Gujarat Election 2022: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కొత్త వ్యూహం.. గెలుపు గుర్రాలను ముందుకు తీసుకొస్తున్న కమలనాథులు
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల పేర్లను ఖరారు చేసేందుకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. త్వరలో అభ్యర్థుల జాబితాను పార్టీ విడుదల చేయనుంది.

గుజరాత్‌లో ఎన్నికల హీట్ మొదలైంది. అభ్యర్థుల ఎంపికపై ప్రధాన పార్టీలు ఫోకస్ చేశాయి. గుజరాత్ ఎన్నికలకు సంబంధించి బీజేపీ భారీ సర్జికల్ స్ట్రైక్‌కు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఈసారి 25 శాతానికి పైగా కొత్త ముఖాలను రంగంలోకి దింపేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. బీజేపీ చేస్తున్న ఈ మార్పులో సీనియర్లపై వేటు పడనుంది. దీనికి సంబంధించిన పూర్తి బ్లూప్రింట్‌ను ఇప్పటికే బీజేపీ అధిష్టానం సిద్ధం చేసినట్లుగా సమాచారం. దాదాపు 14 నెలల క్రితం గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీని, ఆయన కేబినెట్‌లోని మొత్తం 22 మంది మంత్రులను తొలగించి.. తొలిసారిగా ఎమ్మెల్యే అయిన భూపేంద్ర పటేల్‌ను బీజేపీ ప్రమోట్ చేస్తోంది. తన మంత్రివర్గంలో 24 మంది కొత్త ముఖాలకు కూడా చోటు కల్పించారు. తొలగించిన నేతల్లో డిప్యూటీ సీఎం నితిన్ పటేల్, ప్రదీప్ సింగ్ జడేజాతోపాటు ఇతర నేతలు ఉన్నారు.
అధికార వ్యతిరేక వేవ్‌ను నివారించేందుకు బీజేపీ వ్యూహం ఏంటి?
ఢిల్లీ ఎంసీడీ, అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార వ్యతిరేక వేవ్ అధిగమించేందుకు బీజేపీ ఇంతకుముందు కొత్త ముఖాలందరినీ రంగంలోకి దింపింది. దీంతో ఎన్నికల్లో బీజేపీకి లాభం జరిగింది. గుజరాత్ మంత్రివర్గాన్ని మార్చడం ద్వారా ఇలాంటి ప్రయోగమే చేసింది బీజేపీ. రూపానీ కేబినెట్ నుంచి తొలగించిన 22 మంది మంత్రుల్లో 15 మందికి పైగా ఎమ్మెల్యేల టిక్కెట్లను బీజేపీ మారుస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అంతే కాదు విజయ్ రూపానీ, నితిన్ పటేల్ కూడా తాము అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోమని ఇప్పటికే ప్రకటించారు. గుజరాత్ కేబినెట్ మాజీ మంత్రి భూపేంద్ర సింగ్ చుడాసమా కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిరాకరించారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన 83 మంది అభ్యర్థుల్లో కూడా బీజేపీ 30 మందికి పైగా కొత్త ముఖాలపై ముందుకు తీసుకొస్తోంది.
బాధ్యత ఎవరు వహిస్తారు?
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు రాజకీయ పార్టీలకు ముక్కుసూటి అంశం. అభివృద్ధి, హిందుత్వ, దేశ భద్రత, సంస్థాగత వ్యూహాల ప్రాతిపదికన గుజరాత్‌లో ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ ప్రణాళిక రచించింది. ఈసారి బీజేపీ ఎన్నికలు కూడా మోదీ, షాలను ముందుంచనుంది.
ప్రధాని, అభివృద్ధి ఇమేజ్‌ను బీజేపీ క్యాష్ చేసుకునేందుకు..
గుజరాత్‌లో బీజేపీ ప్రధాని మోదీని, అభివృద్ధిని ఒకదానికొకటి పర్యాయపదాలుగా పెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. గుజరాత్ ఎన్నికలలో, ప్రధాని మోదీ ప్రతి ప్రసంగంలో అభివృద్ధిని ప్రస్తావిస్తారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం