AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: కరుడగట్టిన నేరస్తుడు అనుకునేరు.. అంతకుమించి.. అసలు విషయం తెలిస్తే షాకే

సరిగ్గా ఇప్పుడు కూడా అలాగే తనకల్లు మండలం నందిగానిపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీదేవి అనే మహిళను అదే గ్రామానికి చెందిన సాయికుమార్ అనే యువకుడు కత్తితో చంపేస్తానని బెదిరించాడు. ఏకంగా ఆ మహిళ ఇంట్లోకి వెళ్లి చేతిలో కత్తి పట్టుకుని చంపేస్తానని బెదిరించడంతో మహిళ తనకల్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Andhra: కరుడగట్టిన నేరస్తుడు అనుకునేరు.. అంతకుమించి.. అసలు విషయం తెలిస్తే షాకే
Andhra News
Nalluri Naresh
| Edited By: |

Updated on: Feb 24, 2026 | 9:13 AM

Share

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కొత్త ట్రెండ్ మొదలైంది అని చెప్పుకోవాలి. ముఖ్యంగా మహిళలు జోలికి వచ్చినవారికి పోలీస్ మార్క్ ట్రీట్మెంట్‌తో పాటు.. నలుగురిలో పరువు పోయే విధంగా స్ట్రీట్ వాక్ తప్పదా అంటే.. వరుస పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. సత్యసాయి జిల్లా కదిరిలో ఓ మహిళను ఇంట్లోకి వెళ్లి కత్తితో బెదిరించిన నిందితుడికి పోలీసులు తమదైన స్టైల్‌లో ట్రీట్మెంట్ ఇచ్చి స్ట్రీట్ వాక్ చేయించారు. ఆ మధ్య ఇలాగే కదిరిలో ఓ యువకుడు గర్భిణీ స్త్రీని కడుపుపై తన్నినందుకు నడిరోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లారు పోలీసులు.

సరిగ్గా ఇప్పుడు కూడా అలాగే తనకల్లు మండలం నందిగానిపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీదేవి అనే మహిళను అదే గ్రామానికి చెందిన సాయికుమార్ అనే యువకుడు కత్తితో చంపేస్తానని బెదిరించాడు. ఏకంగా ఆ మహిళ ఇంట్లోకి వెళ్లి చేతిలో కత్తి పట్టుకుని చంపేస్తానని బెదిరించడంతో మహిళ తనకల్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పటికే పలు దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉన్న సాయికుమార్‌ను.. లక్ష్మీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరెస్టు చేసి తమదైన శైలిలో ట్రీట్మెంట్ ఇచ్చారు. అలాగే చేతులకు బేడీలు వేసి, కాళ్లకు చెప్పులు లేకుండా ఎండలో రోడ్డుపై నడిపించుకుంటూ కోర్టుకు తీసుకెళ్లారు. తాను చేసిన దొంగతనాలపై లక్ష్మీదేవి మరిది ప్రభాకర్ రెడ్డి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడని…. పోస్టులు పెట్టొద్దని బెదిరించేందుకు సాయికుమార్ లక్ష్మీదేవి ఇంట్లోకి వెళ్లి కత్తితో బెదిరించాడు. ఈ విషయాన్ని సీరియస్‌‌‌‌గా తీసుకున్న పోలీసులు సాయికుమార్‌కు కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చారు అంటున్నారు కదిరి పబ్లిక్. ఇలా వరుస సంఘటనలు సత్యసాయి జిల్లాలో నేరం ఏదైనా.. నిందితులకు స్ట్రీట్ వాక్ తప్పదన్నట్లు పోలీసులు సంకేతాలు ఇస్తున్నారు.

Follow Us