రాజు అంటే రెబెలేరా.. రెబెల్ అంటే రాజేరా.! ప్రభాస్ స్పిరిట్ పోస్టర్ అదిరిపోయింది
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం స్పిరిట్. ఈ ప్రాజెక్ట్ అప్‌డేట్స్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఒక చిన్న ఆడియో గ్లింప్స్ రిలీజ్ చేశారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజా సాబ్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. హారర్ కామెడీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్, ట్రైలర్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. చాలా కాలం తర్వాత ప్రభాస్ ఎంటర్టైనర్ తో రాబోతున్నాడు. దాంతో ఈ మూవీ పై భారీ బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.
చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ డమ్ సొంతం చేసుకున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిన తర్వాత వరుసగా ఆఫర్స్ అందుకున్నారు కట్టాయి. అర్జున్ రెడ్డి సినిమాను బాలీవుడ్ లో కబీర్ సింగ్ టైటిల్ తో తెరకెక్కించి అక్కడ కూడా భారీ విజయాన్ని అందుకున్నాడు సందీప్. ఇక ఆ తర్వాత రణబీర్ కపూర్ తో చేసిన యానిమల్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇక ఇప్పుడు ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ బయటకు వచ్చిన దగ్గర నుంచే సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఊహించని విధంగా న్యూ గిఫ్ట్ గా పోస్టర్ ను విడుదల చేశాడు సందీప్. మాస్ మసాలా పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ అదిరిపోయింది. ఒంటినిండా గాయాలతో, నోట్లో సిగరెట్ తో, లాంగ్ హెయిర్ తో మాస్ లుక్ లో ప్రభాస్ అదిరిపోయాడు ఎదురుగా హీరోయిన్ తృప్తి కనిపిస్తుంది.. షర్ట్ లేకుండా, అదిరిపోయే బాడీతో ప్రభాస్ కనిపించడం తో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిపోయింది.
You loved what existed before. Now fall in love with what you never knew existed….#SPIRIT FIRST POSTER 🔥#OneBadHabit #Prabhas@imvangasandeep @tripti_dimri23 pic.twitter.com/J1Svt3E8uY
— Spirit (@InSpiritMode) December 31, 2025
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.




