- Telugu News Photo Gallery Cinema photos Kajal Aggarwal son Neil Kitchlu birthday celebrations photos go viral
Kajal Aggarwal: గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోలు చూశారా ఎంత క్యూట్‌గా ఉన్నారో
సినిమా కెరీర్ పీక్స్ లో ఉండగానే మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టింది టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. బిజినెస్ మ్యాన్ గౌతమ్ కిచ్లూను ప్రేమించి పెళ్లి చేసుకుంది. తమ అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా ఓ బాబుకు కూడా జన్మనిచ్చిందీ అందాల తార.
Updated on: Apr 21, 2025 | 10:38 PM

సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా కెరీర్ కొనసాగిస్తున్న వారిలో టాలీవుడ్ బ్యూటీ, పంచదార బొమ్మ కాజల్ అగర్వాల్ ఒకరు.

అప్పుడెప్పుడో లక్ష్మీ కల్యాణం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల తార ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ బిజి బిజీగా ఉంటోంది.

ఇటీవల సల్మాన్ ఖాన్ సికిందర్ లో ఓ కీలక పాత్ర పోషించింది కాజల్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.

సినిమాల సంగతి పక్కన పెడితే కాజల్ అగర్వాల్ ఇటీవల తన ముద్దుల కుమారుడు నీల్ కిచ్లూ పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది.

అనంతరం ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు కాజల్ కుమారుడికి బర్త్ డే విషెస్ చెబుతున్నారు.

కాగా కాజల్ అగర్వాల్ అక్టోబర్ 30, 2020న గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకుంది. వీరికి 2022 ఏప్రిల్ 19న నీల్ కిచ్లూ జన్మించాడు.




