యానికి మంచిది. ఇది రక్త ప్రసరణ మెరుగుపరచడమే కాకుండా.. ఒత్తిడిని తగ్గించి మెరుగైన నిద్రకు సహాయపడుతుంది.

శరీర నొప్పులను తగ్గించేందుకు అల్లం రసం ఉపయోగపడుతుంది. ఒక బకెట్ నీటిలో కొద్దిగా అల్లం పొడి లేదా అర కప్పు అల్లం రసాన్ని కలిపి స్నానం చేయాలి. ఇది చెమట వాసనను కూడా తగ్గిస్తుంది.

చర్మాన్ని పొడిబారకుండా ఉంచేందుకు ఆలివ్ నూనె ఉపయోగించాలి. ఇది తేమను కాపాడి చర్మాన్ని మెరుగు పరుస్తుంది. మొటిమలు ఉన్నవారు వైద్యుల సలహాతో ఆలివ్ నూనె ఉపయోగించాలి.

వేప నీటితో స్నానం చేయడం వల్ల చర్మ సమస్యలు తగ్గుతాయి. కొన్ని వేప ఆకులను నీటిలో మరిగించి, ఆ నీటిని చల్లారిన తర్వాత స్నానానికి ఉపయోగించాలి.

శరీరాన్ని చల్లగా ఉంచి మంచి సువాసన రావడానికి రోజ్ వాటర్ ఉపయోగపడుతుంది. 4-5 గులాబీ రేకులను మరిగించి ఆ నీటిని స్నానానికి ఉపయోగించాలి.

లావెండర్ ఆయిల్ ఒత్తిడిని తగ్గించి చెమట వాసనను దూరం చేస్తుంది. కొన్ని చుక్కలు లావెండర్ ఆయిల్ నీటిలో వేసి స్నానం చేయాలి.

పసుపు శరీరాన్ని శుభ్రం చేయడంలో సహాయపడుతుంది. కొద్దిగా పసుపును గోరువెచ్చని నీటిలో కలిపి స్నానం చేయాలి.

గంధపు నీరు ఒత్తిడిని తగ్గించి మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. కొద్దిగా గంధపు పొడిని లేదా గంధపు నూనెను నీటిలో కలిపి స్నానం చేయాలి.

తులసి ఆకులు శరీరాన్ని శుద్ధి చేయడంతో పాటు మానసిక ప్రశాంతతను పెంచుతాయి. కొన్ని తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటితో స్నానం చేయాలి. ఇలాంటి సహజ పదార్థాలను వేసవి స్నానాలలో ఉపయోగించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోండి.

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..