Tollywood: ఇంట్లోనే పూల దండలు మార్చుకుని.. భార్యతో కలిసి మళ్లీ పెళ్లి పీటలెక్కిన టాలీవుడ్ స్టార్ సింగర్.. కారణమిదే
బుట్ట బొమ్మ సాంగ్ తో టాలీవుడ్ ఆడియెన్స్ కు ఫేవరెట్ సింగర్ గా మారిపోయాడు బాలీవుడ్ గాయకుడు అర్మాన్ మాలిక్. అంతుకు ముందు సోలో బ్రతుకే సో బెటర్, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా?, వకీల్ సాబ్ తదితర సూపర్ హిట్ సినిమాల్లో తన గొంతు వినిపించాడీ స్టార్ సింగర్.

దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్ లో పలు సూపర్ హిట్ పాటలను ఆలపించి స్టార్ సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు అర్మాన్ మాలిక్. తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్, కన్నడ, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, పంజాబీ, ఉర్దూ, మలయాళ భాషల్లో నూ పాటలు ఆలపించాడు అర్మాన్. తెలుగులో అయితే రక్త చరిత్ర 2, రౌడీ ఫెలో, కాటమరాయుడు, మహానుభావుడు, హలో, తొలిప్రేమ, ఏక్తా, అరవింద సమేత వీర రాఘవ, పడిపడి లేచే మనసు, మిస్టర్ మజ్ఞు, అలా వైకుంఠపురం, సోలో బ్రతుకే సో బెటర్, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా?, వకీల్ సాబ్, ఇచ్చట వాహనములు నిలపరాదు, టక్ జగదీష్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, మేజర్, థ్యాంక్యూ, ఓరి దేవుడా, గుర్తుందా శీతాకాలం, శాకుంతలం, స్కంద తదితర సినిమాల్లో పాటలు ఆలపించాడీ స్టార్ సింగర్. ముఖ్యంగా బుట్ట బొమ్మ పాటతో అర్మాన్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం వివిధ భాషల్లో పాటలు పాడుతూ బిజి బిజీగా ఉంటోన్న ఈ స్టార్ సింగర్ మరోసారి పెళ్లి చేసుకున్నాడు. అది కూడా తన ఇంట్లోనే పూల దండలు మార్చుకుని. అనంతరం తన పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో అవి కాస్తా వైరల్ గా మారాయి. మరి గతేడాదే ఆష‍్నా ష్రాఫ్ తో పెళ్లిపీటలెక్కిన అర్మాన్ మళ్లీ ఇప్పుడు ఆమెతో ఎందుకు ఏడడుగులు నడిచాడో తెలుసుకుందాం రండి.
బ్యూటీ బ్లాగర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా గుర్తింపు పొందిన ఆష‍్నా ష్రాఫ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అర్మాన్ మాలిక్. గతేడాది ఆగస్టులో వీరి నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత డిసెంబర్ లో పెద్దల సమక్షంలో పెళ్లిపీటలెక్కాడు. కట్ చేస్తే ఇప్పుడు మరోసారి తన ఇంట్లోనే పెళ్లి చేసుకున్నాడు. కాకపోతే ఈసారి తన పెళ్లిని రిజిస్టర్ చేయించాడు. ఈ సందర్భంగా మరోసారి ఇంట్లోనే తన భార్యతో కలిసి పూల దండలు మార్చుకున్నాడు. ఈ వేడుకలో అర్మాన్ తల్లిదండ్రులతో పాటు సోదరుడు అమాల్ మాలిక్ కూడా కనిపించాడు. ప్రస్తుతం ఈ పెళ్లి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
భార్యతో సింగర్ అర్మాన్ మాలిక్..
View this post on Instagram
గతేడాది డిసెంబర్ లో పెళ్లి.. మళ్లీ ఇప్పుడు..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




