Vijay Deverakonda-Rashmika Mandanna : ఆరావళి కొండల మధ్య విజయ్, రష్మిక పెళ్లి వేడుక.. ఆ ప్రదేశం ప్రత్యేకత ఏంటో తెలుసా.. ?
టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అభిమానులు పిలుచుకుంటున్నట్లు తమ పెళ్లికి విరోష్ అని పేరు పెట్టుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. వీరిద్దరి వివాహ వేడుక రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో జరగనుంది. ప్రస్తుతం ఈ జంట వివాహం గురించి రోజుకో న్యూస్ వైరలవుతుంది.

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా త్వరలోనే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరు ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఇదివరకే వీరి వివాహం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇటీవలే తమ పెళ్లి విషయాన్ని వీరిద్దరు అధికారికంగా ప్రకటించారు. ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 26న విజయ్, రష్మిక పెళ్లి వేడుక రాజస్థాన్ లోని ఉదయపూర్‌లో జరుగుతుంది. ఇప్పటికే రెండు కుటుంబాలు, బంధువులు, సన్నిహితులు ఉదయ్ పూర్ చేరుకుని పెళ్లి పనులు షూరు చేశారు. మరోవైపు వీరి వివాహ వేడుకకు సంబంధించి రోజుకో న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. అలాగే రష్మిక, విజయ్ ఇద్దరూ ఉదయ్ పూర్ లో పెళ్లి చేసుకోవడానికి గల కారణాన్ని.. అలాగే ఆ వేడుక జరిగే ప్రదేశం గురించి తెలుసుకోవడానికి జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Folk Song: ఏం పాట భయ్యా.. కుర్రాళ్లకు పిచ్చేక్కించేసింది.. యూట్యూబ్‌ను ఊపేసిన ఫోక్ సాంగ్..
వీరిద్దరి వివాహం జరిగే ప్రదేశం.. ఉదయపూర్ నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐటీసీ మెమెంటోస్ హోటల్‌లో జరగనుంది. ఇది ఆరావళి కొండల మధ్య 50 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ విలాసవంతమైన రిసార్ట్. ఇందులో ఒక రోజు గడపాలనుకుంటే దాదాపు రూ.91 వేలు చెల్లించాల్సి ఉంటుందట. వీరిద్దరు ఇక్కడ తమ పెళ్లి వేడుకను నిర్వహించడానికి ప్రధాన కారణం ప్రశాంతమైన వాతావరణం. అలాగే గోప్యత, భద్రత. రాజస్థానీ సంస్కృతిని ఆధునిక సౌకర్యాలతో మిళితం చేసే ఈ వేదిక రాచరిక నిర్మాణం, వివాహాన్ని అద్భుతంగా కనిపించేలా చేస్తుంది. ఈ వేదిక 1,00,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ఒక ఈవెంట్ స్థలం. ఇక్కడ ప్రారంభ స్థాయి గది అయిన వ్యాలీ వ్యూ విల్లా ధర రాత్రికి దాదాపు రూ.26,000. కొంచెం విలాసవంతమైన ఆరావళి సూట్‌ల ధర రూ.55,000. ఈ హోటల్ లోని అత్యంత విలాసవంతమైన మెమెంటోస్ సూట్స్ ధర రాత్రికి రూ.75,000 నుండి రూ.91,000 వరకు ఉంటుంది.
ఎక్కువ మంది చదివినవి : Ramya Krishna : రమ్యకృష్ణ కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. మొదటిసారి తనయుడి గురించి చెప్పిన కృష్ణ వంశీ..
ఇదంతా పక్కన పెడితే.. రష్మిక, విజయ్ వివాహం మూడు రోజులపాటు జరగనుంది. వివాహానికి ముందు కార్యక్రమాలు ఫిబ్రవరి 24, 2026న సంగీత్, మెహందీ వేడుకతో ప్రారంభమవుతాయి. 25న హల్దీ వేడుక ఉంటుంది. చివరగా ఫిబ్రవరి 26న వీరిద్దరి వివాహ వేడుక జరగనుంది. వీరి పెళ్లికి దాదాపు 100 మంది అతిథులు మాత్రమే హాజరుకానున్నట్లు సమాచారం.
ఎక్కువ మంది చదివినవి : Actress : రాజమౌళి మాటలతో నా గుండె పగిలిపోయింది.. ఆ సినిమా వదులుకోకుండా ఉండాల్సింది.. టాలీవుడ్ హీరోయిన్..
View this post on Instagram
ఎక్కువ మంది చదివినవి : Actress : ఏంట్రా బాబూ.. ఈ సీరియల్ బ్యూటీ ఇంతందంగా మారిపోయింది.. 100 పైగా సినిమాల్లో నటించింది..
