వాళ్లు నాపైన చేతబడి చేయించారు.. కర్మ అనుభవించాల్సిందే.. సంచలన విషయం చెప్పిన సుమన్
సీనియర్ హీరో సుమన్.. ఒకప్పుడు హీరోగా అనేక విజయాలను అందుకున్నారు. ప్రస్తుతం సహయ నటుడిగా రాణిస్తున్నారు. క్రమంగా టాప్ హీరోగా నిలదొక్కుకుంటున్న సమయంలో.. కొన్ని ఊహించని వివాదాలు సుమన్ జీవితం, కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపించాయి. ప్రస్తుతం సహాయక పాత్రలు చేస్తూ రాణిస్తున్నారు.

టాలీవుడ్‌లో ఎంతో మంది స్టార్ హీరోలు ఇప్పుడు విలన్స్ గా మారి ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఒకప్పుడు స్టార్స్ గా రాణించిన హీరోలు ఇప్పుడు తన నటనతో, విలనిజంతో కట్టిపడేస్తున్నారు. వారిలో సీనియర్ నటుడు సుమన్ ఒకరు.. ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరో ఆయన. ఆయన సినిమాలు వస్తున్నాయంటే ప్రేక్షకులు థియేటర్స్ కు క్యూ కట్టేవారు. సుమన్ కు ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్ ఎక్కువగా ఉండేవారు. హీరోగా రాణించిన సుమన్.. అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామిగా కనిపించారు. ఆతర్వాత వచ్చిన రామదాసు సినిమాలో రాముడి పాత్రలో మెప్పించారు. ఈ రెండు సినిమాలు సుమన్ కెరీర్ లో మైలు రాళ్లు అనే చెప్పాలి. ప్రస్తుతం సుమన్ సహాయక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు.
ఇదెక్కడి సిరీస్ రా బాబు..! దైర్యం ఉన్నవాళ్లే చూడాల్సిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
కాగా గతంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. తన పై కొందరు చేతబడి చేయించారు అని చెప్పి షాక్ ఇచ్చారు సుమన్. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తనపై జరిగిన చేతబడి సంఘటన గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన జీవితంలో చేతబడి చాలా ప్రభావం చూపించిందని ఆయన అన్నారు. మీపై జరిగిన అక్రమ కేసులు, వాటి నుంచి మీరు కడిగిన ముత్యంలా ఎలా బయటపడ్డారో అందరికీ తెలుసు అని యాంకర్ ప్రశ్నించగా, ఈ చేతబడి జరిగింది. అది ఎవరు చేయించారో తనకు తెలియదని సుమన్ అన్నారు. ఎవరో గిట్టని వాళ్లు ఇలా చేశారని ఆయన అన్నారు.
45 మంది హీరోయిన్స్‌ను పరిచయం చేశా.. ఆమెతో ఏకంగా 25 సినిమాలు.. చంద్రమోహన్ చెప్పిన ఆసక్తికర విషయాలు
చేతబడి అనేది కేవలం గతం కాదని, ప్రస్తుత సమాజంలో, ముఖ్యంగా సినీ పరిశ్రమతో సహా వ్యాపార రంగాల్లో కూడా ఇప్పటికీ కొనసాగుతోందని సుమన్ అన్నారు. కేరళలోని చోటానిక్కర వంటి ప్రదేశాలు చేతబడి నివారణకు ప్రసిద్ధి చెందాయని ఆయన గుర్తు చేశారు. మంత్రాలు, క్షుద్రశక్తులు వ్యక్తులను మానసికంగా బలహీనపరచడానికి, కుటుంబం మధ్య మనస్పర్థలు సృష్టించడానికి ఉపయోగించబడతాయని చెప్పుకొచ్చారు. తనపై చేతబడి జరిగినప్పుడు కొందరు పెద్దలు సలహా ఇవ్వగా, తాను అక్కడికి వెళ్లి, కొన్ని పూజలు చేయించి, దాని దుష్ప్రభావాల నుంచి విముక్తి పొందినట్లు తెలిపారు సుమన్. ఈ సంఘటనలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయని, వాటిపై ప్రజల్లో అవగాహన ఉండాలని సుమన్ చెప్పుకొచ్చారు. కర్మ నుంచి ఎవ్వడూ తప్పించుకోలేడు. చేసిన దానికి కర్మ అనుభవించడం అంటే.. తప్పు చేసినవాడొక్కడే కాదు.. ఫ్యామిలీతో కలిసి అనుభవిస్తారు అని అన్నారు సుమన్ ఈ కామెంట్స్ మరోసారి వైరల్ గా మారాయి.
అతను తాగి వచ్చి పిచ్చికొట్టుడు కొట్టేవాడు.. బిగ్ బాస్ బ్యూటీ నైనిక ఎమోషనల్
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.




