AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naga Babu: 3 ఏళ్ల చిన్నారికి గుండె సమస్య.. గొప్ప మనసు చాటుకున్న నాగబాబు.. వీడియో ఇదిగో

మెగా బ్రదర్ ఇప్పుడు రాజకీయల్లో బిజీగా ఉన్నారు. ఏపీ ఎమ్మెల్సీగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఆయన సినిమాలు, టీవీ షోలకు దూరంగా ఉంటున్నారు. వీటి సంగతి పక్కన పెడితే తాజాగా గొప్ప మనసు చాటుకున్నారు నాగబాబు.

Naga Babu: 3 ఏళ్ల చిన్నారికి గుండె సమస్య.. గొప్ప మనసు చాటుకున్న నాగబాబు.. వీడియో ఇదిగో
Actor Nagababu
Basha Shek
|

Updated on: Feb 24, 2026 | 6:55 AM

Share

ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, సినీ నటుడు నాగబాబు మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. గుండె సంబంధ వ్యాధితో ఇబ్బంది పడుతున్న 3 ఏళ్ల చిన్నారి కట్టా శ్రీహర్ష వైద్యఖర్చుల కోసం రూ. 1 లక్ష ఆర్థిక సహాయం అందజేశారాయన. సోమవారం (ఫిబ్రవరి 24) హైదరాబాద్ లో చిన్నారి కుటుంబ సభ్యులకు లక్ష రూపాయల క్యాష్ అందజేశారు. తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం తాటిపూడి గ్రామంకు చెందిన కట్టా రామకృష్ణ కుమారుడు కట్టా శ్రీహర్ష కూకట్ పల్లి అంకుర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాబు ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న నాగబాబు తీవ్ర విచారం వ్యక్తం చేసి. అనంతరం పిల్లాడి కుటుంబ సభ్యులకు రూ. 1 లక్ష ఆర్థిక సహాయం అందజేశారు. త్వరగా కోలుకోవాలని శ్రీహర్ష తండ్రికి ధైర్యాన్ని నింపారు. పసివాడి ప్రాణాలు కాపాడటానికి అవకాశం ఉన్నవారు చేతనైనంతలో సహాయం అందించాలని ఈ సందర్భంగా నాగబాబు పిలుపునిచ్చారు.

26 రోజుల క్రితం కట్టా శ్రీహర్ష అస్వస్థకు గురయ్యాడు. అత్యవసర పరిస్థితిని గుర్తించిన వైద్యులు చికిత్స ప్రారంభించారు. గుండె నుంచి రక్తం 10శాతం మాత్రమే పంపింగ్ అవుతుండడంతో వెంటిలేటర్ మీద చికిత్స అందించారు. మొదట రూ. 10 లక్షలు ఖర్చు అవుతాయని చెప్పినప్పటికీ, సీరియస్ కండిషన్ కారణంగా ఖర్చు పెరిగింది. ఇప్పటి వరకు 26 రోజులకు 13 లక్షల వరకు ఖర్చు అయ్యాయని, ఇంకా 10 లక్షలు అవుతాయని ఆసుపత్రి నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం బాబు పరిస్థితి కొంతమేరకు మెరుగ్గా ఉన్నది. బాబు తండ్రి కట్ట రామకృష్ణ సీసీ కెమెరా టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

కాగా చిన్నారి చికిత్సకు అందరూ తమ వంతు సాయం చేయాలని నాగబాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు పిల్లాడి తండ్రికి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ ను ఆయన తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో పోస్ట్ నెట్టింట బాగా వైరలవుతోంది. దీనిని చూసిన వారు తమకు చేతనైన సాయం చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
‘దావూద్’ బతికే ఉన్నాడా? డీ-కంపెనీ చీకటి సామ్రాజ్యం వెనుక నిజాలివే
‘దావూద్’ బతికే ఉన్నాడా? డీ-కంపెనీ చీకటి సామ్రాజ్యం వెనుక నిజాలివే
తెల్లవారుజామునే కలలో ఇవి కనిపించాయా? అయితే మీ పంట పడినట్లే!
తెల్లవారుజామునే కలలో ఇవి కనిపించాయా? అయితే మీ పంట పడినట్లే!
చిరంజీవితో స్వయంకృషి సినిమా.. ఆ సంఘటనే కారణం..
చిరంజీవితో స్వయంకృషి సినిమా.. ఆ సంఘటనే కారణం..
భారతదేశంలో టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. బెస్ట్‌ మైలేజీ..!
భారతదేశంలో టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. బెస్ట్‌ మైలేజీ..!
ఐపీఎల్ హిస్టరీలో భారీ జరిమానా.. అయ్యర్ పరిస్థితి అగమ్యగోచరం
ఐపీఎల్ హిస్టరీలో భారీ జరిమానా.. అయ్యర్ పరిస్థితి అగమ్యగోచరం
పెళ్లి విందులో మందు లేదా.. అయితే పైసలివ్వాల్సిందే
పెళ్లి విందులో మందు లేదా.. అయితే పైసలివ్వాల్సిందే
లోపల గ్యాస్ ఎంత ఉందో బయటి నుంచే కనిపించే సిలిండర్లు వచ్చేశాయ్..
లోపల గ్యాస్ ఎంత ఉందో బయటి నుంచే కనిపించే సిలిండర్లు వచ్చేశాయ్..
ప్రపంచ దేశాలకు గుడ్‌న్యూస్.. త్వరలోనే ఒపెన్ కానున్న హర్మూజ్!
ప్రపంచ దేశాలకు గుడ్‌న్యూస్.. త్వరలోనే ఒపెన్ కానున్న హర్మూజ్!
రణబాలి మూవీ అనంతపూర్ షెడ్యూల్ కంప్లీట్..
రణబాలి మూవీ అనంతపూర్ షెడ్యూల్ కంప్లీట్..
పాల మీగడతో అసలైన ఆవు నెయ్యిను ఈజీగా ఎలా తయారు చేయొచ్చో తెల్సా..
పాల మీగడతో అసలైన ఆవు నెయ్యిను ఈజీగా ఎలా తయారు చేయొచ్చో తెల్సా..